జొన్నను ఖరీఫ్‌లో ఎప్పటి వరకు విత్తుకోవచ్చు

వేసవిలో భూమిని తయారు చేసుకొని తొలకరి వరాలు పడగానే వేసుకోవాలి. తరువాత వేసుకుంటే మొవ్వ ఈగ ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే విత్తనాలను తప్పని సరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తన మోతాదు పెంచాలి. విత్తు కొనేటప్పడు కార్బోప్యురాన్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పన సాళ్ళలో వేసుకోవాలి.

రబీలో ఎప్పడు విత్తుకుంటే బావుంటుంది. ఏ రకాలు అనుకూలం తెలుపండి.

అక్టోబర్ నుండి నవంబర్ వరకు అనుకూలం. ఎస్ హెచ్-9 ఎన్‌టిజె-1,2,3 మరియు సిఎస్వి-216ఆర్ రకాలు రబీకి అనుకూలం.

మేము మొదటసారి కృష్ణాడెల్లా క్రింద జొన్న వేస్తున్నాము. ఎకరానికి ఎంత విత్తనం అవసరం. ఎరువులు వాడాలా. వద్దా

ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. నీటి వసతి ఉంటే ఎకరానికి 24-82 కిలోల నత్రజని, 16కిలోల భాస్వరము, 12 క్రిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని రెండు దఫాలుగా అంటే సగం ఆఖరి దుక్కిలోను, మిగత సగం పంట మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పడు వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

జొన్నలో మల్లె అధికంగా ఉన్నది. దీనిని ఎలా నివారించాలి

జొన్నలో మల్లె, పూతకు రాకముందే పీకి తీసివేయాలి. మొలకెత్తిన తరువాత లీటరు నీటికి 50 గ్రా. అమ్మోనియం సల్ఫేట్, లేదా 200 గ్రా. యూరియా కలిపి పిచికారీ చేయాలి.

జొన్న వేసి 20 రోజులు అయినది. కలుపు విపరీతంగా ఉన్నది, కలుపు నివారణ మందులు తెలపండి.

24 డి సోడియం సాల్ట్‌ను 15 నుండి 20 రోజుల తరువాత లీటరు నీటికి 2-2.5 గ్రా. వంతున కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200 లీటర్ల ద్రావణం అవసరం అవుతుంది.

జొన్నలో తొలిదశలో ఆశించే మొవ్వ లేదా కాండం తొలిచే పరుగు / మొవ్వ చంపే ఈగ / ఘాట్ పై నివారణ ఎలా

మొవ్వ చంపే ఈగ ఆశించే ప్రాంతాల్లో సియస్ హెచ్ -17 మరియు ఎన్‌టిజి-4 వంటి పురుగు తట్టుకొనే రకాలను సాగు చేయాలి. జొన్న పంటను జులై 15వ తారీఖు లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తాల్సి వస్తే విత్తన మోతాదును మూడు వంతులు పెంచి, 5 వారాల తర్వాత కావల్సినన్ని మొక్కలు వుంచి, మిగతా వాటిని పురుగు ఆశించిన మొక్కలతో సహా తీసివేయాలి. సాళ్ళలో వితేటప్పడు కార్బోప్యరాన్ 3 జి గుళికలు మీటరు సాలుకు 2 గ్రా, చొప్పన లేదా విత్తనం మొలచిన 7, 14, 21 రోజులతో ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

జొన్న వేసి 40 రోజులయ్యింది. ఆకులపై వరసలలో గుండ్రని రంధ్రాలున్నాయి. అక్కడక్కడా మొవ్వ చనిపోయి తెల్లకంకి వస్తోంది. ఏం చేయాలి. లేదా జొన్నలో మొవ్వ తొలిచే మచ్చల పురుగును ఎలా నివారించాలి

తెల్లకంకి ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో పురుగును తట్టుకొనే రకాలైన సిఎస్ హెచ్ -17 లేదా పిఎస్ హెచ్ - 1 లేదా ఎయస్ హెచ్ - 1 వంటి రకాలను సాగు చేయాలి. విత్తిన 35-40 రోజుల లోపు ఎకరాకు 4 కిలోల కార్బోప్యురాన్ 3 జి గుళికలు లేదా ఎండోసల్బాన్ 4 జి గుళికలను ఆకు సుడులలో వేసుకోవాలి. పంట అవశేషాలను కాల్చి వేయాలి.

జొన్నలో ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. ఎలా నివారించాలి

మొవ్వనల్లి ఆశిస్తే ఈ విధమైన లక్షణాలు కనబడతాయి. నివారణకు డైమిధోయేట్ లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా కార్చిరిల్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పన కలిపి పిచికారీ చేయాలి. లేదా మిథైల్ పెరాథియాన్ పొడి మందును ఎకరాకి 8 కిలోల చొప్పన చల్లాలి.

జొన్నలో కంకినల్లి ఎలా నివారించాలి

పిల్ల, పెద్ద పరుగులు, గింజ పాలు పోసుకొనే దశలో, ఆశించి రసం పీల్చటం వలన గింజలు నొక్కులు గాను, ఎర్రని మచ్చలు కలిగి వుంటాయి. క్రమేపి నల్లగా మారతాయి. తొలకరిలోనే విత్తుకోవటం లేదా పూత సమయంలో మరియు కంకి తయారయ్యే దశలో ఎకరాకి 8 కిలోల కార్బరిల్ పొడి మందును చల్లి కంకినల్లిని నివారించవచ్చు.

జొన్నలో బంక కారు తెగులు ఎలా అరికట్టాలి

తేనె బంక లేదా బంక కారు తెగులు ఆశిస్తే కంకుల నుంచి గులాబి రంగు లేదా ఎర్రని ద్రవం బొట్టు బొట్టుగా జిగురు మాదిరి కారుతూ వుంటుంది. గింజ పై నల్లని బూజు ఏర్పడి కంకులు నల్లగా మారతాయి.

ముందు జాగ్రత్తగా పూత సమయంలో మాంకోజెబ్ 2 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లేదా బెన్లేట్ 1 (QP. చొప్పన కలిపి 2-3 సార్లు కంకులు తడిచేలా వారంరోజుల వ్యవధిలో పిచికారీచేయాలి.

జొన్నలో కంకి మసక తెలుపు లేదా గులాబి రంగులోకి మారుతున్నాయి. ఎలా అరికట్టాలి

గింజ బూజు తెగులు ఆశిస్తే గింజలు మసక తెలుపు లేదా గులాబి రంగులోకి మారతాయి. నివారణకు, కాప్లాన్ 20 గ్రా, మరియు ఆరియోఫంజిన్ 2 గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి లేదా కార్బండజమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి గింజ ఏర్పడేటప్పడు మరియు గింజ గట్టిపడే దశలో పిచికారీ చేయాలి. పంట కోత చేయకుండా గింజ క్రింద భాగంలో నల్లని చార ఏర్పడగానే కంకులను కోయాలి. ముందు జాగ్రత్తగా బూజు తెగులు తట్టుకొనే రకాలైన సిఎస్ హెచ్-5, సిఎస్ హెచ్-6, సిఎస్ హెచ్-16, ఎయస్ హెచ్-1, పాలెం-2 రకాలను సాగు చేసుకోవాలి.