ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే అపరాల పంటలలో పెసర మరియు మినుము పంటలు ముఖ్యమైనవి. ఈ పంటలను ఖరీఫ్, రబీ (మెట్ట మరియు వరి మాగాణులలో మరియు వేసవి కాలంలో విరివిగా పండిస్తారు. భారతదేశం అపరాల సాగులో మొదటి స్థానంలో ఉంది. అపరాల సాగులో మన రాష్ట్రం ముఖ్య భూమికను పోషిస్తుంది. మినుము మరియు పెసర పంటలలో వివిధ వంగడాలు, వాటి గుణగణాలు వివరించడం జరిగింది. మినుము రకాలు ఎల్.బి.జి. 752 : అన్నికాలాలకు అనువైన రకం. 75-80 రోజుల కాలపరిమితి గల రకం. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణులలో అధికంగా వినియోగించే రకం. హెక్టారుకు 15-18 క్వి. దిగుబడినిస్తుంది. ఎల్.బి.జి. 645 : రబీ, వరి మాగాణులకు అనువైనది. 85-90 రోజుల కాలపరిమితి గల రకం. ఎండు తెగులును తట్టుకునే లావు గింజ గల పాలిష్ రకం. హెక్టారుకు 20–22 క్వి. దిగుబడినిస్తుంది ఎల్.బి.జి. 648 : రబీ, వరి మాగాణులకు అనువైనది. 90-95 రోజుల కాలపరిమితి గల రకం. ఎండు తెగులును తట్టుకునే పాలిష్ రకం. బూడిద, అకుమచ్చ, తుప్పు తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకు 20-22 క్వి. దిగుబడి నిస్తుంది ఎల్.బి.జి. 787 (తులసి) : అన్ని కాలాలకు అనువైన మధ్యస్థ కాలపరిమితి గల రకం. పంట కాలం 75-80 రోజులు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. కాండం కణువులు వద్ద కూడా కాపు వస్తుంది. మధ్యస్థ లావు గింజలు గల పాలిష్ రకం. హెక్టారుకు 20-22 క్వి.ల దిగుబడినిస్తుంది. టి.బి.జి. 104 : అన్ని కాలాలకు అనువైన రకం. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 70-75 రోజులు. హెక్టారుకు 20-22 క్వి.ల. దిగుబడి ఇస్తుంది. జి.బి.జి. 1 : అన్ని కాలాలకు అనువైన రకం. పంట కాలం 70-75 రోజులు. మధ్యస్థ లావు గింజలు గల పాలిష్ రకం. పల్లాకు తెగులును తెట్టుకునే రకం. హెక్టారుకు 20–22 క్వి.ల దిగుబడినిస్తుంది. వరి మాగాణులలో కూడా సాగుకు అనువైనది. ఎల్.బి.జి. 884 : అన్ని కాలాలకు అనువైన రకం. పంట కాలం 75-80 రోజులు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. హెక్టారుకి 20-22 క్వి.ల దిగుబడినిస్తుంది. ఎల్.బి.జి. 904 : అన్ని కాలాలకు అనువైనది. పల్లాకు తెగులును తెట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణులకు కూడా అనువైనది. పంట కాలం 85-90 రోజులు. దిగుబడి హెక్టారుకు 22-25 క్వి.ల దిగుబడి ఇస్తుంది. టి.బి.జి. 129 : అన్ని కాలాలకు అనువైన రకం. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 85-90 రోజులు. హెక్టారుకు 22-25 క్వి.ల. దిగుబడి ఇస్తుంది. ఎల్.బి.జి. 932 : విడుదలకు సిద్ధంగా ఉన్న రకము అన్ని కాలాలకు అనువైనది. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణులకు కూడా అనువైనది. పంట కాలం 85– 90 రోజులు. దిగుబడి హెక్టారుకు 22-25 క్వి.ల ఇస్తుంది. పెసర పంటలో ముఖ్యమైన రకాలు ఎల్.జి.జి. 460 : పంట కాలం 65-70 రోజులు, కాయలు గుత్తులుగా పై భాగంలో ఉండి, ఒకేసారి కోతకు వస్తుంది. పల్లాకు తెగులు కొంత వరకు తట్టుకుంటుంది. మెట్ట మరియు వరి మాగాణులకు అనువైన రకం. దిగుబడి హెక్టారుకు 15-16 క్వీ. ఇస్తుంది. టి.యం. 96-2: అన్ని కాలాలకు అనువైన రకం. 60– 65 రోజుల కాల పరిమితి కలిగి, బూడిద తెగులును తట్టుకుం టుంది. గింజలు లావుగా ఉండి మెరస్తుంటాయి. హెక్టారు 12– 15 క్వి.ల దిగుబడినిస్తుంది. డబ్ల్యు.జి.జి. 42 : అన్ని కాలాలకు అనువైన రకం. 55- 60 రోజుల కాల పరిమితి కలిగి బూడిద తెగులును తట్టుకుం టుంది. గింజలు లావుగా ఉండి మెరస్తుంటాయి. హెక్టారు 10-12 క్విల దిగుబడినిస్తుంది. ఐ.పి.యం. 2- 14 : ఈ వంగడం దక్షిణ భారతదేశంలో సాగుకు విడుదల చేయడం జరిగింది. కాలపరిమితి 60-65 రోజులు, పల్లాకు తెగులును తట్టుకుంటుంది. దిగుబడి హెక్టారుకు 12-14 క్విల దిగుబడినిస్తుంది. ఎల్.జి.జి. 574 : రబీ మరియు వరి మాగాణులకు అనువైనది. పంట కాలం 65-70 రోజులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 15-16 క్వి. దిగుబడి ఇస్తుంది. ఎల్.జి.జి 607 : కాల పరిమితి 60-65 రోజులు, అన్ని కాలాలకు అనువైనది. పల్లాకు తెగులును తట్టుకునే రకం. వరి మాగాణులకు కూడా అనువైనది. హెక్టారుకు 15-17 క్వి. దిగుబడినిస్తుంది. ఎల్.జి.జి 630 : అన్ని కాలాలకు అనువైనది. పంట కాలం 65-70 రోజులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకు 16-18 క్వి. దిగుబడి ఇస్తుంది. ఎల్.జి.జి. 600 : రబీ, వరి మాగాణులకు అనువైనది. పంట కాలం 70-75 రోజులు. పల్లాకు తెగులును తట్టుకుం టుంది. హెక్టారుకు 16-18 క్వి. దిగుబడి ఇస్తుంది. ఎల్.జి.జి. 610 : రబీ, వరి మాగాణులకు అనువైనది. పంట కాలం 70-75 రోజులు. పల్లాకు తెగులును తట్టుకుం టుంది. హెక్టారుకు 16-18 క్వి. దిగుబడి ఇస్తుంది. మురుగు నీరు నిలవని, తేమను నిలుపుకోగల, చౌడు లేని భూములు అనువైనవి. మినుము ఎకరాకు 8-10 కిలోలు (మెట్టలో) 16–18 కిలోలు (వరి మాగాణులలో) పెసర ఎకరాకు 6-8 కిలోలు (మెట్టలో) 12-15 కిలోలు (వరి మాగాణులలో) కిలో విత్తనానికి 2.5 గ్రా. థైరమ్/కాప్టాన్/మాంకోజెబ్ /కార్బండజిమ్ వంటి తెగుళ్ల మందులతో మరియు 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్ళు మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించు కోవచ్చు. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక డా.ఎన్.హరి సత్యనారాయణ ప్రధాన శాస్త్రవేత్త (మొక్కల ప్రజనన శాస్త్రం) అపరాల విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు.