వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, మరియు ఆ వ్యవసాయం దేశ జనాభాలో దాదాపు సగం మందికి జీవనోపాధిని అందించడమే కాకుండా దేశ ఆహార భద్రతకు ఆధారం కూడా. 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే దార్శనికతను మేము చురుకుగా అమలు చేస్తున్నాము మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అభివృద్ధి చెందిన వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు రైతుల శ్రేయస్సు యొక్క బలమైన పునాది వేయడం చాలా అవసరం. దేశవ్యాప్తంగా రైతులను పరిశోధన- సాంకేతికత చేరుకోవడానికి వీలుగా వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఒక చొరవ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. ఖరీఫ్ మరియు రబీ పంటల విత్తే సీజన్లకు ముందు ఈ ప్రచారం ఏటా ప్రారంభించబడుతుంది. ఈ ప్రచార ఉద్యమాన్ని ఖరీఫ్, రబీ.. ఈ రెండు పంటకాలాల కన్నా ముందుగా ఏటా మొదలుపెడతారు. 2025 ఖరీఫ్ ప్రచారం మే 29 - జూన్ 12, 2025 మధ్య జరగనుంది. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ ప్రధాన ఉద్దేశం దేశంలోని 145 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతను సమకూరుస్తూనే, పోషకాహారం లభించేటట్లు హామీని ఇవ్వడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంతోపాటు రాబోయే తరాల వారి కోసం ప్రాకృతిక వనరులను సంరక్షించడం కూడా . ఈ లక్ష్యాలను సాధించడానికి, మంత్రిత్వ శాఖ ఆరు అంశాల వ్యూహాన్ని నిర్దేశించింది: అవి.. ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, ఉత్పత్తికి సరి అయిన ధర లభించేటట్టు చూడడం, ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే నష్టాలకు పరిహారాన్ని చెల్లించడం, విలువ జోడింపు-ఆహార శుద్ధి ప్రకియలను అనుసరించేటట్లు చూస్తూ పంటల వివిధీకరణను ప్రోత్సహించడంతోపాటుగా ప్రాకృతిక- సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించే దిశలో ఆలోచనలను ప్రోత్సహించడం. ప్రచారం గురించి ‘‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’’ ఐసీఏఆర్కు చెందిన 113 పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రగతిశీల కర్షకులు, ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓలు).. వీటన్నింటి ప్రయత్నాలను సంఘటితం చేస్తుంది. ఈ సహకారపూర్వక వైఖరి ఉద్దేశమల్లా వాస్తవ కాల వ్యావసాయిక అవసరాలతో వైజ్ఞానిక పరిశోధనను సంధానపరచడమే. ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక్కొక్క బృందంలోనూ కనీసం నలుగురు చొప్పున ఉండే మొత్తం 2,170 నిపుణుల బృందాలు ఈ నెల 29 మొదలు జూన్ 12 మధ్య కాలంలో 723 జిల్లాల్లో 65,000కు పైగా గ్రామాలను సందర్శిస్తాయి. ఈ బృందాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ప్రగతిశీల రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీఓ)లకు చెందిన సిబ్బంది కూడా ఉంటారు. వారు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కార్యక్రమాలను నిర్వహిస్తూ రైతులతో నేరుగా సంప్రదింపులు జరుపుతారు. ఈ బృందాలు స్థానికంగా వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడి నేలల్లో పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి, నీటి లభ్యత ఎలా ఉంది, వర్షపాతం ఎంత మేరకు ఉంటోంది.. ఇవి మదింపు చేస్తాయి. వారు భూ స్వస్థత కార్డులను పరిశీలించి, ఏయే పంటలను వేయాలి, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, నాట్లను ఏ పద్ధతిలో వేయాలి, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించడం, పంటను తక్కువ ఖర్చులో ఎలా పండించాలి, భూ స్వస్థతను మెరుగుపరచడానికి ఏయే చర్యలు చేపట్టాలి.. ఇవన్నిటినీ సిఫారసు చేస్తారు. ప్రచారం యొక్క ఆశించిన ఫలితం ఈ ప్రచార ఉద్యమాన్ని రెండు విధాలైన మాటామంతీ రూపంలో అమలు చేయదలచారు. రైతులు వారికి ఎదురైన సవాళ్లను వెల్లడిస్తారు. ప్రశ్నలు వేస్తారు. చీడలు సోకడం వంటి క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తారు. వీటి ఆధారంగా భావి పరిశోధన ఎలా సాగాలో కొలిక్కి వస్తుంది. 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), ఐసీఏఆర్ శాస్త్రవేత్తల ఉమ్మడి శక్తిని ఈ కార్యక్రమం వినియోగించుకొంటుంది. ఈ విధంగా విజ్ఞానశాస్త్రం, సాగు సంబంధ పురోగతి చెట్టపట్టాల్ వేసుకొంటాయి. ఒక కోటీ ముప్ఫయ్ లక్షల మందికి పైగా కిసాన్లు ప్రత్యక్షంగా దీనిలో భాగస్వాములు అవుతారన్న అంచనా ఉంది. ఇంత పెద్ద ఎత్తున జరగనున్న ఈ వినూత్నమైన, అన్ని వర్గాలను కలుపుకొని పోయే కార్యక్రమం మన దేశంలో వ్యావసాయిక మార్పు, చైతన్యాలకు ఒక కొత్త దిశను చూపనుంది. మూలం: పిఐబి