సేంద్రియ సాగులో కంద రాష్ట్రంలో ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సాగులో ఉంది. ఈ దుంపలలో అధిక శక్తినిచ్చే పిండి పదార్థాలు అలాగే" మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆహార, పోషక భద్రతను కలిగించడంలో కంద విశేష పాత్ర వహిస్తున్నది. అంతేకాకుండా దేశీయ రకాలలో ఔషధ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దుంపలతో పాటు కాండం, ఆకులను కూడా. ఆహారంగా తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేసే దుంపల్లో పోషక విలువలే కాకుండా ఔషధ విలువలు కూడా అధికంగా ఉంటాయి. పోషక విలువలు కందదుంపలో పిండి పదార్ధంతో పాటు ఖనిజలవణాలు, మాంసకృత్తులు, విటమిన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రా, కంద దుంపలోపిండి పదార్ధం 6.72 -16.6%, మాంసకృతులు - 0.5-3.1%, శక్తి (కే.ఔ /100గ్రా) 324-374, చక్కెర - 0.14%, పీచు పదార్థం - 1.45%, కొవ్వు పదార్థం - 0.06%-0.74% ఉంటాయి. గజేంద్ర, దేశంలోనే అత్యధిక దిగుబడి నిచ్చే తీపి కంద. పంటకాలం : 180-210 రోజులు. దిగుబడి : హెక్టారుకు 60- 65 టన్నులు. దుంప పై భాగం గోధుమ రంగులో ఉండ్ కండ లేత పసుపు, నారింజ రంగులో ఉంటుంది. దుంపల్లో దురదను కలిగించే ఆక్సలైట్ల శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందింది. నిల్వ సామర్థ్యం ఎక్కువ. దూరప్రాంత రవాణాకు అనుకూలం. వాతావరణం, నేలలు : కంద సాగుకు సారవంతమైన, మురుగు నీరు పోయే సదుపాయం కలిగి ఉండి. ఉదజని సూచిక 6-7 వరకు గల నేలలు అనుకూలం. మన రాష్ట్రంలో కందను నదీపరివాహక ప్రాంతాల్లో, లంక భూములు, ఎర్ర, నల్లరేగడి నేలల్లో సాగు చేస్తున్నారు. విత్తన మోతాదు సాధారణంగా కందపంటను ఉభయగోదావరి జిల్లాల్లో రబీ పంటగా, మిగిలిన ప్రాంతాల్లో ఖరీఫ్ పంటగా సాగు చేస్తున్నారు. అందువల్ల నాటే కాలాన్ని బట్టి విత్తన మోతాదు ఆధారపడి ఉంటుంది. రబీలో నాటుకునే పంటకు 500-700గ్రా. బరువు గల విత్తన దుంపలు (ఎకరాకు 6 టన్నులు.) వినియోగించాలి. ఒక ఎకరానికి కావలసిన పూర్తి విత్తన దుంపలను 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన 100గ్రా. బరువు ఉన్న పూర్తి దుంపలను గాని, కన్ను భాగంతో ఉన్న ముక్కలను గాని 45-30 సెం.మీ. దూరంలో నాటుకుంటే 450-700 గ్రా. బరువు గల విత్తన దుంపలను పొందవచ్చు. నీటి యాజమాన్యం కందపంటలో నీటి ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులకు అనుకూ లంగా ఖరీఫ్ పంటకు 7-10 రోజుల తేడాతో నీటి తడులు ఇవ్వాలి. నవంబరు-డిసెంబర్ నెలల్లో నాటిన పంటకు ప్రతి 4-5 రోజులకు నీటి తడులు ఇవ్వాలి. దుంప ఊరే దశలో అనగా 4-6 నెలలు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి. డ్రిప్ పద్ధతిలో నీరు, ఎరువులు ఇస్తే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడమే కాక కలుపు సమస్య తగ్గి. దుంప ఊరి, నాణ్యత బాగుండి, దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. కలుపు యాజమాన్యం కందపంట సారవంతమైన నేలల్లో పండించడం, తరచుగా తడులివ్వడం వల్ల కలుపు సమస్య కూడా అధికంగా ఉంటుంది. కందను నాటిన తర్వాత మొదటిదఫా తడి ఇచ్చి వెంటనే తడిగా ఉన్న నేలపై ఎకరాకు 2 లీటర్లు బ్యుటాక్లోర్ లేదా 1 లీటరు పెండిమిథాలిన్ 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 40-45 రోజులు తర్వాత పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించి సగం మందును రెండవసారి పిచికారి చేసి కలుపును అరికట్టవచ్చు. పంట నాటిన 5 నెలల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. వరుసల మధ్యలో వరిగడ్డితో గాని, అరటి వ్యర్థాలతో గాని, లేదా ఎండాకులతో గాని మల్చింగ్ చేస్తే, అలసంద పంటను వరుసల మధ్య చల్లి 40-60 రోజుల మధ్యలో కలియబెడితే కలుపును సమర్థవంతంగా నివారించడమే కాకుండా దిగుబడులు కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. సమగ్ర కలుపు యాజమాన్యంలో భాగంగా వరుసల మధ్య 120 జిఎస్ఎమ్ మందం గల వీడు మ్యాట్లను వాడితే కలుపు సమర్థవంతంగా నివారించడమే కాకుండా కలుపు మందు. కూలీల ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. సేంద్రియ సాగు కందపంట సేంద్రియ వ్యవసాయానికి బాగా అనుకూలంగా స్పందిస్తుంది. ఒక క్రమ పద్ధతిలో సేంద్రియ ఎరువులు వేయడం వల్ల ప్రతి సంవత్సరం క్రమంగా దిగుబడులు పెరగడమే కాకుండా చీడపీడలు, ధాతు లోపాలు లేకపోవడం వల్ల చాలామంది రైతులు కందలో సేంద్రీయ విధానంపై ముగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు, ఉద్యాన పరిశోధన స్థానం సేంద్రీయ యాజమాన్య పద్ధతులను స్థిరీకరించడం జరిగింది. 500 గ్రా. బరువైన దుంపలను విత్తనంగా ఉపయోగించాలి. నాటడానికి ముందు విత్తన దుంపలను ఆవుపేడ వేపపిండి, ట్రైకోడెర్మా (5 గ్రా/కి. గ్రా. విత్తనానికి) కలిపిన ద్రావణంలో 15 నిముషాలు ముంచి ఆపై ఆరనిచ్చి నాటుకోవాలి. కందలో పోషకాలు ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పచ్చిరొట్ట పైరు (అలసంద) రెండు దఫాలుగా వేసి కలియదున్నాలి. తదుపరి వరుసల మధ్యలో 20 కేజీల అలసందలు చల్లి 45-60 రోజుల తర్వాత కలియదున్నాలి. నాటడానికి ముందు గుంతలలో లేదా బోదెల్లో 1 కి. గ్రా. ట్రైకోడెర్మా హర్జియానం, 90 కి. గ్రా. పశు వుల ఎరువు + 10 కి.గ్రా. వేప పిండి కలిపి 15 రోజుల పాటు వృద్ధిచేసిన మిశ్రమాన్ని హెక్టారుకు 36 టన్నుల చొప్పున వేయాలి. హెక్టారుకు 3 టన్నుల చొప్పున బూడిదను అలసంద పంట కలియదున్నే సమయంలో వేసి కలపాలి. అంతర సేద్యం బాగా ఆరిన దుంపలు నాటిన 20 నుంచి 25 రోజులకు మొలకెత్తుతాయి కాబట్టి అంతర సేద్యానికి వీలుకాదు. దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, తక్కువ కాలపరి మితి కలిగిన నువ్వు, మినుము, చిరుధా న్యాలు వంటి పంటలను ఆయా ప్రాం తాలకు, కాలానికి తగిన విధంగా ఎంపిక చేసి సాగు చేసుకోవాలి. దీని ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే పసుపులో మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. కందను ఏక పంటగానే కాకుండా అరటి, కొబ్బరిలో అంతర పంటగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే పసుపులో కూడా అంతర పంటగా వేసి మంచిఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉన్నది. దుంప తవ్వడం సాధారణంగా కంద నాటిన తర్వాత 7-8నెలలకు పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన పైరు ఆకుల నుంచి నేలపై వాలిపోతాయి. ఆ తర్వాత దుంపలను త్రవ్వి నీడలో ఆరబెట్టాలి. తవ్వినప్పుడు దుంపకు దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి. దెబ్బ తగిలితే నిల్వ దుంప కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుంప నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు దుంపలను తవ్విన తర్వాత చుట్టూ ఉండే మట్టిని తొలగించి పెద్ద, చిన్న దుంపలను వేరు చేయాలి. గ్రేడింగ్ చేసిన తర్వాత కన్నుభాగం పైకి ఉండేటట్లుగా పలుచగా పరిచి దుంపలను బాగా గాలి, వెలుతురు తగిలే ప్రదేశంలో షెడ్లో గాని, చెట్ల కింద గాని నిలువ చేసుకోవాలి. ఆధారం: పాడిపంటలు ,డా. శివకుమార్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం) ఉద్యాన పరిశోధనా స్థానం, కొవ్వూరు.