గులాబీ గులాబి పువ్వులు సరిగా పూయడంలేదు. ఏం చేయాలి గులాబి కొత్త చిగుర్లపై పూస్తుంది. కాబట్టి కొమ్మ కత్తిరింపులు సంవత్సరానికి ఒకసారి అనగా అక్టోబరు - నవంబరు మాసాల్లో చేయాలి. చనిపోయిన ఎండిపోయిన పురుగులకు తెగులు ఆశించిన బలహీనంగావున్న కొమ్మలతోబాటు, రూట్స్టాక్ పైన వచ్చే కొమ్మలను కత్తిరించాలి. తరువాత ఒక్కో మొక్కకు మూరియా, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతిమొక్కకు 100గ్రా, చొప్పన వేయాలి. ఇదే మోతాదును రెండు మూడు దఫాలుగా వేయాలి. అలాగే సూక్ష్మధాతువులయిన మాంగనీస్ సల్ఫేట్ 15)., మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రా, చీలేటెడ్ ఇనుము 10 గ్రా, బొరాక్స్ 5గ్రా. కలిపిన మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబి కొమ్మలు ఎండిపోతున్నాయి? ఎలా నివారించాలి. కత్తిరింపచేసిన కొమ్మల చివరలనుండి ఎండిచివరకు మొక్కంతా ఎండిపోతుంది. నివారణకు కత్తిరింపు చేసిన వేంటనే చివరలకు రాగి సంబంధమైన మందును పేస్ట్‌లాగా పూయాలి లేదా పచ్చిపేడ మరియు మట్టితో కలిపిన పేస్తునుపూసి కూడ ఈ తెగులును నివారించుకోవచ్చు. గులాబి ఆకులు కత్తిరించినట్లున్నాయి, ఎలా నివారించాలి. ఆకుతినే పురుగు నివారణకు మలాథియన్ 5 శాతం పొడిని ఎకరానికి 15 కిలోల చొప్పన సాయంత్రం సమయంలో చల్లాలి. గులాబి మొగ్గలు నల్లబడి సరిగా విచ్చుకోవడంలేదు. ఎలా నివారించాలి. పేను బంకపరుగు ఆశించి, రసం పీల్చడంవల్ల మొగ్గనల్లగా మారుతుంది. దీని నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గులాబీ తోటను ఎలా వేయాలి. మొగ్గంటు కట్టిన హైబ్రిడ్ గులాబీలను నేల స్వభావాన్ని బట్టి 120 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. జూన్ నుండి జనవరి వరకు నాటుకోవచ్చు. కానీ సెప్టెంబరు - అక్టోబరు మాసాల్లో నాటుకోవడం మంచిది. గులాబిలో నల్లమచ్చ తెగులుని ఎలా నివారించాలి. గులాబిలో వచ్చే నల్లమచ్చ తెగులు శిలీంద్రము వలన వస్తుంది. ఆకులపై గుండ్రటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఏర్పడిన ఆకు క్రింద భాగంలో శిలీంద్రపు పెరుగుదలను గమనించవచ్చు. తేమ ఎక్కువగా ఉన్నప్పడు ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. తెగులునివారణకు మాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీచేయాలి. చామంత్రి చామంతి తోటను ఎలా వేయాలి? వివరాలు తెలపండి. చామంతి తోటను పిలకలు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలకోత తరువాత ఫిబ్రవరి - మార్చి నెలలందు మొక్కల నుంచి పిలకలను కత్తిరించి నారు మడిలో నాటుకొని, జూన్ – జులైలో పొలంలో నాటుకుంటే డిశంబరు – జనవరి వరకు పూతపూసి కోతకొస్తాయి. మొక్కలను కొమ్మకత్తిరింపుల ద్వారా కూడ ప్రవర్ధనం చేయవచ్చు మొక్కలను పొలంలో 30x20 సెం.మీ. ఎడంగా నాటుకోవాలి. నాటిన నాలుగు వారాల తర్వాత మొక్క తలలు తుంచితే ప్రక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది. చామంతి పూలు సరిగా విడివడటం లేదు. ఏం చేయాలి. తామర పురుగులు ఆశించడం వల్ల ఆకులు ముడతలుపడి పూలు వాడిపోయి దిగుబడి తగ్గుతుంది. నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. లేదా కార్బరిల్ 50 శాతం పొడి మందు 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కనకాంబరం కనకాంబరంలో రకాలు ఏవి? విత్తనం ఎక్కడ దొరుకుతుంది. కనకాంబరంలో ఆరంజి, పసుపు, ఎరుపు మరియు గులాబీరంగులో పుష్పించే రకాలున్నాయి. విత్తనం మరియు కొమ్మకత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. విత్తన్నాన్ని మే - జూన్ నెలల్లో విత్తుకొని, ఆగస్టు – సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. విత్తనాన్ని సిఫార్సు ವೆಸಿನಿ నమ్మకమైన నర్సరీల నుండి ఎన్నుకోవాలి. కనకాంబరం మొక్కలు ఎండిపోతున్నాయి. నివారణ ఎలా. పరిశుభ్రమైన సాగు పద్ధతులు పాటించాలి. మరుగు నీటి వసతిని కల్పించటంతో బాటు, నులిపురుగుల నివారణకు వేసవిలో లోదుక్కి దున్ని భూమిని బాగా ఎండబెట్టి, సోలరైజేషన్ చేయాలి. ఎకరానికి 200 కిలోల వేపపిండితో బాటు, 8-10 కిలోల కార్బోఫ్యురాన్ గుళికలు వేయాలి. నారు మొక్కలను 2గ్రా, బెనోమిల్ లేదా 1 గ్రా. కార్బండజిమ్ మందు ద్రావణంలో మంచి నాటుకోవాలి. కనకాంబరం మొక్కల కాండం నల్లగా/ఊదా రంగులోకి మారుతోంది. ఏమి చేయాలి. నారుమడి మరియు తోటలో ఆకులపై ముందుగా నీటితో తడిచినటువంటి మచ్చలు ఏర్పడి, క్రమేపి పెద్దవై నల్లటి మచ్చలుగా మారతాయి. ఆకుల ఈనెలు కూడా నల్లబడతాయి. కాండంపై నల్లటి మచ్చలు ఏర్పడి కొమ్మలు ఎండిపోతాయి. ఈ తెగులు ఆగష్టు-అక్టోబరు వరకు కనిపిస్తుంది. ఇది బాక్టీరియా వల్ల వస్తుంది. తెగులు సోకిన ఆకుల్ని కాండాన్ని తగులబెట్టాలి. చిరుధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయాలి. తెగులు కనిపించిన వెంటనే 1 లీటరు నీటికి 200 మి.గ్రా. ప్లాంటోమైసిన్ + 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ 18 రోజుల వ్యవధిలో రెండు సార్లు పచికారీ చేసి నివారించుకోవచ్చు. కనకాంబరంలో ఎండు తెగుల్ని ఎలా నివారించాలి ఈ తెగులు భూమిలో ఉండే శిలీంద్రాల ద్వార వస్తుంది. తెగులు సోకిన మొక్కల కుళ్ళిపోతాయి. మొక్కలు పూలు పూసేటప్పడు ఎండిపోవడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోతారు. వేసవిలో లోతు దుక్కులు దున్ని లోపల ఉన్న శిలీంద్రాల్ని అరికట్టవచ్చు. జొన్న సజ్ఞ పంటలతో పంట మార్పిడి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మల మల్లె తోటను ఎలా వేసుకోవాలి? మొక్కలు ఎక్కడదొరకుతాయి అంటు తొక్కడం ద్వారా ప్రవర్ధనం చేయబడిన మొక్కలను ఏదేని మంచితోటనుండి సేకరించి జూన్ - డిశంబరు వరకు నాటవచ్చు. అంటు మొక్కలను 1.25-2.0 మీటర్ల ఎడం వుండేలా నాటాలి. మల్లె పూలు సరిగా పూయడంలేదు మరియు మొగ్గ సైజు చిన్నదిగా వుంది. ఎలా నివారించాలి మల్లెలో పూత కొరకు నవంబరు – జనవరి మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేయాలి. ఇందుకు ముందుగా 10-15 రోజుల మందు నీరు కట్టడం ఆపివేయాలి. ప్రతిమొక్కకు 8-10 కి. పశువుల ఎరువుతోబాటు 60-120గ్రా, నత్రజని, 120గ్రా, భాస్వరం మరియు పొటాష్ ఎరువులను కొమ్మ కత్తిరింపుల తరువాత వేసి వెంటనే నీరు పెట్టాలి. ఇందువల్ల మొక్కలు చిగురించి పూతకొస్తాయి. పూల దిగుబడి పెంచుటకు లీటరు నీటికి 2.5గ్రా. జింక్ సల్ఫేట్, 5గ్రా. మెగ్నిషియం సల్ఫేట్ సూక్ష్మధాతువులను కలిపి రెండు మూడు దఫాలుగా పిచికారీ చేయాలి. మల్లెలో మొగ్గ తొలుచు పరుగు ఎలా నివారించాలి నివారణకు మలాథియాన్ లేదా ఎండోసల్బాన్ లీటరు నీటికి 2 మి.లీ. మందును కలిపి పిచికారీ చేయాలి. మల్లె ఆకు పసుపు రంగుకు మారి రాలిపోతుంది. నివారించడం ఎలా నల్లి ఆశించి రసం పీల్చడం వల్ల కలుగుతుంది. నివారణకు గంధకం పొడిని ఎకరాకు 8-10 కిలోల చొప్పన చల్లుకోవాలి. ఆకు ఎండు తెగులు ఆశించడం వల్ల కూడ నష్టం కలుగుతుంది. తెగులు నివారణకు . లేదా కార్బండజిమ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మల్లె మొక్కలు ఎండిపోయి చనిపోతున్నాయి? నివారించడం ఎలా? ఎండు తెగులు నివారణకు మొక్క చుటూ కాపర్ ఆక్సీక్లోరైడు 3గ్రా. లీటరు నీటికి కలిపి భూమిని తడపాలి. మరుగు నీటి వసతిని కల్పించాలి.