పూత నియంత్రణే నిమ్మ సాగులో కీలకం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో, విస్తారంగా సాగవుతోంది. నిమ్మ చెట్లు సంవత్సరంలో మూడుసార్లు పూతకు వస్తాయి. ఏ పూతకు ఎంత కాయ నిలుస్తుంది అనే దానిపైనే రైతు ఆదాయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో (మార్చి-జూన్) కాయలకు ధర మూడు నాలుగు రెట్లు ఎక్కువ. అందువల్ల పూతను రైతుకు కావలసిన సమయంలో తెప్పించటం (బహార్ నియంత్రణ), వచ్చిన పూత రాలకుండా కాయగా నిలపటం. ఇవే నిమ్మ సాగులో లాభాలకు కీలకం. నీటి నియంత్రణతో పూత తెప్పించటానికి, కాయ నిలపటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పూత తెప్పించటానికి నీటి ఎద్దడి (స్ట్రెస్) కోరుకున్న పూతకు 45-60 రోజులు ముందు తోటకు నీటి తడులు పూర్తిగా ఆపాలి. తేలిక నేలల్లో 30-40 రోజులు, బరువైన నల్లరేగడి నేలల్లో 45-60 రోజులకు నీటి ఎద్దడికి గురిచేయాలి. ఆకులు కొద్దిగా వడలి, కొన్ని ఆకులు రాలటం మొదలైతే నీటి ఎద్దడి సరిపోయినట్లు గుర్తు. ఈ సమయంలో చెట్టు కొత్త చిగుళ్లు వేయకుండా ఆగి, కొమ్మల్లో పిండి పదార్థాలను నిల్వ చేసుకుంటుంది. ఎద్దడి తర్వాత పాదుల మట్టి గుల్ల చేసి, ఎరువులు వేసి, మొదట తేలికపాటి తడి, 3-4 రోజుల తర్వాత పూర్తి తడి ఇవ్వాలి. 20–30 రోజుల్లో కొత్త చిగుళ్లతో పాటు విస్తారంగా పూత వస్తుంది. మొదటి తడి భారీగా ఇస్తే పూత కంటే ఆకు చిగుళ్లు ఎక్కువగా వస్తాయి. హస్త బహార్ (గైరంగం) పంట కోసం ఆగస్టు-సెప్టెంబర్ వర్షాల వల్ల నీటి ఎద్దడి సాధ్యం కాదు. కాబట్టి జూన్-జులైలో మృగ్ పూతను తగ్గించేందుకు జిబ్బరెల్లిక్ ఆమ్లం (GA3) 50 మి.గ్రా. (50 పి.పి.ఎం.) లీటరు నీటికి పిచికారి చేసి, సెప్టెంబర్ లో లీటరు నీటికి 2 మి.లీ. (1000 పి.పి.ఎం.) సైకోసెల్, అక్టోబరులో 13.0.45, 10 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే హస్త బహార్ పూత పెరుగుతుంది. మోతాదులు, సమయం కోసం స్థానిక ఉద్యాన శాస్త్రవేత్తల సలహా తీసుకోవాలి. పూత, కాయ దశలో నీటి యాజమాన్యం పూత, పిందె దశలో నేలలో తేమ సమానంగా ఉండాలి. ఒక్కసారిగా బెట్ట తగిలినా, ఒక్కసారిగా ఎక్కువ నీరు పెట్టినా పిందెలు భారీగా రాలిపోతాయి. తేలిక తడులు తరచుగా ఇవ్వాలి. బిందు సేద్యం ఉత్తమం కాపు చెట్టుకు (6 ఏళ్లు పైబడిన) రోజుకు శీతాకాలంలో 25-35 లీటర్లు, వేసవిలో 40-50 లీటర్లు ఇవ్వాలి. చెట్టు అంచు కింద 4 డ్రిప్పర్లు అమర్చాలి. కాలువ పద్ధతిలో డబుల్ రింగ్ పాదు చేయాలి, కాండం చుట్టూ 30 సెం.మీ. వరకు మట్టి ఎగదోసి, నీరు కాండానికి తగలకుండా చూడాలి. కాండానికి నీరు తగిలితే బంక తెగులు (గమ్మోసిస్) వస్తుంది. వర్షాకాలంలో తోటలో నీరు నిలవకుండా మురుగు నీరు పోయే కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పాదుల్లో ఎండు ఆకులు, వరి గడ్డితో మల్చింగ్ చేస్తే వేసవిలో తేమ నిలిచి, పిందె రాలటం తగ్గుతుంది. నల్ల పాలిథీన్ మల్చ్ – 100 జి.ఎస్.ఎమ్. కూడా మల్చింగ్గా వాడవచ్చు. పురుగు / తెగులు లక్షణాలు నివారణ (లీటరు నీటికి) ఆకు ముడత పురుగు (లీఫ్ మైనర్ ) లేత ఆకుల పొరల్లో వెండి రంగు వంకరగీతలు: ఆకులుముడుచుకుంటాయి; క్యాంకర్ తెగులును దారితీస్తుంది. చిగురు దశలో వేపనూనె 5 మి.లీ.; ఉధృతి ఎక్కువైతే ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్.ఎల్. 0.5 మి.లీ. పేనుబంక చిగుళ్ల రసం పీల్చటం వల్ల చిగుళ్లు ఎండిపోతాయి; గ్రీనింగ్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి పసుపు జిగురు అట్టలు; థయామిథాక్సామ్ 25 డబ్ల్యు.జి. 0.3గ్రా-లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. తామరపురుగులు కాయలపై బూడిద/వెండి రంగు మచ్చలు, గీతలు – మార్కెట్ విలువ తగ్గుతుంది నీటిలో కరిగే గంధకం 3 గ్రా.; లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. ఆకు పచ్చనల్లి మచ్చలు, గీతలు -మార్కెట్ విలువ తగ్గుతుంది నీటిలో కరిగే గంధకం 3 గ్రా.; లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. మంగు నల్లి కాయలు నల్లగా మారుతాయి. మార్కెట్ విలువ తగ్గుతుంది గజ్జితెగులు (క్యాంకర్) ఆకులు, కొమ్మలు, కాయలపై గరుకుగా ఉబ్బిన గోధుమ రంగు మచ్చలు, చుట్టూ పసుపు వలయం వర్షాకాలానికి ముందు తెగులు కొమ్మలు కత్తిరించాలి.1 గ్రా. స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో + 3 గ్రా./లీ. కాపర్ ఆక్సీక్లోరైడ్ 15 రోజులకు ఒకసారి పిచికారి బంకతెగులు /వేరుకుళ్లు కాండం అడుగున బెరడు పగిలి జిగురు కారటం, ఆకులు పసుపు రంగుకు మారి చెట్టు క్షీణిస్తుంది కాండానికి నీరు తగలకుండా చూడాలి, తెగులు భాగం గీకి బోర్డో పేస్టు పూయాలి, మెటలాక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ + మాంకోజెబ్ 2 గ్రా. ద్రావణంతో పాదు తడపాలి కొమ్మ ఎండుతెగులు (డైబ్యాక్) కొమ్మలు చివరి నుండి కిందికి ఎండిపోతాయి ఎండిన కొమ్మలను ఆరోగ్యకరమైన భాగం వరకు కత్తిరించి, కార్బెండజిమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. పిచికారి చెయ్యాలి ఆధారం: పాడిపంటలు