ఆలస్యంగా పడే వర్షాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు

వర్షాధార ప్రాంతాలలో అనిశ్చిత వర్షపాతం, తక్కువ వర్షపాతం, ఆలస్యంగా రుతుపవనాలు రావడం, తొందరగా ఆగిపోవడం, పంట కాలంలో ఎక్కువ రోజులు బెట్ట పరిస్థితులు వంటివి సర్వ సాధారణం. ఈ సంవత్సరం రాయలసీమ జిల్లాల్లో జూన్, జూలై మాసాల్లో కురవాల్సిన వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదైంది. ఇప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తక్కువ రోజుల్లో కోతకు వచ్చే పంటలు, బెట్ట పరిస్థితులను తట్టుకోగలిగే పంటలు, తక్కువ సాగు ఖర్చుతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. వ్యవసాయ పరిశోధనల ఆధారంగా వివిధ ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తున్నాం..

వర్షాధార ఎర్రనేలలు

ఆగస్టులో వేసుకోదగిన పంటలు: కంది, ఆముదం, అలసంద, ఉలవ, పొద్దుతిరుగుడు, పెసర, సజ్జ.

సెప్టెంబర్ లో వేసుకోదగిన పంటలు: కంది, ఆముదం, ఉలవ, అలసంద, పొద్దుతిరుగుడు, పెసర. జొన్న, సజ్జ

వర్షాధార నల్ల రేగడి నేలలు

ఆగస్టులో వేసుకోదగిన పంటలు: పత్తి (మొదటి వారం వరకు), కంది, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న (మొదటి వారం వరకు) జొన్న, కొర్ర, సజ్జ.

సెప్టెంబర్ లో వేసుకోదగిన పంటలు: కంది (మొదటి వారం వరకు), మినుము, పొద్దుతిరుగుడు, జొన్న, కొర్ర, సజ్జ.

కంది

అనువైన రకాలు: ఎల్.ఆర్.జి 41, ఎల్.ఆర్.జి 52, ఎల్.ఆర్.జి 105, టి.ఆర్.జి 59, లక్ష్మి, ఆశ, పి.ఆర్.జి 158, పి.ఆర్.జి 176 (ఉజ్వల).

విత్తన మోతాదు : ఎకరాకు 6 - 8 కిలోలు

విత్తన శుద్ధి : కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ పట్టించి విత్తన శుద్ధి చేయాలి.

విత్తే దూరం : 90 × 20 సెం.మీ.

ఎరువులు : చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని + 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం : ఎకరాకు 1.3 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీ. నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల లోపు నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 30, 60 రోజుల్లో గుంటక లేక గొర్రుతో అంతర కృషి తప్పనిసరిగా చేయాలి.

అలసంద

రకాలు : టిపిటిసి 29 విత్తే దూరం : 45 × 20 సెం.మీ

విత్తన మోతాదు : 8-10 కిలోలు ఎకరాకు

విత్తన శుద్ధి : రసాయన పద్ధతులతో కానీ జీవ సంబంధిత పద్ధతులతో కానీ విత్తనశుద్ధి తప్పక చేయాలి.

విత్తే దూరం : 30 x 10 సెం.మీ

ఎరువులు : ఎకరానికి 4 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం : ఎకరానికి 1.3 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీ. నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల లోపు నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25-30 రోజుల్లో కలుపు తీయాలి.

మొక్కజొన్న

రకాలు : డి హెచ్ యం -111, డి హెచ్ యం -113 , డి హెచ్ యం -115, డి హెచ్ యం -117, డి హెచ్ యం -119, డి హెచ్ యం -121,

పేలాల రకం : అంబర్ పాప్ కార్న్

తీపి రకం : మాధురి, ప్రియ

సంకర రకాలు : 8 కిలోలు / ఎకరానికి, 60 సెం.మీ × 20 సెం.మీ

పేలాల రకం : 4 కిలోలు / ఎకరానికి, 60 సెం.మీ × 20 సెం.మీ

తీపి రకం : 5 కిలోలు / ఎకరానికి, 60 సెం.మీ × 20 సెం.మీ

విత్తన శుద్ధి : కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజెబ్ లేదా థైరమ్ లేదా కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి.

ఎరువుల యాజమాన్యం : ఎకరానికి 72 నుండి 80 కేజీలు నత్రజని, 24 కేజీల భాస్వరం, 20 కేజీల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. వర్షాధారపు పంటకు 1/3 నత్రజని విత్తే సమయంలోను 1/3 నత్రజని 30 నుంచి 35రోజుల మధ్య, మిగిలిన మూడు వంతును 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరం ఎరువుని విత్తే సమయంలో, సగం పొటాష్ ఎరువుని విత్తే సమయంలో మిగతా సగం పొటాష్ ఎరువుని పూత దశలో వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం : పంట విత్తిన తర్వాత రెండు మూడు రోజుల్లోపు 1200 గ్రాముల అట్రాజిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు, గడ్డి జాతి కలుపు ను నివారించడానికి 115 గ్రాముల టెంబోట్రియోన్, 400 గ్రాముల అట్రాజిన్ పంట 15-18 రోజులుప్పుడు లేదా కలుపు నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాటి దలుపు మొక్కలు గమనిస్తే 2-4D సోడియం సాల్టు ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

అపరాలు (పెసర, మినుము)

రకాలు : ఎల్ బి జి-787, పి యు- 31, టి.వి.జి.-104, జి బి జి-1, ఎల్ బి జి-684

విత్తన మోతాదు, విత్తే దూరం : 8-10 కిలోలు / ఎకరానికి 30సెం.మీ × 10 సెం.మీ

ఎరువుల యాజమాన్యం : భూమిని బాగా దుక్కి దున్ని విత్తడానికి ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం ను ఇచ్చే ఎరువులను వేసి గొర్రుతో కలియదున్నాలి.

కలుపు నివారణకు అంతర కృషి : పెండిమిథాలిన్ ఎకరాకు 1నుండి 1.5 లీటర్ల లీటర్లు లేదా అలాక్లోర్ ఎకరాకు 1 లీ చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. వెడల్పాకు గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు 200 మిల్లీల ఇమజెతాఫిర్ ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని 20 నుండి 25 రోజులప్పుడు పొలంలో తేమగా ఉన్నప్పుడు, కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ