సోయాచిక్కుడు పంటలో చీడపీడల బెడద - సమర్థవంతమైన నివారణ చర్యలు సోయాచిక్కుడు మన దేశంలో పండించే ముఖ్యమైన నూనె గింజల పంట. ఇందులో 43% మాంసకృత్తులు, 20-22% నూనె కలిగి ఉంటుంది. ఈ పంటను సుమారు 129 లక్షల హెక్టార్లలో సాగుచేస్తే 126 మిలియన్ టన్నుల దిగుబడిని, హెక్టారుకు 15.02 క్వింటాళ్ల ఉత్పాదకత పొందుతారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో సాగవుతున్న అత్యంత ముఖ్యమైన పంట. పురుగులు, వ్యాధులు యాజమాన్యం సోయా పంటలోకాండం ఈగ, కాండం తొలిచే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్ల దోమ, పేను బంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెల్ల దోమ ద్వారా వైరుస్ తెగుల్ల వ్యాప్తి ఉధృతి ఎక్కువగా ఉంది పూత రాలి పొయి కాయలో గింజలు ఎర్పడక దిగుబడి తగ్గుతుంది. బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆలస్యంగా విత్తినప్పుడు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాండం ఈగ, కాండం తొలిచే పురుగు నివారణకు 25-30 రోజుల పంట దశలో 1.25 మి.లీ బీటా సైపూత్రిన్ + ఇమిడాక్లోప్రిడ్ 300 ఒ.డి. (8.49 + 19.81 % డబ్ల్యూ, / డబ్ల్యూ.) లేదా 0.4 మి.లీ థయామిథాక్సామ్, ల్యామ్డా సైహ లోత్రిన్ జెడ్. సి (12.6 % + 9.5 % డబ్ల్యూ, /డబ్ల్యూ.) లేదా 0.3 మి.లీ క్లోరాంట్రానిలిప్రోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 0.3 గ్రాముల ఎసిటామిప్రిడ్ 20% యస్.పి.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి పది చొప్పున అమర్చినట్లయితే తెల్ల దోమ ఉధృతిని అదుపు చేయవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మిల్లీ లీటర్ డయాపెంథియురాన్ 50% డబ్ల్యూ. పి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సొయచిక్కుడులో పంట పూత దశ తరువాత తెగుల్ల అధిక వ్యాప్తి ఉంటుంది. తెగుళ్ళలో ముఖ్యమైనవి కాయకుళ్ళు తెగుల్లు, అంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు, రైజోక్టినీయ తెగులు, మసి బొగ్గు తెగులు. వీటి నివారణకు, 2.5 గ్రాముల టెబుకోనజోల్ 10% + సల్ఫర్ 65 % డబ్ల్యు. జి. లేదా 1 మి. ల్లి ప్రొపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆధారం : వ్యవసాయ పాడిపంటలు , వ్యవసాయ పరిశోధనా స్థానం, ముధోల్.