కందిపంట సమగ్రపోషణ, కలుపునివారణ కంది పంట పప్పు ధాన్యాల్లో ముఖ్యమైనది. ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ప్రధానంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. వర్షాధార పంటగా కూడా ఈ పంటను సులభంగా సాగు చేయవచ్చు. నీటి వనరు అందుబాటులో ఉంటే ఈ పంటతో మంచి దిగుబడి, ఆదాయం సాధించవచ్చు. కంది పంట సాగు చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరిచి భూమిని సారవంతంగా మార్చవచ్చు. నేలలు కందిపంటకు నీరు నిల్వ లేకుండా ఉండే ఎర్ర చల్కా నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికి రావు. వాతావరణం : తేమతో కూడిన నేల పరిస్థితుల్లో ఇది 35° లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను బెట్టను సమర్థ వంతంగా తట్టుకోగలదు. విత్తన ఎంపిక :అధిక దిగుబడుల కోసం ధృవీక రించబడిన విత్తన సంస్థల నుంచి విత్తనాలను ఎంచుకోవాలి. రకాలు : ఎల్.ఆర్.జి.52, ఎల్. ఆర్.జి. 105. యల్. ఆర్. జి 133-33, ఎల్. ఆర్.జి 41,ఐ.సి.పి.ఎల్.332 (5), ఐ.సి.పి.ఎల్.85063 (లక్ష్మీ), ఐ.సి.పి.ఎల్.8863 (మారుతి), టి.ఆర్.జి.59,ఐ.సి.పి.ఎల్.87119(ఆశ) రకాలు ముఖ్యమైనవి. విత్తన శుద్ధి : విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను తగ్గించ డానికి, 1 కిలో విత్తనానికి సుమారు 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి పౌడర్‌ను కలపాలి. ఈ జీవశిలీం ద్రం వల్ల ఎండు తెగులు (విల్ట్) వంటి ప్రమాదకర ముందస్తుగా రించవచ్చు. రోగాలను నివారించవచ్చు. విత్తేకాలం, మోతాదు తక్కువ వర్షపాత మండలాల్లో: జూన్.కృష్ణా,గోదావరి, దక్షిణ, ఉత్తర కోస్తా మండలాల్లో: జులై-ఆగస్టురబీ పంటగా : సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనూ విత్తుకోవచ్చు.విత్తన మోతాదు: ఖరీఫ్ పంటకు 5-10 కిలోలు/హె.; రబీ పంటకు 12-15 కిలోలు/హె. విత్తే పద్ధతి, విత్తే దూరం నాగలి వెంట లేదా సాళ్లలో గొర్రుతో కాని, సీడ్ డ్రిల్ ఉపయోగించి కాని విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాల ఖరీఫ్ లో వరుసల మధ్య 180 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ దూరంలో విత్తాలి. ఎర్ర నేలలో వరుసల మధ్య 90-120 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ. గాలి, వెలుతురు ప్రసరణ మెరుగ్గా ఉండి మొక్కల వృద్ధి బాగా జరుగుతుంది. ఎరువుల వాడకం సేంద్రియ ఎరువులు : ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వాడాలి. రసాయన ఎరువులు : ఖరీఫ్ హెక్టారుకు 20 కిలోల నత్రజని + 50 కిలోల భాస్వరం రబీలో అదే మోతాదులు, పైగా 35-40 రోజుల దశలో 20 కిలోల నత్రజని వేసుకోవాలి. నీటి నిర్వహణ : ఖరీఫ్‌లో వర్షాల మీద ఆధారపడుతుంది. పైరు ఎదుగుదల దశ (70-80 రోజులు) మరియు కాయ ఏర్పడే దశలో 2 తేలికపాటి తడులు ఇవ్వాలి.రబీ పంటలో కూడా అదే విధంగా తడులు అవసరం. నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం తప్పనిసరి. కలుపు నివారణ పెండిమిథాలిన్ 30% 1-1.5 లీ./ఎకరా (200 లీ. నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. కలుపు మళ్లీ పెరిగితే 30వ, 60వ రోజులకు గుంటక/గొర్రుతో అంతర కృషి చేయాలి. గడ్డి జాతి, వెడల్పాకు కలుపుల నివారణకు ఇమాజితాఫిర్ 5% మందు 300 మి.లీ./ఎకరా 200లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర పంటలు : తక్కువ కాలపరిమితి గల మినుము,పెసర, తృణధాన్యాలు, వేరుశనగలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఖరీఫ్ : కంది + జొన్న /మొక్కజొన్న /సజ్జ (1:2), కంది + పెసర / మినుము /సోయాచిక్కుడు / వేరుశనగ - (1:7), కంది + పత్తి - (1:8) రబీలో : కంది + పెసర/మినుము / వేరుశనగ / సోయాచిక్కుడు (1:3) నీటి వసతి గల ప్రాంతాల్లోనే విత్తాలి. సహ పంటలుగా వేసినప్పుడు విత్తన మోతాదు, ఎరువులు రెండు పంటలకు వేరుగా ఉండాలి. పొలం గట్లపై కంది కృష్ణా గోదావరి జిల్లాల్లో వరి ప్రధాన పంటగా సాగు చేస్తున్న పొలాల్లో గట్లపై కందిని సాగు చేసేందుకు వీలుగా ప్రభుత్వం సబ్సిడీ పై కంది విత్తనాలను పంపిణీ చేస్తోంది. కందిని అంతర పంటగా పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, వేరు శనగ పంటల లో వేసినప్పుడు చీడపీడల నుంచి రక్షణగాను మంచి ఆదాయ వనరుగా రైతులు పండిస్తున్నారు. పొలం గట్లపై వేసినపుడు పొలం తయారీకి అయ్యే ఖర్చు ఉండదు. మందుల పిచికారీ అవసరం లేదు, ప్రధాన పొలంలో నీరు పెట్టినప్పుడు గట్లకి చెమ్మ తగలటం వల్ల ప్రత్యేకమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించక్కరలేదు. ప్రధాన పొలానికి చీడపీడల నుంచి రక్షణగా ఉంటుంది. పూత దశలో వున్నప్పుడు వరి పైరును ఆశించే పురుగులను కంది ముందుగానే ఆకర్షించే ఎర పైరుగా పని చేస్తుంది. ఒకే కాలంలో రెండు పంటల దిగుబడి పొందవచ్చు. విత్తే టప్పుడు ద్రవరూప రైజోబియంతో విత్తనశుద్ధి చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం మెండు. గట్ల పరిమాణాన్ని బట్టి విత్తే దూరం మార్చి విత్తుకోవాలి. ఆధారం: పాడి పంటలు మాస పత్రిక డా.కె.వి. శివారెడ్డి సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, లాం, గుంటూరు