పండ్ల తోటలలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం పండ్లతోటల పెంపకంలో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు జింక్, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, బోరాన్, రాగి వంటి సూక్ష్మపోషకాలు కూడా మొక్కల ఎదుగుదలకు,పూత-కాత నిలకడకు, పండ్ల నాణ్యతకు అత్యంత కీలకం. ఇవి మొక్కకు అతి తక్కువ మోతాదులో మాత్రమే అవసరమైనప్పటికీ, వీటి లోపం ఏర్పడితే దిగుబడి, నాణ్యత గణనీయంగా పడిపోతాయి. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష చేయించి, ఏ పోషకం లోపిస్తుందో గుర్తించి తగిన మోతాదులో ఎరువుల్ను వేయాలి. సేంద్రియ ఎరువులు (పశు వుల ఎరువు, వర్మీకంపోస్టు) ఎక్కువగా వాడటం వలన నేలలో సూక్ష్మ పోషకాల లభ్యత మెరుగవు తుంది. చిలే టెడ్ రూపంలో ఉన్న సూక్ష్మపోషకాలు ఆకుల ద్వారా వేగంగా, సమర్థవంతంగా గ్రహించ బడతాయి. నేల pHను సమతుల్యంగా ఉంచడం ద్వారా (6.0-7.5 మధ్య) చాలా సూక్ష్మపోషకాల లభ్యత మెరుగుపడుతుంది. జింక్ లోపం జింక్ లోపం మామిడి, నిమ్మజాతి పండ్లు, జామ, ద్రాక్ష తోటలలో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఈ లోపం ఉన్నప్పుడు కొత్తగా వచ్చే ఆకులు సాధారణ పరిమాణం కంటే చాలా చిన్నవిగా, తయారవుతాయి. ఈ చిన్న ఆకులు కొమ్మచివర్లలో గుత్తులుగుత్తులుగా (రోసెట్అకారంలో) ఏర్పడటం జింక్ లోపానికి ప్రత్యేకగుర్తు, దీనినే 'బుడ్డఆకుతెగులు' అని రైతులు పిలుస్తారు. ఆకుల ఈనెల మధ్య భాగం పసుపురంగులో కనిపిస్తుంది, ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. జింక్ లోపం ఎక్కువైతే కొమ్మలు చిన్నవిగా మారి ఎదుగుదల ఆగిపో తుంది. పూత గణనీయంగా తగ్గుతుంది. నివారణ: జింక్ సల్ఫేట్ 0.5% (ఒక లీటరు నీటికి 5 గ్రాములు) పూతదశకు ముందు రెండుసార్లు 15-20 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇనుము లోపం ఈ నెల మధ్యభాగం పూర్తిగా పసుపు రంగులోకి లేదా దాదాపు తెల్లగా మారిపోతుంది, అయితే ఈనెలు మాత్రం స్పష్టంగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి . దీనిని 'ఇంటర్వైనల్ స్క్లెరోసిస్' అంటారు. లోపం తీవ్రమైతే ఆకుమొత్తం తెల్లగామారి, అంచుల వద్ద ఎండిపోవడం మొదలవుతుంది. నివారణ : ఫెర్రస్ సల్ఫేట్ (0.5%) లేదా చిలేటెడ్ ఇనుము 2–3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మాంగనీస్ లోపం మాంగనీస్ లోపం మామిడి, జామ, బొప్పాయి తోటలలో కనిపిస్తుంది. ఇది ఇనుము లోపాన్ని పోలి ఉన్నా, తేడా ఏమిటంటే మాంగనీస్ లోపం ఎక్కువగా పండిన (పాత) ఆకులపై కనిపిస్తుంది. పసుపు రంగుమచ్చలు మచ్చలుగా, కొంచెం చెదురు మదురుగా (మొజాయిక్) ఏర్పడతాయి. ఆకు ఈనెలు ఎక్కువ భాగం ఆకుపచ్చగానే ఉంటాయి, కానీ ఈనెల మధ్య మచ్చల మాదిరిగా పసుపు రంగు కనిపిస్తుంది. తీవ్రత తక్కువగా ఉంటుంది, కానీదీర్ఘకాలం కొనసాగితే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. నివారణ : మాంగనీస్ సల్ఫేట్ 0.3% గాఢతలో (3 గ్రా లీటరు నీటికి కలిపి ) పిచికారీ చేయాలి. మెగ్నీషియం లోపం మెగ్నీషియం లోపం ద్రాక్ష, నిమ్మ జాతిపండ్లు, యాపిల్ తోటలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొటాషియం ఎరువులు అధికంగా వాడినప్పుడు ఈలోపం తీవ్రమ వుతుంది. దీనిప్రధాన లక్షణం పండిన (పాత) ఆకుల అంచులనుండిమొదలై లోపలికి పాకుతూ పసుపు లేదా ఎరుపు-ఊదారంగులోకి మారడం, మధ్యభాగం ండిపోతుంది -మాత్రం కొంతకాలం ఆకుపచ్చగా ఉ దీనిని 'క్రిస్మస్ ట్రీ' మాదిరి లక్షణం అని కూడా అంటారు. తీవ్రమైన లోపంలో ఆకులు ముందుగానే రాలిపో తాయి. నివారణ : మెగ్నీషియం సల్ఫేట్ 1-2% గాఢతలో (10– 20 గ్రాములు లీటరునీటికి కలిపి ) పిచికారీ చేయాలి. నేలలో వేసే ఎరువుగా కూడా మెగ్నీషియంసల్ఫేట్ను బేసిన్లో వేయవచ్చు. బోరాన్ లోపం దానిమ్మ, మామిడి, పుచ్చకాయ తోటలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆకులపై కంటే ఎక్కువగా కొమ్మలు, పండ్లపై ప్రభావం చూపుతుంది. కొమ్మల చివర్లు (టెర్మినల్ షూట్) ఎండిపోవడం (డై-బ్యాక్), కొత్త ఆకులు చిన్నవిగా, గరుకుగా, పెళుసుగా మారడం కనిపి విస్తుంది. పండ్లపై గరుకైన, పగుళ్లు వచ్చిన మచ్చలు ఏర్ప డతాయి, పండు లోపల గుజ్జు గట్టిపడి, రుచి తగ్గిపోతుంది. పూత రాలిపోవడం, కాయకట్టే శాతం తగ్గడం కూడా బోరాన్ లోపానికి సంకేతాలు. నివారణ : బోరాక్స్ 0.1-0.2% గాఢతలో (1-2గ్రా. లీటరు నీటికి) పూతదశకు ముందు,పిందెదశలో పిచికారీ చేయాలి. బోరాన్ మోతాదుకుమించితే మొక్కకు హానికరం కాబట్టి సిఫారసు చేసిన మోతాదునే పాటించాలి. నేలలో వేసేటప్పుడు ఎకరాకు 4-5 కిలోల బోరాక్స్ను సేంద్రియ ఎరువులతో కలిపివేయవచ్చు. రాగి / కాపర్ లోపం రాగి (కాపర్) లోపం నిమ్మజాతి పండ్లు, మామిడి తోటలలో, ముఖ్యంగా ఇసుక నేలలు లేదా సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న నేలల్లో కనిపిస్తుంది. దీనిప్రధాన లక్షణం కొమ్మలచివర్లు ఎండిపోవడం (డై-బ్యాక్), కొత్తచిగుళ్ళు వంకరగా, వికృతంగా పెరగడం. కొన్నిసందర్భాల్లో కొమ్మలపై జిగురు వంటి పదార్థం స్రవించడం (గమ్మోసిస్) కనిపిస్తుంది. ఆకులు సాధారణం కంటే ముదురు ఆకుపచ్చ రంగులో, చిన్నవిగా, వంకరగా మారతాయి. నివారణ : కాపర్ఆక్సీక్లోరైడ్ లేదా కాపర్ సల్ఫేట్ను 0.2-0.3% గాఢతలో పిచికారీ చేయాలి. కాపర్ శిలీంద్ర నాశనిగా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది ఏక కాలంలో కొన్ని శిలీంధ్ర తెగుళ్ళను కూడా అరికడుతుంది. ఆధారం: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ జె. దివ్య, శాస్త్రవేత్త(ప్లాంట్ పెథాలజీ), ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి