రాష్ట్రంలో వరి సాగు: వివిధ కాలాల్లో అనువైన వరి రకాల ఎంపిక రాష్ట్రంలో పండించే 127 లక్షల టన్నుల ధాన్యం నుంచి 80 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోంది. మన రాష్ట్ర అవసరాలకు సుమారు 50 లక్షల టన్నుల బియ్యం సరిపోతుంది. మిగిలిన 30 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయటం వల్ల రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. సార్వా తినడానికి అనువైన మిక్కిలి సన్న గింజ రకాలు అంటే 1000 గింజల బరువు 15 గ్రాముల కన్నా తక్కువగా ఉన్న రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు అంటే 1000 గింజల బరువు 18-20 గ్రాములు ఉన్న రకాలు, ఎగుమతికి అనువైన పొడుగు సన్న గింజ రకాలు సాగు చేయడం మంచిది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించిన సాంబ మసూరి (బీపీటీ 5204), స్వర్ణ (ఎంటియు 7029), కాటన్ దొర సన్నాలు (ఎంటియు-1010) రకాలు మన రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బియ్యం ఉత్పత్తి, మార్కెట్లో తమదైన ముద్రవేశాయి. మన రాష్ట్రంలో రాయలసీమ, కృష్ణా మండలం అయిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలలో సుమారు 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మిక్కిలి సన్నగింజ రకాలను సాగు చేస్తున్నారు. కేరళ మార్కెట్లో ఉప్పుడు బియ్యానికి గోదావరి జిల్లాలో దాళ్వా లో ఎం.టీ.యూ 3626 (ప్రభాత్) రకం సుమారు 70000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. ధాన్యం ఎక్కువ ఉ త్పత్తి చేసే గోదావరి, ఉత్తర కోస్తా మండలంలో సన్న గింజ రకాల సాగు తక్కువగా ఉన్నది. సార్వాలో మెరక భూముల్లో సన్నగింజల రకాలు సాగు పెంచుకుంటూ, నీళ్లు నిలబడే పల్లపు ప్రాంతాల్లో తిండికనువైన మధ్యస్థ సన్న గింజ నాణ్యత కలిగిన రకాలను సాగు చేయడం వలన మన రాష్ట్ర అవసరాలకి సరిపడా బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. దక్షిణ మండలంలో దాళ్వాలో, ఎడగారులో కొంత విస్తీర్ణంలో పొడుగు సన్న గింజ రకాలు సాగు చేసుకోవచ్చు. వరి రకాల ఎంపిక ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి మార్కెట్ కు అనుకూలంగా ఎంపిక చేసుకుని సాగు చేయడం మంచిది. సార్వాలో ముంపు ప్రాంతాలలో ఎంటియు రైస్ 1232, బాడవ మసూరి ( పి.ల్. 1100), అమర (ఎంటియు 1064), ఇంద్ర (ఎంటియు 1061). భీమ (ఎంటియు 1140), చౌడు ప్రాంతాలలో, ఎంసిఎం రైస్ 103, ఇంద్ర (ఎంటియు 1061). పాండురంగ (ఎంసిఎం 100) వంటి రకాలను సాగు చేసుకోవాలి. విడుదలకు సిద్ధంగా ఉన్న మిక్కిలి సన్న గింజ రకమైన ఎంటియూ 1282 ఉత్తర కోస్తా జిల్లాలో సార్వాకు, ఇతర ప్రాంతాల్లో దాళ్వాకు అనువైనది. సార్వాలో సాధారణ భూములు చౌడు నేలల్లో ఎం.సి.ఎం 125 రకాన్ని సాగు చేయవచ్చు. ఒకే పంట వేసే ప్రాంతాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న జె.ఎం.పి 132, యూ.టి.ఆర్ 181 రకాలు మిక్కిలి అనుకూలం. ఇవికాక చిరు సంచుల ప్రదర్శనలో ఉన్న 140 రోజుల కాలపరిమితి గల ఆర్ జి ఎల్ 7034, ఆర్ జి ఎల్ 7039 రకాలు సార్వాలో 125 రోజుల కాల పరిమితి గల ఎం.టి.యు 1426, ఎన్ ఎల్ ఆర్ 3648 రకాలు దాళ్వాలో తెలంగాణ సోనాకు ప్రత్యామ్నా యంగా ఆశాజనకంగా ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనా స్థానం, బాపట్ల నుంచి నల్లబియ్యం రకం బీపీటీ 2841, చిరు సంచుల ప్రదర్శనలో ఉన్న ఎర్రబియ్యం రకం బీపీటీ 2858. దేశవాళీ రకాలకన్నా సన్నగా పొట్టిగా ఉండి అధిక దిగుబడి ఇస్తున్న నేపథ్యంలో ఆయారకాల మార్కెట్ ఉన్న ప్రాంతాలలో సాగు చేసుకోవచ్చు. సార్వాలో వివిధ జిల్లాలకు అనువైన మిక్కిలి సన్న గింజ మరియు మధ్యస్థ సన్నగింజ రకాలు మండలం మిక్కిలి సన్న గింజ రకాలు మద్యస్థ సన్న గింజ రకాలు ఉన్నత శ్రేణి గిరిజనమండలంఅల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాలు మారుటేరు సాంబ (ఎంటియు 1224), మారుటేరు మసూరి (ఎంటియు 1262) శ్రీకాకుళం సన్నాలు (ఆర్ జి ఎల్ – 2537) ఉత్తర కోస్తా మండలంశ్రీకాకుళంవిశాఖపట్నంవిజయనగరంఅనకాపల్లి జిల్లాలు మారుటేరు మసూరి (ఎంటియు 1262). మారుటేరు సాంబ (ఎంటియు 1224), ఎంసిఎం103 శ్రీకాకుళం సన్నాలు (ఆర్ జి ఎల్ 2537)ఎంటియు రైస్ 1318, స్వర్ణ (ఎంటియు 7029), ఇంద్ర (ఎంటియు1061), ఎంటియు 1310, ఎంటియు 1232, ఎంటియు 1275, ఎంటియు 1239. గోదావరి మండలంతూర్పుగోదావరిపశ్చిమగోదావరిఅంబేద్కర్ కోనసీమకాకినాడజిల్లాలు సాంబ మసూరి (బిపిటి 5204), మారుటేరు సాంబ (ఎంటియు 1224), మారుటేరు మసూరి (ఎంటియు 1262), ఎంసిఎం 103. ఎంటియు రైస్ 1318, స్వర్ణ (ఎంటియు 7029), ໑໐໖ (1061), బాడవ మసూరి (పి.ఎల్.ఎ1100). ఎంటియు రైస్ 1310, ఎంటియు 1232, ఎంటియు 1275. కృష్ణా మండలంకృష్ణాబాపట్లఎన్టీఆర్గుంటూరుపల్నాడుప్రకాశం జిల్లాలు మారుటేరు మసూరి (ఎంటియు 1262), సాంబ మసూరి, బావపురి సన్నాలు (బిపిటి 2270), మారుటేరు సాంబ (ఎంటియు 1224), తేజ (బిపిటి2595), బాపట్ల మసూరి- 2782, బిపిటి 2846, ఎంసిఎం 103. ఎంటియు రైస్ 1318, ఇంద్ర, స్వర్ణ, పాండురంగ (ఎంసిఎం 100). దక్షిణ మండలంనెల్లూరుతిరుపతిఅన్నమయ్యచిత్తూరుకడపజిల్లాలు సాంబ మసూరి (బిపిటి 5204), నెల్లూరుమషూరి (ఎన్.ఎల్.ఆర్-34449), నెల్లూరు ధాన్యరాశి (ఎన్.ఎల్.ఆర్-3354), నెల్లూరు సుగంధ (ఎన్.ఎల్.ఆర్ 40054), నెల్లూరుసిరి (ఎన్ ఎల్ ఆర్ 4001), ఎంటియు 1271.మారుటేరు సాంబ (ఎంటియు 1224), ఆర్.ఎన్.ఆర్ 15048, కేఎన్ఎం 1638 - అత్యల్ప వర్షపాత మండలంనంద్యాలకర్నూలుఅనంతపురంసత్యసాయి జిల్లాలు సాంబ మసూరి (బిపిటి 5204).నంద్యాల సోన (ఎన్.డి.ఎల్.ఆర్.7),మారుటేరు సాంబ (ఎంటియు 1224),ఎంటియు 1271, ఎంసిఎం రైస్ 103, ఆర్.ఎన్.ఆర్ 15048. - దాళ్వా వరి భారత దేశంలో నాన్ బాస్మతి వరి ఎగుమతులపై ఆంక్షలు తీసివేసిన నేపథ్యంలో పొడుగు సన్న గింజ రకాల విస్తీర్ణం పెంచుకుని ఎగుమతికి అవరమైన 20 లక్షల టన్నుల బియ్యం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసుకోవచ్చు ఎగుమతికి అనువైన 120 రోజులు కాలపరిమితి కలిగిన రకాలైన ఎం.టి.యు. 1010(కాటన్ దొర సన్నాలు), ఎం.టి.యు 1153 (చంద్ర) ఎం.టి.యు1156 (తరంగిణి), ఎం.టి.యు రైస్ 1293, ఎం.టి.యు 1273, విడుదలకు సిద్ధంగా ఉన్న ఎం.టి.యు 1290 రకాలు దాళ్వాలో వేసుకోవడం మంచిది. 125 రోజులు కాల పరిమితి కలిగిన మధ్యస్థ సన్న గింజ రకాలైన ఎం.టి.యు 1121 (శ్రీధృతి), ఎన్ ఎల్ ఆర్ 3238 (అధిక జింకు 24.5ppm), అలాగే 125 రోజులు కాల పరిమితి కలిగిన సన్న గింజ రకాలు నెల్లూరు మసూరి (ఎన్.ఎల్ ఆర్ 34449), నెల్లూరు ధాన్యరాశి (ఎన్ ఎల్ ఆర్ 3354 విడుదలకు సిద్ధంగా ఉన్న ఎం.టి.యు 1282, ఉప్పుడు బియ్యానికి అనువైన ఎంటియు 3626 (ప్రభాత్) విత్తనాన్ని ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి. దాళ్వాలో ఇటీవల కాలంలో PR-126 అనే రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. కానీ ఈ రకం ఎగుమతి అయిన దేశాల్లో అన్నం ముద్దయి నిలువ ఉండక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలి.ఎం.టి.యు 1293, విడుదలకు సిద్ధంగా ఉన్న ఎం.టి.యు 1290 రకాలు చౌడు భూములలో సాగుకు అనుకూలం. ఎడగారు వరి దక్షిణ మండలంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో సుమారు 60000 హెక్టార్లలో ఎడగారు వరి సాగు చేస్తారు.ఎడగారు సాగుచేసే రైతులు స్వల్పకాలిక (120-125 రోజుల్లో కాలపరిమితి గల) రకాలను సాగు చేసుకోవాలి. ఎగుమతికి అనువైన పొడవు సన్న గింజ రకాలు : కాటన్ దొర సన్నాలు (ఎంటియు 1010), తరంగిణి (ఎంటియు 1156), 1153), చంద్ర (ఎంటియు ఎంటియు 1293, సోమశిల (ఎన్.ఎల్.ఆర్ 33358).మధ్యస్థ సన్న గింజ రకాలు: నెల్లూరు మసూరి (ఎన్.ఎల్.ఆర్ 34449), నెల్లూరు ధాన్యరాశి (ఎన్.ఎల్.ఆర్ 3354), ఎన్.ఎల్.ఆర్ 3238 (పాలిష్ బియ్యంలో అధిక జింక్ 24.5 పిపిఎం గల రకం). భరిణి (ఎన్.ఎల్.ఆర్ 30491). ఆధారం: పాడిపంటలు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.