దేశవాళి ప్రత్తి మేము ఇప్పడు వేసుకోవచ్చునా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో దేశవాళి ప్రత్తిని సాగు చేయుచున్నారు. రాయలసీమ ముంగారి ప్రాంతంలో మే ఆఖరి నుండి జూన్ మొదటి వరకు, హింగారి ప్రాంతంలో ఆగష్టు మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు, ఆదిలాబాద్ (గౌరాని ప్రాంతం)లో జూన్ – జులై మధ్య వేసుకోవాలి. మేము అమెరికన్ సూటి రకాలు /సంకర రకాలు ఎర్ర భూమిలో వేసుకుంటే బావుంటుంది ఎర్రనేలల్లో ప్రత్తి వేసుకోవడం లాభదాయం కాదు. దేశవాళి / అమెరికన్ సూటి రకాలు / సంకర జాతి రకాలను తేమను నిలుపుకొనే బరువు నేలలో ఎప్పడు విత్తుకుంటే మంచిది. రాయలసీమ హింగారి ప్రాంతంలో ఆగస్టు - సెప్టెంబర్ మాసాల్లో రాయలసీమ నల్ల నేలల్లో జులై – ఆగస్టు మాసాల్లో, కోస్తా ప్రాంతంలో జులై – ఆగస్టు మాసాల్లో మరియు తెలంగాణా ప్రాంతంలో జూన్ – జులై మాసాల్లో బరువు నేలల్లో ప్రత్తి విత్తుకోవడానికి అనుకూలం. మా ప్రాంతంలో పచ్చదోమ తాకిడి ఉన్నది. దీనిని తట్టుకొనే రకాలను తెలుపండి. ఎల్-603, ఎల్-604, నరసింహ రకాలు మరియు ఎల్ ఎహెచ్హెచ్-4, ఎల్ ఎహెచ్హెచ్-5 ఎన్‌హెచ్‌హెచ్-390 సంకర రకాలు పచ్చదోమను తట్టుకొంటాయి. తెల్లదోమను తట్టుకొనే రకాలను తెలుపండి. ఎల్‌కె-861, ఎల్పిఎస్-141 రకాలు తెల్లదోమను తట్టుకొంటాయి. ప్రత్తిలో అన్ని ప్రాంతాలకు అనువైన రకాలను / సంకర రకాలను తెలుపండి. ఎమ్సియు-5, ఎల్ఆర్ఎ-5166, ఎల్పిఎస్-141, ఎల్‌కె-861, ఎల్-389, నరసింహ (ఎన్ఎ-1325), ఎల్-603, ఎల్-604, ఎల్ ఎహెచ్హెచ్-4, సవిత రకాలను అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేసుకొనవచ్చును. ప్రత్తిలో అంతర పంటలుగా పెసర / మినుము వేసుకొనవచ్చునా. ప్రత్తిలో పెసర / మినుము / అలసంద / కొర్ర / సోయచిక్కుడు / గోరు చిక్కుడు 1:2 నిష్పత్తిలో వేసుకోవచ్చు. మాది నల్లభూమి కలుపు విపరీతంగా వస్తున్నది. పంట పెట్టి రెండు రోజులు అవుతున్నది. ఇప్పడు పూక్లోరాలిన్ కలుపు మందు వాడవచ్చా ఇంకా ఏదన్న రసాయనాన్ని సూచించండి. పూక్లోరాలిన్ ఎకరాకు ఒక లీటరు చొప్పన పంట విత్తుకోవటానికి 3-5 రోజులు చివరి దుక్కికి ముందు భూమి మీద పిచికారీ చేసి దుక్కిదున్నవలెను. లేదా విత్తిన మరుసటి రోజున అలాక్లోర్ 1.6 - 2.0 లీటర్లు లేదా పెండిమిధాలిన్ 1.2 నుండి 1.4 లీటర్లు ఎకరాకు భూమిపై తేమ ఉన్నప్పడు పిచికారీ చేయాలి. నేను ప్రైవేట్ హైబ్రిడ్ వేసుకొన్నాను. ఆఖరి దుక్కిలో 150 కిలోల సూపర్ ఫాస్పేట్ వేసుకొన్నాను. 25 రోజులు అవుతున్నది. ఇప్పడు ఎరువులు వేసుకోవచ్చా. ఎరువులు ఎంత మోతాదులో ఎప్పడు వేసుకోవాలో తెలుపండి. సంకర రకాలకు సిఫారసు చేసిన ఎరువు మోతాదు ఎకరాకు 48 కిలోల నత్రజని + 24 కిలోల భాస్వరం + 24 కిలోల పొటాష్ సూటి ఎరువుల రూపంలో తీసుకొన్నట్లయితే 105 కిలోల యూరియా + 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ + 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దీనిలో 150 కిలోల సూపర్ ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. మీరు ఆఖరి దుక్మిలో ఈ ఎరువు వేశారు కాబట్టి మిగిలిన యూరియా పొటాష్లను మూడు సమభాగాలుగా చేసి 30, 60, 90 రోజులకు (ప్రతిసారి 35 కిలోల యూరియా + 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను) పై పాటుగా మొక్కల దగ్గర వేసుకోవాలి. ఎరువు వేసిన వెంటనె తేలికపాటి తడి యివ్వాలి. కాంప్లెక్సు ఎరువులు పై పాటుగా వేసుకోరాదు. నేను పోయినసారి నరసింహ రకాన్ని వరాధారంగా సాగు చేశాను. దిగుబడి చాలా తక్కువ వచ్చింది. మంచి దిగుబడులు సాధించాలి. అంటే ఏ విధంగా ఎరువులు యాజమాన్యం పాటించాలి మీరు రకాలకు ఎకరాకు 36 కి నత్రజని + 18 కి భాస్వరం + 18 కి. పొటాష్ పోషకాలను యిచ్చే సూటి ఎరువులను వాడాలి. పైన తెలిపిన పోషకాలను సూటి ఎరువుల రూపంలో అందించేటట్లయితే 80 యూరియా + 110 కిలోల సూపర్ ఫాస్ఫేట్ + 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయవలసి వుంటుంది. వీటిలో మొత్తం భాస్వరం (110 కి. సూపర్ ఫాస్పేట్) eggpö దుక్కిలో, యూరియా, పొటాష్లను మూడు సమభాగాలుగా 27 కి. యూరియా + 10 కిలోల పొటాష్ ప్రతిసారి 30, 60, 90 రోజులకు పై పాటుగా మొక్క నుండి 5-10 సెం.మీ. దూరంలో, 7-10 సెం.మీ. లోతులో నేలలో తగినంత తేమ వున్నప్పడు మాత్రమే వరాధార పంటలకు ఎరువులను వేసుకోవాలి. పంట పెట్టి 30 రోజులు అవుతుంది. వరాలు కురియట వలన కలుపు పెరిగి కూలీలు లోపలకి వెళ్ళటానికి వీలు లేకుండా ఉంది. కలుపు నివారణకు ఏదైనా రసాయనం సూచించండి. మీరు ఈ పరిస్థితులలో ప్రత్యేక పిచికారీ నాసిల్స్ను ఉపయోగించి పంట మీద పడకుండా 1.0-1.2 లీ. పారాక్వాట్ లేదా 1.6 నుండి 2.0 లీ గైఫోసేట్ను ఎకరాకు కలుపు మీద పడేట్ల పిచికారీ చేసుకోండి. తరువాత గొర్రు లేదా గుంటక నడిపి కలుపు నివారించుకోండి. ఒకవేళ అప్పడు కూడ వీలు కాకపోతే 45-60 రోజుల మధ్యలో పైన తెలిపిన రసాయన మందులు ఉపయోగించండి. రసాయన మందులు పంట మీద పడకుండా జాగ్రత్త తీసుకోండి. మాకు వరాలు బాగా కురిసినాయి. పంటంత ఎర్రగా అయినది. తగు నివారణ చర్యలు తెలుపండి ముందుగా ఎక్కువగా ఉన్న నీటిని బయటకు తీసివేయండి. వీలయితే అంతరకృషి చేయండి. ఆపైనా 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ + 10 గ్రా. యూరియాను లీటరు నీటికి కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయండి. తగినంత తేమ ఉన్నప్పడు 25 కిలోల యూరియాను (ఎకరాకు) పై పాటుగా అందించండి. ముదురు ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతున్నాయి. యిలా ఎందువలన అవుతోంది. నివారణ తెలుపండి. మెగ్నీషియం ధాతులోపం వలన యిలా జరుగుతుంది. ఈ ధాతులోపమున్నప్పడు ముదురు ఆకులు అంచుల నుండి మధ్యకు పసుపు రంగుకు మారతాయి. ఆ తరువాత ఆకులు ఎర్రబారి ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయండి. (లేదా) మామూలు పరిస్థితులలో పంట వేసిన 45 మరియు 75 రోజులకు పిచికారీ చేయాలి. జింకు మేము ఆఖరి దుక్కిలో వేయవచ్చునా. పంట మీద ధాతులోప లక్షణాలు ఎలా కనిపిస్తాయి. మీరు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోలు భాస్వరం ఎరువులతో కలపకుండ వేసుకోండి. జింకు లోపించినపుడు మొక్కలోని ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం, పసుపు వర్ణంకి మారుతాయి. ఆకులు చిన్నవిగా ఉండి, ముడతలు పడి కణువులు మధ్య దూరం తగ్గిపోతుంది. పంట మీద ఈ లోపం కనిపించినపుడు 2 గ్రా. జింకు లీటరు నీటికి కలిపి 2 లేక 3 సార్లు 4-5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. మేము రేడియో ప్రోగ్రాంలో బోరాన్ పిచికారీ గురించి విన్నాము. దీని లోపం వలన కాయలు రాలటం జరుగుతుందా. లోపం ఎలా గుర్తించాలి. నివారణ చర్యలు తెలుపండి. ఈ సూక్ష్మధాతులోపం వలన పూవుల స్వరూపం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలకు ముడుచుకొని పోతాయి. ఈ లోపం ఎక్కువగా వున్నప్పడు కాయలు రాలిపోవటంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపైపగుళ్ళు ఏర్పడతాయి. దీని నివారణకు పైరు వేసిన 60,90 రోజుల తరువాత లీటరు నీటికి 1-1.5 గ్రా, బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పూత, గూడ, పిందె బాగ రాలుతుంది. దీని నివారణకు ఏమి చర్యలు చేపట్టాలి. తెల్లదోమ, పేనుబంక, కాయతొలుచు పరుగు వివిధ దశలలో ఆశించినపుడు గూడ, కాయలు రాలటం జరుగుతుంది. ఒకవేళ మీరు వీటిని గమనించినట్లయితే సిఫారసు చేసిన నివారణ చర్యలు చేపట్టి పూత, గూద, కాయలు రాలటం అరికట్టవచ్చు. అకస్మిక వాతావరణ మార్పులు అంటె ఎక్కువ కాలం పంట బెట్టకు గురి అయిన తరువాత వరాలు పడటం వలన కూడ ఇలా జరుగుతుంది. పైన చెప్పిన కారణాలు కానట్లయితే, మీరు యన్ఎఎ 10 పిపిఎమ్ లేదా ప్లానోఫిక్స్ 2 మి.లీ. 10 లీటర్ల నీటిలో 40-45 రోజులు, 60-65 రోజులకు ఒకసారి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. చలి ఎక్కువగా ఉన్నది. పంట ఎర్రబడింది నివారణ చర్యలు తెలుపండి. మీరు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేటు ఒక లీటరు నీటికి + 10 గ్రా. డిఎపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మా పంట వయస్సు 80 రోజులు, తలలు ఎప్పడు తుంచాలి. దీని వలన ఉపయోగం ఏమిటి. అధిక రొట్ట పెరగకుండ ఉండటానికి శిఖరాగ్ర మొగ్గలను (తల తుంచుట) 15-16 కణుపులు ఏర్పడిన దశలో లేదా 90 రోజుల తరువాత తుంచాలి. ఇలా చేయుట వలన లేత చిగుర ఆకులు మీద పెట్టబడిన శనగపచ్చ పురుగు గుడు నాశనం చేయబడి, శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. దీనితో పాటు పూత పిందె రాలటం కూడ తగ్గుతుంది. మాకు కొద్దిగా నీటి వసతి ఉన్నది. ఎప్పడు నీటి తడులు యిస్తే మంచిది. వరాధార పంటగా వేసినప్పడు పంట వేసిన 75-120 రోజుల మధ్య బెట్ట లేకుండ చూడాలి. ఈ సమయంలో బెట్ట వచ్చిన ఎడల పూత రాలుట, కాయలు పడిపోవటం, కాయలు బలహీనంగా తయారవటం, జిన్నింగ్ చేసినప్పడు దూది శాతము తక్కువ వచ్చుట జరుగును. కాని 500 మి.మి. వర్షపాతం నల్లరేగడి భూమిలో వరాధార పంటకు ఎటువంటి ఉండదు. ఒకవేళ మధ్యరకం భూములు అయితే నీటి వసతి ఉన్నది. కాబట్టి అవసరం అయితే రెండు దఫాలుగా మొగ్గ తయారవుతున్నప్పడు మరియు కాయ తయారవుతున్నప్పడు నీటి తడులు యివ్వండి. ప్రత్తిలో కాయలు ఎప్పడు పగులుతాయి. వరాధార పంటలో పంట వేసిన 120 రోజులకు, నీటి వసతి క్రింద పంట వేసిన 130 రోజుల తరువాత మొదటిసారి ప్రత్తి తీస్తారు. సాధారణంగా పూవు ఫలధీకరణం చెందిన తరువాత 50 రోజులకు కాయ మొత్తం తయారవుతుంది. ఆ తరువాత 7-10 రోజులకు కాయ పగులుతుంది. ప్రత్తి పంటను రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడటానికి ఏ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ప్రత్తి పంటను ఆశించే రసం పీల్చే పరుగులలో పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ, ముఖ్యమయినవి. ప్రత్తి పైరును సంవత్సరాల తరబడి ఒకే పొలంలో సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలి. వీలైనంత వరకూ సేంద్రీయ, రసాయన ఎరువులను సమపాళ్ళలో వేసుకోవాలి. తెల్లదోమ ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో తట్టుకొనే రకాలైన ఎల్‌కె-861, ఎల్పియస్-141 (కాంచన), యన్ఎ-1280, ఎల్-615, సుప్రియ వంటి రకాలను సాగు చేయాలి. పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సూటి రకాలైన యంసియు-5, ఎల్-604, ఎల్ఆర్ఎ-5166. యల్-603, ఎన్ఎ-1235 (నరసింహ), హైబ్రిడ్ రకాలైన హెచ్-8, యన్హెచ్వి-44, సవిత వంటి రకాలైన హెచ్-8, యన్ హెచ్‌వి-44, సవిత వంటి రకాలను వేసుకోవాలి. చేను చుటూ 2 లేక 3 వరసల జొన్న మొక్కజొన్న లేదా అలసందలను కంచె పంటగా వేయాలి. అంతర పంటలుగా అలసంద / వేరుశనగ / సోయా చిక్కుడు /పెసర / మినుము / గోరుచిక్కుడు / కొబ్ర వంటి వాటిని 1: 2 నిష్పత్తిలో అంటే 2 సాళ్ల ప్రత్తికి 1 లేక 2 సాళ్లు అంతర పంటను సాగు చేసి మిత్ర పురుగులను వృద్ధి చేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యుయస్ 5 గ్రా. లేదా థయామిథోక్సామ్ 70 డబ్ల్యుఎస్ 4 గ్రా. లేదా కార్ఫోసల్ఫాన్ 40-50 గ్రా, కలిపి విత్తనశుద్ధి చేసి 30-45 రోజుల వరకు రసం పీల్చే పురుగులను నియంత్రించాలి. అలాగే విత్తిన 20,40,60 రోజుల్లో మొక్కలేత కాండానికి మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్ డెమటాన్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో లేక ఇమిడాక్లోప్రిడ్ 200 యస్.ఎల్ మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి కాండానికి మొక్క మధ్య భాగంలో ఆకుపచ్చగా ఉన్న కాండంపై 2 నుండి 4 అంగుళాల మేర బ్రష్‌తో పూయాలి. శుద్ధి చేసిన విత్తనాన్ని వాడే రైతులు కూడా తప్పనిసరిగా 40,60 రోజుల దశలో కాండంపై మందు పూయాలి. నాటిన 60 రోజుల వరకూ ప్రత్తిపై సింథటిక్ పైరెద్రాయిడ్ మందులను వాడరాదు. ప్రత్తిలో పేనుబంక మరియు తామర పురుగులు ఆశించాయి. ఎలా నివారించాలి. లేదా పచ్చదోమ ఆశిస్తే ఏం చేయాలి. పచ్చదోమ నివారణకు అవసరాన్ని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా మిథైల్ ఆక్సీ డెమటాన్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 ఎస్ఎల్ 0.4 మి.లీ. లేదా థయామెథోక్సామ్ 0.2 గ్రా.లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.లు లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రా.లు / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉధృతి ప్రత్తిలో ఎక్కువగా ఉంది. ఏ నివారణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు పసుపురంగు అట్టలపై జిగురు లేదా గ్రీజును రాసి పొలంలో అక్కడక్కడా వ్రేలాడ గట్టాలి. అలాగే పచ్చటి టిన్ రేకులకు పసుపు రంగు వేసి దానికి జిగురు లేదా గ్రీజును పూసి కర్రకు కట్టి ప్రత్తి మొక్కల చుటూ పొలమంతా కలియ తిరగాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పడు ట్రయజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. + 1 మి.లీ. సాండోవిట్ లేదా టీపాల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిలో ఆకులు ఎర్రబడి, అడుగు భాగంలో చిన్న పురుగులు ఉన్నాయి లేదా ప్రత్తిలో ఎర్రనల్లి నివారణ ఎలా ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా.లు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. డైకోఫాల్ కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిలో వివిధ కాయతొలుచు పరుగుల వలన కలిగే నష్టాన్ని ఏ విధంగా గుర్తించాలి. సమగ్ర పద్ధతుల ద్వారా వీటిని ఎలా నివారించాలి. మచ్చల పురుగు: ఈ పురుగు ఆశించిన చిన్న మొక్కలలో కొమ్మల చివర్లు వాడి వాలి పోయి వుంటాయి. దీనినే తలనత్త అని కూడా అంటారు. ప్రక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మొగ్గ, పూత దశల్లో ఆశిస్తే గూడ, పూత రాలిపోతాయి. ప్రత్తి కాయలు మదరకుండానే పగిలి గ్రుడ్డి పత్తి వస్తుంది. శనగపచ్చ పురుగు : పిల్ల పురుగులు ఆకులపై సన్నని రంధ్రాలు చేసి పత్ర హరితాన్ని తింటాయి. క్రమేపి మొగ్గలలోని, పువ్వులలోకి చొచ్చుకొని లోపల భాగాన్ని తింటాయి. ఈ పురుగు ఆశించిన మొగ్గలు, పువ్వులు, చిన్న కాయలు రాలిపోతాయి. కాయలపై గుండ్రని రంధ్రం వుండి తలభాగం లోపలికి మిగతా బయటకి వుంటే అది శనగ పచ్చపురుగుగా గుర్తించాలి. కాయలు లేని సమయంలో ఆకులను ఆశించి చేస్తాయి. లదై పురుగు:పిల్ల పురుగులు గుంపులుగా వుండి ఆకులను జల్లెడాకులుగా మారుస్తాయి. పెద్ద గొంగళి పరుగులు ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. తర్వాత దశలో పూత, పూవులు, కాయలను తిని నష్టపరుస్తాయి. ఇవి కాయలపై ఒక ఆకారం లేని రంధ్రాలను చేసి తింటాయి. ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేలమీద, నెర్రెలలో, మట్టి పెళ్లల క్రింద లేదా చెత్త క్రింద దాక్కొని రాత్రి వేళల్లో పైరును ఆశించి విపరీతంగా నష్టపరుస్తాయి. గులాబీరంగు కాయ తొలిచే పురుగు: చిన్న గొంగళి పురుగులు గ్రుడ్లనుండి వెలువడిన వెంటనే మొగ్గలకు, లేత కాయలకు కనబడనంత సన్నని రంధ్రాలు చేసి లోనికి ప్రవేశిస్తాయి. ఎదిగే పువ్వులోని పదార్థాలను తినటం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పారకుండా ముడుచుకొని వుంటాయి. దీనినే గుడ్డిపూలు అంటాము. తొలి దశలో ఈ పురుగు ఆశిస్తే మొగ్గలు, పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశిస్తే కాయలు రాలిపోతాయి. లేదా గుడ్డి కాయలుగా మారతాయి. ఈ పురుగు వలన నష్టపడిన కాయలను ముందుగా గుర్తించడం సాధ్యపడదు. దీనివల్ల దూది రంగుమారి నాణ్యత తగ్గుతుంది. కాయతొలిచే పురుగుల సమగ్ర యాజమాన్య పద్దతులు: వేసవిలో లోతు దుక్కి చేయాలి. గులాబిరంగు పరుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచోట తక్కువ కాల పరిమితి రకాలైన హెచ్-8, ఎమ్ఇసిహెచ్, ఎల్ఎహెచ్హెచ్-4, ఎన్‌హెచ్-44, ఎన్ఎ-1325 లాంటి రకాలు సాగు చేయాలి. సాధ్యమయినంత వరకూ ఒక ప్రాంతమంతా ఒకేసారి వితేటట్లు చూడాలి. విత్తన శుద్ధి చేయని విత్తనాలను మట్టి కడవలోవేసి, గాఢ గంధకీ కామ్లము 80-100 మి.లీ. మెల్లగా పోస్తూ తొందరగా కర్రతో కలియబెట్టాలి. విత్తనం అంతటినీ అమ్లం అంటేట్టు చేసి వెంటనే నీటితో 2-3 సార్లు కడిగి నీడలో ఆరబెట్టాలి. నాలుగు రకాల కాయతొలచు పరుగులకు విడివిడిగా ఎకరాకి 4 బుట్టలు ప్రతి 50 మీటర్లకు ఒక్కటి చొప్పన మొక్కలకంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. ఈ మచ్చల పరుగు కొరకు పైరు మొలచిన పది రోజుల నుంచి, శనగ పచ్చ మరియు పాగాంకు లదై పరుగులకు 45 రోజుల నుంచి, గులాబి రంగు పురుగుకి అక్టోబరు మాసం నుండి అమర్చుకోవాలి. ప్రతి 20 రోజులకు ఎర మందును మార్చాలి. శనగ పచ్చ పరుగుకి ఆకర్షక పంటగా పసుపు పూలిచ్చే 100 బంతి మొక్కలను పెట్టి మొగ్గలు /పూలలో ఉన్న శనగపచ్చ పురుగులను ఎప్పటికప్పుడు గమనించి ఏరివేసి నాశనం చేయాలి. ప్రత్తి గూడ దశకు వచ్చే లోపుగా బంతి పూలు పూచేటట్లుగా చూసుకోవాలి. පයි, మచ్చల పురుగులకు ఆకర్షక పంటలుగా ఆముదం మరియు బెండమొక్కలను వేయాలి. ఎకరాకి 10 పక్షి స్థావరాలను ఏర్పరచుకోవాలి. లదై పురుగు వలసలను నిరోధించటానికి చేను చుటూ అడుగు లోతు చాలు తీసి ఫాలిడాల్ లేదా లిండేను పొడిని చల్లాలి. శనగ పచ్చ పురుగు గ్రుడ్లను కొమ్మల చివర్లలో ජීජ చిగురాకులపై పెడుతుంది. కాబట్టి 15-16 కణుపుల దశలో మొక్కల తలలు తృంచాలి. లింగాకర్షక బుట్టలలో రెక్కల పరుగుల ఉధృతిన గమనించి వీలైన చోట ఎకరాకు 60,000 చొప్పన టైకోగ్రామా గ్రుడ్లను 4-5 సార్లు వారానికొకసారి వదలాలి. అలాగే అల్లికరెక్కల పరుగులను ఎకరాకి 20,000 చొప్పన వదలాలి. మొక్కల దశను బట్టి వేపగింజల కషాయం 5 శాతం (50 గ్రా, వేపగింజల పొడి) లేదా వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి రెక్కల పురుగులు కనబడినప్పడు పిచికారీ చేయాలి. లింగాకర్షక బుట్టలు అమర్చిన పొలాల్లో రోజుకు బుట్టకు 15 మచ్చల పురుగులు లేదా 10 శనగ పచ్చ పరుగులు లేదా 20 పొగాకు లదై పురుగులు లేదా 8 గులాబిరంగు పురుగులు పడినప్పుడు ఉధృతస్థాయికి చేరుకున్నట్టు గమనించి పరుగు మందులను వాడాలి. గుడు లేక చిన్న లార్వాదశను నివారించడానికి 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. చిన్న లార్వాదశలో ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్లోరి పైరిఫాస్ 2.5 మి.లీ.కు 1:2 నిష్పత్తిలో నువ్వుల నూనె లీటరు నీటికి చొప్పన కలిపి పిచికారీ చేయాలి. కొద్దిగా ఎదిగిన లార్వా దశలో హెచ్.యన్.పి.వి. లేదా స్పోడో యన్.పి.వి. ద్రావణం ఎకరాకు 200 ఎల్.ఇ+500 గ్రా. ల బెల్లం + 100 మి.లీ. శాండోవిట్ లేదా టీపాల్ మరియు 50 గ్రా. రాబిన్ బ్యూతో కలిపి వాతావరణం చల్లగా ఉన్నప్పడు సాయంత్రం వేళల్లో చల్లాలి. అలాగే బాసిల్లస్ తురిన్జెన్సిస్ సంబంధ మందులను 2 గ్రా. లేదా 2 మి.లీ. లీటరు నీటికి కలిపి చల్లగా ఉన్నప్పడు చల్లాలి. కాయతొలచు పరుగులు మొక్కకు ఒక గొంగళి పురుగు లేదా 10 శాతం దెబ్బతిన్న మొగ్గలు లేదా కాయలు కనబడితే నష్టపరిమితి స్థాయి చేరినట్లు గమనించాలి. అవసరాన్ని బట్టి క్వినాల్ఫాస్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా థయెడికార్చ్ 1.5 గ్రా. లేదా ట్రయజోఫాస్ 2 మి.లీ. లేదా ఇండాక్సాకార్చ్ 1.0 మి.లీ. లేదా స్వినోశాడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పన మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. మూడవ దశ దాటిన పరుగులను చేతితో ఏరి వేయాలి. రాలిపోయిన మొగ్గలను, పిందెలను, పగలకుండా వున్న గుడ్డి కాయలను ఎప్పటికప్పుడు ఏరి వేసి నాశనం చేయాలి. ప్రత్తి తీయగానే చేలనుంచి ముళ్లను తీసి ఏరివేయాలి. అత్యవసర పరిస్థితుల్లో, అదీ ఒకటి లేక 2 సార్లు మాత్రమే సింథటిక్ పైరిథాయిడ్ మందులను వాడాలి. పైరు తొలి దశలో చేతి పంపులను, తర్వాతి దశల్లో పవర్ స్పేయర్లను వాడాలి. పవర్ స్పేయర్ వాడేటప్పడు పురుగు మందుల మోతాదును 2.5 నుండి 3 రెట్లు పెంచి వాడాలి. ప్రత్తి మొక్కలు లేత దశలో చనిపోతున్నాయి లేదా ప్రత్తిలో ఎండు తెగులు / వేరు కుళ్ళు తెగులు నివారణ ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలి చెట్టుపై నుండి క్రిందికి వేలాడుతూ వుంటాయి. ఎదిగిన మొక్కలు వడలి, పసుపు రంగుకి మారి రాలి పోతాయి. లేత మొక్కలు అర్గాంతరంగా ఎండి చనిపోతాయి. నివారణకు, ఎండాకాలంలో పొలాన్ని లోతుగా దున్నాలి. తృణధాన్య పైర్లతో పంట మార్పిడి చేయాలి. సాధ్యమైనంత వరకూ పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట ఎరువులను వాడాలి. కిలో విత్తనానికి 4 గ్రా. టైకోడెర్మా విరిడి లేదా 2 గ్రా. కార్బండజిమ్ చొప్పున వేసి విత్తన శుద్ధి చేయాలి. తెగులుసోకిన మొక్క పాదులలో లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్టు మొదలు బాగా తడిచేటట్ల మందు ద్రావణాన్ని పోయాలి. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు లేదా ప్రత్తిలో ఆల్టర్ నేరియా ఆకుమచ్చ నివారణ ఎలా. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.లు కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల మీద తెల్లమచ్చలు వచ్చి ఆకులు పండి రాలి పోతున్నాయి. ఏం చేయాలి. బూడిద తెగులు ఆశిస్తే ఈ విధంగా జరుగుతుంది. నివారణకు నీటిలో కరిగే గంధకం 80 శాతం 2 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా ఎకరాకు 8-10 కిలోల పొడి గంధకం చల్లాలి. ప్రత్తి పంటలో కాయకుళ్లు నివారణ ఎలా. కాయదశలో వరాలు ఎక్కువగా పడితే, అదీ కాయతొలుచు పరుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల కాయలు కుళ్లిపోతాయి. నివారణకు, సాధారణంగా వాడే పురుగు మందులతో పాటు శిలీంధ్ర నాశనులైన సైప్లోసైక్లిన్ 1 (). మరియు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. 10 లీటర్ల నీటికి చొప్పన కలిపి పిచికారీ చేయాలి. శిలీంధ్రం వలన ఆశించు కాయకుళ్లును కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కూడా నివారించవచ్చు. ఆధారం: http://www.apagrisnet.gov.in