పత్తి ఆంధ్రప్రదేశ్ లో పండించే ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటి. ఈ పంటను నాటిన తొలిదశలో ఆశించే పేనుబంక, తెల్లదోమ ఆకు ముడత వంటి వాటిని ముందుగానే గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపడితే పత్తిలో నాణ్యమైన, అధిక దిగుబడులకు తొలి అడుగు పడినట్టే. వీటి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. అర్ధిక సహన స్థాయి పేనుబంక : 10-15% మొక్కలను ఆశించిన పేనుబంకపచ్చదోమ : 2 పచ్చదోమలు / ఆకుకుతెల్లదోమ : 6-8 తెల్లదోమలు /ఆకుకుపిండినల్లి : 5-10% పిండినల్లి ఆశించిన మొక్కలను గుర్తించినపుడుతామరపురుగు : 10 తల్లిపురుగులు/ఆకుకు పచ్చదోమ పెద్దదోమ రెక్కలతో, పిల్లదోమ రెక్కలు లేకుండా లేత ఆకుపచ్చరంగులో ఉంటాయి. పెద్దదోమ ముందు రెక్కల పై నల్లటిమచ్చ ఉంటుంది. పిల్ల, పెద్ద దోమలు అడ్డంగా నడుస్తూ ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన మొక్కల ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారి, క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. పచ్చదోమ ఎక్కువగా ఉన్నప్పుడు పైరు పెరుగుదల క్షీణించి మొగ్గలు రాక దిగుబడి తగ్గుతుంది. తామరపురుగు / ముడతపురుగు పెద్దపురుగులు చాలా చిన్నగా, సున్నితంగా, పసుపు నుంచి గోధుమరంగులో, చీలిన రెక్కలతో లేత ఆకులలో ఈనెల మధ్య దాగి ఉండి ప్రముఖంగా కనిపించవు. ఆడపురుగులు లేతఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడతాయి. మూడు వారాలలో జీవిత చక్రం పూర్తి చేస్తాయి. పిల్ల, పెద్దపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ముడుచుకొని పెళుసుగా మారతాయి. ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి వెండివలె మెరిసే చారలు కనబడతాయి. పేనుబంక పిల్ల, పెద్దపేలు ఆకుల అడుగు భాగంలో కొమ్మలపై నుంచి రసం పీలుస్తూ జీవిస్తాయి. ఇవి విసర్జించే తేనెవంటి పదార్ధం వల్ల ఆకులు, కాండము పై మసి తెగులు వ్యాపిస్తుంది. ఆకులు దోనెలుగా మారి, మొక్క పెరుగుదల ఉండదు. ఇవి విసర్జించే తేనె వంటి పదార్ధం వల్ల ఆకులు, కాండంపై మసి తెగులు వ్యాపిస్తుంది. పచ్చదోమ / తామరపురుగు / పేనుబంక పురుగుల నివారణ: ఎసిఫేట్ 75% ఎస్.పి-1.5 గ్రా./లీ. ఇమిడాక్లోప్రిడ్ 17.8% ఎస్.ఎల్-0.4 మి.లీ/లీ. ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి- 0.2గ్రా/లీ. ధయోమిథాక్జామ్ 25 డబ్ల్యు.జి- 0.2 గ్రా/లీ. ఫిప్రోనిల్ 5% ఎస్.సి - 2.0మి.లీ/లీ. ఫ్లోనికామిడ్ 50% డబ్ల్యూ.జి -0.3గ్రా /లీ. డైఫెంథ్యూరాన్ 50% డబ్ల్యు.పి -1.25 గ్రా./లీ. తెల్లదోమ పిల్లదోమలు పసుపు ఆకుపచ్చరంగులో ఉండి, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. గుడ్డు నుంచి వెలువడిన పిల్లలు ఈనెల దగ్గరగా స్థిరపడి రసాన్ని పీలుస్తాయి. పెద్దదోమలు సహజంగా ఎర్రకుళ్ళు, పసుపు పచ్చని శరీరం, తెల్లటి రెక్కలతో ఉంటాయి. ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకి మారి ఎండిపోయి, మొక్కలు గిడసబారి పోతాయి. ఇవి విసర్జించే తేనె వంటి పదార్ధం వల్ల బూజు తెగులు వ్యాపిస్తుంది. నివారణ: ప్రొఫెనోఫాస్ 50% ఇ.సి-2.0 మి.లీ/లీ. ఎసిటామిప్రిడ్ 20% ఎస్.పి 0.2 గ్రా/లీ. డైఫెంథ్యూరాన్ 50% డబ్ల్యు.పి-1.25 గ్రా/లీ. 5% వేపగింజల కషాయం కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి పిండినల్లి తెల్లటి మెత్తటి ద్రవ్యరాశి ఆకుల దిగువ భాగంలో, పెరుగుతున్న చిట్కాల దగ్గర మైనపు స్రావాలతో కాండం చూడవచ్చు. ఏపుగా పెరిగే దశలో సోకిన మొక్కలు వక్రీకరించిన లేదా గుబురుగా ఉండే రెమ్మలు, ముడతలు పడిన లేదా మెలితిరిగిన గుత్తి ఆకులను చూపుతాయి చిన్న వికృతమైన పెరుగుతున్న భాగాలను ప్రభావితం చేస్తుంది. నల్లటి మసి అచ్చు అభివృద్ధికి కారణమయ్యే తేనెటీగ స్రవం ఉండటం. ప్రభావిత మొక్కలు అనారోగ్యంగా కనిపిస్తాయి నల్లగా కాలిపోయిన రూపాన్ని చూపుతాయి. నివారణ : పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 3 మీ.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మందులను పిచికారీ చేసేటప్పుడు ట్యాంకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి వాడాలి. రసంపీల్చే పురుగుల యాజమాన్యం పచ్చదోమను తట్టుకొనే రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి 9 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5 గ్రా. ధయోమిథాక్సామ్ 70 డబ్ల్యూ. ఎస్ తో విత్తన శుద్ధి చేయాలి. ఒక ఎకరాకు 20 పసుపు బులుగు జిగురు అట్టలు మొక్కకు ఒక అడుగు పైన పెట్టుకోవాలి. మొదటి 60 రోజులు నియోనికోటినాయిడ్ పురుగు మందులు (ఇమిడాక్లోప్రిడ్, ఎసిటమాప్రిడ్ లేదా ధయో మిథాక్జామ్) పంటపై పిచికారీ చేయకూడదు. ఆధారం: పాడిపంటలు ఎల్.రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త (కీటకశాస్త్రం), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు.