నీటి పారుదల 90.31 టీఎంసీల గరిష్ఠ నీటి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లాలోని సాగునీరు, తాగునీరు, ఎన్టీపీసీ అవసరాలకు ప్రధాన ఆధారం. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా జిల్లాకు నీరు వస్తోంది. కరీంనగర్లో సమీపంలోని 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన దిగువ మానేరు జలాశయానికి కూడా ఎస్సారెస్పీ నీరే ప్రధాన ఆధారం. కరీంనగర్ జిల్లాలో 4635 చెరువులు, కుంటలుండగా వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. 3.63 లక్షల విద్యుత్ మోటార్లుండగా బావులు, బోర్లకు అమర్చిన మోటార్ల ద్వారా 4.5 లక్షల ఎకరాలు సాగవుతోంది. అలాగే గోదావరి తీర మండలాల్లో నది నుంచి ఎత్తిపోతల పథకాలను చేపట్టి సారంగాపూర్, రాయికల్, ధర్మపురి, వెల్గటూరు, రామగుడం, మంథని, మహదేవపూర్ మండలాల్లో పంటలకు నీటిని అందిస్తున్నారు. కాళేశ్వరం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకంలో 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించటం లక్ష్యంగా నిర్ణయించారు. వర్షాధారంగా ఏటా 3.62 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, అలసంద, కంది వంటి పంటలను పండిస్తారు. శ్రీరాంసాగర్ ఎస్సారెస్పీ ఆధారితంగా జిల్లాలో ఎల్ఎండి ఎగువ, ఎల్ఎండి దిగువ ప్రాంతాల్లో కలిపి 5.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించటం లక్ష్యంగా ఉండగా ప్రస్తుతం 4.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. 19 అడుగుల నీటినిల్వ కలిగిన రోళ్లవాగు పరిధిలో సారంగాపూర్, ధర్మపురి మండలాల్లో వేల ఎకరాలకు నీరందుతుండగా ఈ ప్రాజెక్టుకు కూడా ఎస్సారెస్పీ నీరే ప్రధాన వనరు. 3.2 టీఎంసీల ఎగువ మానేరు, 0.2 టీఎంసీల రాళ్లవాగు, 2 టీఎంసీల బొగ్గులవాగు, 1 టీఎంసీ సామర్థ్యం గల శనిగరం ప్రాజెక్టుల ద్వారా 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ఉంది. జిల్లాలో 4635 చెరువులు, కుంటలుండగా వీటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. జిల్లాలో అధికారికంగా 3.63 లక్షల మోటార్లుండగా అనధికారికంగా 25 వేల వరకు విద్యుత్ మోటార్లున్నాయి. బావులు, బోర్లకు అమర్చిన మోటార్ల ద్వారా 4.5 లక్షల ఎకరాలకు నీరందుతోంది. కరీంనగర్ డివిజన్ పరిధిలో... కరీంనగర్ డివిజన్ పరిధిలో 5,100ఎకరాల ఆయకట్టు ఉన్న శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు కోహెడ మండలం శనిగరంలో ఉంది.100ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్న మరో 221చిన్న నీటి వనరుల పరిధిలో 54,198ఎకరాల ఆయకట్టు ఉంది. 100ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న 1,957చిన్న నీటి వనరులు ఉన్నాయి. వీటి పరిధిలో 30,390ఎకరాల ఆయకట్టు ఉంది పెద్దపల్లి డివిజన్ పరిధిలో... పెద్దపల్లి డివిజన్ పరిధిలో బొగ్గులవాగు మధ్య తరహా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు కింద 5,150ఎకరాల ఆయకట్టు ఉంది. 100ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న 168చిన్న నీటి వనరుల పరిధిలో 39,413ఎకరాల ఆయకట్టు ఉంది. 100ఎకరాల లోపు ఉన్న 1,411చిన్న నీటి వనరుల పరిధిలో 53,155ఎకరాల ఆయకట్టు ఉంది. జగిత్యాల డివిజన్ పరిధిలో జగిత్యాల డివిజన్ పరిధిలో 13,086ఎకరాల ఆయకట్టు కలిగిన మధ్య తరహా ప్రాజెక్టు ఎగువ మానేరు ప్రాజెక్టు ఉంది. 100ఎకరాలపైబడి ఆయకట్టు కలిగిన 243చిన్న నీటి వనరుల పరిధిలో 67,322ఎకరాల ఆయకట్టు ఉంది. పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 1286చిన్న నీటి వనరుల కింద 47,131ఎకరాల ఆయకట్టు ఉంది. సాగు నీటి వసతి వివరాలు: జిల్లాలో 7,19,238హెక్టార్ల సాగు భూమి ఉంది3,12,074బావులు, బోర్లు ఉన్నాయి. వీటి కింద 72,000హెక్టార్ల భూమిసాగులో ఉందివర్షాధారంగా 3,62,230హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టుల కిందఎస్సారెస్పీ కాలువల కింద ఆయకట్టు-2,20,910హెక్టార్లుఎగువ ఎల్.ఎం.డి కింద ఆయకట్టు-1,62,000హెక్టార్లుదిగువ ఎల్.ఎం.డి కింద ఆయకట్టు-58,910హెక్టార్లు మధ్య తరహా ప్రాజెక్టులుశనిగరం ప్రాజెక్టు కింద-2,040హెక్టార్లుఎగువ మానేరు కింద-5,290హెక్టార్లుబొగ్గుల వాగుకింద-2,085హెక్టార్లు చెరువులు, కుంటల కిందజిల్లాలో 4635 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి ద్వారా 3.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఆధారము: ఈనాడు ప్రధాన పంటలు జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పండిస్తున్నారు.జిల్లాలో 7,41,084 లక్షల హెక్టార్ల వ్యవసాయ యోగ్య భూమి ఉంది. 78,745 హెక్టార్ల భూమి సాగులోకి రాకుండా నిరుపయోగంగా ఉంది. సాగుభూమిలో 3 లక్షల హెక్టార్ల నల్లనేలలు, 2.5 లక్షల హెక్టార్ల ఎర్రనేలలు, మిగిలిన విస్తీర్ణంలో ఇసుక, గరప, ఒండ్రు నేలలున్నాయి. జిల్లాలో 65 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.20 లక్షల హెక్టార్లుండగా ఇందులో ప్రధాన పంటలుగా 2.35 లక్షల హెక్టార్లలో పత్తి, 1.63 లక్షల హెక్టార్ల వరి, 57 వేల హెక్టార్ల మొక్కజొన్న, 27 వేల హెక్టార్ల పసుపు, 15 వేల హెక్టార్ల కంది, పెసరలను ప్రధానంగా పండిస్తారు. రబీలో 3.20 లక్షల హెక్టార్ల సాధారణ సాగు ఉండగా 2 లక్షల హెక్టార్లలో వరి, 70 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 15 వేల హెక్టార్లలో వేరుశనగను ప్రధానంగా పండిస్తారు. పత్తిలో 15.52 లక్షల క్వింటాళ్ల దిగుబడి, పసుపులో 11.16 లక్షల టన్నుల ఎండుకొమ్ముల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుండగా రబీలో 13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని, మొక్కజొన్నలో 13 లక్షల క్వింటాళ్ల దిగుబడిని అంచనా వేస్తున్నారు. రబీలో.. రబీలో 3.20 లక్షల హెక్టార్ల సాధారణ సాగు ఉండగా 2 లక్షల హెక్టార్ల వరి, 70 వేల హెక్టార్ల మొక్కజొన్న, 15 వేల హెక్టార్ల వేరుసెనగను ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. పత్తిలో 14.52 లక్షల క్వింటాళ్ల దిగుబడి, పసుపులో 8.16 లక్షల టన్నుల ఎండుకొమ్ముల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5 లక్షల హెక్టార్లుండగా ఇందులో ప్రధాన పంటలుగా 2.05 లక్షల హెక్టార్ల పత్తి, 1.63 లక్షల హెక్టార్ల వరి, 57 వేల హెక్టార్ల మొక్కజొన్న, 17 వేల హెక్టార్ల పసుపు, 15 వేల హెక్టార్ల కంది, పెసరలను ప్రధాన పంటలుగా పండిస్తారు. చెరకు ప్రధానంగా మెట్పల్లి సబ్ డివిజన్లో వేస్తున్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట వద్ద నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉంది. మామిడి తోటలు జగిత్యాల డివిజన్లో ఉన్నాయి. 70వేల హెక్టార్లలో ఇక్కడ మామిడి ఉంది. జగిత్యాల నుంచి ఉత్తర భారత దేశానికి మామిడిని ఎగుమతి చేస్తున్నారు. మార్కెటింగ్, ఎగుమతి జిల్లాలో 22 మార్కెట్ యార్డుల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ జరుగుతుండగా 237 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కోళ్లఫారాలు, బిస్కెట్ తయారీలో మొక్కజొన్నలను అధికంగా వాడుతుండగా జిల్లాలో పండిన మొక్కజొన్నలను ఎక్కువగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మార్కెట్ యార్డులో సిసిఐ పత్తిని, సివిల్ సప్లయిస్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి. జిల్లాలోని ఏకైక మామిడి మార్కెట్‌ను జగిత్యాలలో ఏర్పాటు చేయగా ఈ మార్కెట్ ద్వారా ప్రతి ఏటా వెయ్యి లారీల మామిడి కాయలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి పత్తి, పసుపు, ధాన్యం, మరాడించిన బియ్యాన్ని రైళ్లు, లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. జగిత్యాల వద్ద ఏర్పాటు చేసిన సోయాచిక్కుడు నూనెతీత మిల్లుద్వారా సోయా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. మామిడి ఎగుమతి కేంద్రంగా జగిత్యాల చల్గల్నుంచి పెద్ద ఎత్తున రవాణా ఏటా రూ.120 కోట్ల వ్యాపారం జగిత్యాల మండలం చల్గల్ ప్రదర్శన క్షేత్రం స్థలంలో, జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌ను 1995లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో 65 వేల ఎకరాల మామిడి తోటలుండగా ఇందులో 70 శాతం తోటలు జగిత్యాల డివిజన్‌లోనే ఉన్నాయి. దీంతో మామిడి మార్కెట్‌ను చల్గల్లో ఏర్పాటు చేసి రైతులనుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. యార్డు ఏర్పాటు చేసిన సంవత్సరం 34 మంది వ్యాపారులుండగా తరువాత 65 మంది వ్యాపారులు లైసెన్స్ తీసుకుని కాయలను సేకరించారు. తొలుత నేరుగా కొనుగోళ్లు జరపగా ప్రస్తుతం బహిరంగ వేలం పద్దతిన మామిడి కాయలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణరీత్యా ఉత్తర తెలంగాణాలో పండిన మామిడి అత్యంత నాణ్యతగా ఉంటుండటంతో దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దీంతో ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల వ్యాపారులతో పాటుగా బంగ్లాదేశ్ వ్యాపారులుసైతం ఇక్కడికి వచ్చి మామిడి కాయలను సేకరించి తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాలకు మామిడిని తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు గల్ఫ్ దేశాలకు సైతం జగిత్యాల మామిడిని ఎగుమతి చేస్తున్నారు. కాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు ఇక్కడే ప్రాసెసింగ్చేసి, పెట్టెల్లో ప్యాకింగ్‌చేసి తరలిస్తున్నారు. జగిత్యాల చల్గల్ యార్డునుంచి సీజన్లో ప్రతిరోజు 20-30 లారీల మామిడి కాయలను అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోని రైతులతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులుకూడా చల్గల్లో కాయలను విక్రయిస్తున్నారు. ఇక్కడ సీజన్లో రూ. 120 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. చల్గల్ యార్డులో పక్కాషెడ్లను నిర్మించి రూ. కోటితో శీతల గిడ్డంగిని నిర్మించడానికి మార్కెట్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జగిత్యాలలో మామిడి ఎక్స్పోర్ట్ జోన్‌ను ఏర్పాటు చేస్తామని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. యార్డులో అన్ని సౌకర్యాలు ఏర్పడితే మరికొన్ని సీజన్లలో జగిత్యాల చల్గల్ మామిడి మార్కెట్ యార్డు ఉత్తర తెలంగాణ మామిడి ఎగుమతి కేంద్రంగా మారనుంది. ఆధారము: ఈనాడు ప్రాజెక్టులు నిజామాబాద్ జిల్లా పోచంపాడు గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లాలోని తాగు, సాగునీరు, ఎన్టీపీసీ అవసరాలకు ప్రధాన ఆధారం. 90.31 టీఎంసీల గరిష్ఠ నీటి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా జిల్లాకు నీరు వస్తోంది. కరీంనగర్లో సమీపంలోని 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన దిగువ మానేరు జలాశయానికి కూడా ఎస్సారెస్పీ నీరే ప్రధాన ఆధారం. ఎస్సారెస్పీ ఆధారితంగా జిల్లాలో ఎల్ఎండి ఎగువ, ఎల్ఎండి దిగువ ప్రాంతాల్లో కలిపి 5.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించటం లక్ష్యంగా ఉంది. ఎస్సారెస్పీ మిగులు జలాల సద్వినియోగానికి నిర్మిస్తున్న వరద కాలువ ద్వారా జిల్లాలో 2.20 లక్షల ఎకరాల ఎగువ ప్రాంత ఆయకట్టును నీటిపారుదల కిందకు తేవడం లక్ష్యం కాగా ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీటిని ఎల్ఎండి నింపడానికి తరలిస్తున్నారు. మధ్య మానేరు, గండిపెల్లి, గౌరవెళ్లి, తోటపల్లి రిజర్వాయర్లను వరదకాలువ అనుబంధంగానే నిర్మిస్తున్నారు. 19 అడుగుల నీటి నిల్వ కలిగిన రోళ్ల వాగు పరిధిలో 19 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుకు కూడా ఎస్సారెస్పీ నీరే ప్రధాన వనరు. 3.2 టీఎంసీల ఎగువ మానేరు ద్వారా 39 వేల ఎకరాలు, 0.2 టీఎంసీల రాళ్లవాగు ద్వారా 4 వేల ఎకరాలు, 2 టీఎంసీల సామర్థ్యం గల బొగ్గులవాగు ద్వారా 29వేల ఎకరాలు, 1 టీఎంసీ సామర్థ్యం గల శనిగరం ప్రాజెక్టుల ద్వారా 19 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. అలాగే ఎల్లంపల్లి వద్ద నిర్మిస్తున్న శ్రీపాదసాగర్ ప్రాజెక్టు, ఎత్తిపోతల ద్వారా 2 లక్షల ఎకరాలు, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా 60 వేల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. రామగుండం బండలవాగు ప్రాజెక్టు, మంథని కన్నాల ప్రాజెక్టు, మల్హర్ మండలంలోని తీగలవాగు, మల్లాపూర్‌లోని గంగనాల ప్రాజెక్టు, ధర్మపురి మండలంలోని అక్కపెల్లి రిజర్వాయర్, జోలిచెరువు, వెల్గటూరు మండలం జంగల్‌నాలా, చెగ్గ్యాం ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాల్లో పంటలకు నీటిని అందిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లాలో సాగు, తాగు, విద్యుత్తు ప్రాజెక్టులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టే ప్రధాన వనరు. 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు కాలువల ద్వారా అందిస్తుంది. జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, సిద్ధిపేటపట్టణాలకు ఎస్సారెస్పీ నుంచి వచ్చే గోదావరి నీరే శరణ్యం దిగువ మానేరు 90.31 టి.ఎం.సి.ల నీటి సామర్థ్యం కలిగిన కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాం (జి.వి.సుధాకర్‌రావు లోయర్ మానేర్ డ్యాం) ద్వారా సాగు, తాగునీరు అందిస్తున్నారు. ఎన్టీపీసీకి 2 టి.ఎం.సి.ల నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేస్తుంది. ఇటీవలే శ్రీరాంసాగర్ నుంచి ఎల్.ఎం.డి.కి వరద కాలువ తవ్వారు. శ్రీపాదసాగర్ రామగుండం మండలంలో ఎల్లంపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు. 21 టి.ఎం.సి.ల సామర్థ్యం. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. రెండో ఫేజ్‌లో మరో 3 లక్షల ఎకరాల సాగునీటి కోసం నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఎత్తిపోతల పతకం ప్రాజెక్టు గోదావరినదిపై నిర్మిస్తున్నారు. 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు నడుస్తున్నాయి. రామగుండం మండలంలో బండలవాగు ప్రాజెక్టు, మంథని మండలంలో కన్నాల ప్రాజెక్టు, మల్హర్ మండలంలో బొగ్గులవాగు ప్రాజెక్టు, మల్లాపూర్‌లో గంగనాల ప్రాజెక్టు, కథలాపూర్‌లో రాళ్లవాగు, సారంగపూర్‌లో రోళ్లవాగు, గంభీరావుపేటలో ఎగువమానేరు, శనిగరం ప్రాజెక్టు, మల్హర్ మండలంలో బొగ్గులవాగు, తీగలవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. చిన్న తరహా ప్రాజెక్టులు రోళ్ల వాగు (సారంగాపూర్) సారంగాపూర్ మండలం బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టును 25ఏళ్ల కిత్రం నిర్మించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టల మధ్య అతితక్కువ పొడవున్న కట్టతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 19 అడుగులు. సారంగాపూర్, ధర్మపురి మండలాల్లోని 17 వేల ఆయకట్టుకు సాగునీరు, 9 గ్రామాలకు తాగునీరు అందించటం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగాఉంది. ప్రస్తుతం బీర్‌పూర్‌లోని ఫిల్టర్బెడ్ద్వారా నీటిని శుద్ధిచేసి ధర్మపురి, దోనూరు, దొంతాపూర్, నక్కలపేట, బీర్పూర్, నర్సింహులపల్లె, తుంగూరు తదితర గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం రెండు మండలాల్లోని 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టుకు పరీవాహక ప్రాంతం తక్కువగా ఉండటంతో వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టునీటిని రోళ్లవాగులోకి తరలిస్తారు. ఏళ్లక్రితం నిర్మించిన ప్రాజెక్టును ప్రస్తుతం రూ. 20 కోట్లతో ఆధునికీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు మంజూరుచేసి ప్రాజెక్టు ఆధునికీకరణ చేపడితే మరో 10 గ్రామాలతో పాటు 7 వేల ఆయకట్టుకు అదనంగా నీరందే అవకాశంఉంది. శనిగరం ప్రాజెక్టు (కోహెడ మండలం) జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శనిగరం ప్రాజెక్టును 1916 సం.లో నిజాం నవాబు పునర్మించారు. ఈ ప్రాజెక్టు కింద శనిగరం,తంగళ్లపల్లి,బెజ్జంకి,రేగులపల్లి,పోతారం(జె)దాచారం,ముత్తన్నపేట,గాగిళ్లాపూర్,గుగ్గిళ్ల తదితర గ్రామాల్లో 5100 ఎకరాల ఆయకట్టుంది. ప్రధాన, పంట కాల్వలు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ప్రాజెక్టు నిండినప్పటికీ గత పాతికేళ్లలో ఏనాడు చివరి ఆయకట్టుకు నీరందలేదు. రూ.9 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపినా మంజూరుకు నోచుకోలేదు. అక్కపెల్లి రిజర్వాయర్ (ధర్మపురి) ధర్మపురి సమీపంలోని అక్కపెల్లి రిజర్వాయిర్ నిర్మాణానికి రూ. 3 కోట్లు వెచ్చించినా ఎలాటి ఫలితం లేదు. కేవలం 300 ఎకరాలకు మాత్రమే నీరందిస్తోంది. ప్రధానంగా ఫీడింగు కాలువ నిర్మాణం చేపట్టాలి. దీంతో 2 వేల ఎకరాలకు సాగునీరందించే వీలుంటుంది. బోలిచెరువు: ధర్మపురి మండలంలోని ఈ రిజర్వాయర్‌కు 1980 ప్రాంతంలో మరమ్మతులు చేశారు. దీని కింద ఆయకట్టు సుమారుగా వెయ్యి ఎకరాలకు వరకు ఉంటుంది. చివరి భూములకు సాగు నీరందడం లేదు. ఆధునికీకరణ చేయాలి. జంగల్‌నాలా ప్రాజెక్టు ఆయకట్టు: 2800 ఎకరాలుప్రస్తుత పరిస్థితి: వెల్గటూరు మండంలంలోని ఈ ప్రాజెక్టు కాలువ లైనింగ్ కోసం నాబార్డు నుంచి మూడేళ్ల క్రితం రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొంది. చెగ్యాం ప్రాజెక్టు (వెల్గటూరు మండలం) ఆయకట్టు: రెవెన్యూ రికార్డుల ప్రకారం 800 ఎకరాలు, వాస్తవంగా సాగునీరందేది 2000 ఎకరాలు.ప్రస్తుత పరిస్థితి: ప్రాజెక్టులో పూడిక పెరిగిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. కాలువల లైనింగ్ చెడి పోయి పలు చోట్ల గండ్లు పడ్డాయి. నీరు అందించడానికి నైజాం కాలంలో నిర్మించిన ఆక్విడెక్టర్ శిథిలావస్థకు చేరుకుంది. యశ్వంతరావుపేట్ ప్రాజెక్టు (గొల్లపల్లి మండలం) ఆయకట్టు: 450 ఎకరాలుప్రస్తుత పరిస్థితి: ప్రాజెక్ట్‌లో పూడిక తీత, కాలువ లైనింగ్ కోసం నాబార్డు నుంచి గత ఐదేళ్ల క్రితం రూ.3.02 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అవసరం లేని చోట వంతెనలు నిర్మించి నిధులు వృథా చేశారు. కాల్వల లైనింగ్ పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి నెలకొంది. ఆధారము: ఈనాడు నదులు కరీంనగర్ జిల్లాతో గోదావరికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజల అన్నిరకాల నీటి అవసరాలకు ఈ నది నీరే ప్రధాన ఆధారం. నిజామాబాద్ జిల్లాలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అత్యధిక వినియోగం కరీంనగర్ జిల్లాకే ఉండగా జిల్లాలోని 11 మండలాలు, 79 గ్రామాలను ఆనుకుని 170 కి.మీ ప్రవహిస్తున్న గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోయటం, గ్రామాలకు తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు చేకూరుతున్నాయి. మంజీర, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, పెన్‌గంగ, ప్రాణహిత, సరస్వతి, ఇంద్రావతి నదులు గోదావరి నదికి ఈ ప్రాంతంలో ఉపనదులు. మానేరునది సిరిసిల్ల డివిజన్లో ప్రారంభం కాగా దీనిపై గంభీరావుపేట వద్ద ఎగువ మానేరు జలాశయం, కరీంనగర్వద్ద దిగువ మానేరు జలాశయాలను నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన ప్రాణహిత, స్థానిక సరస్వతి నదులు గోదావరిలో కలుస్తున్న కాళేశ్వరం ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి పరవళ్లు మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్‌లో పుట్టిన గోదావరి నది జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్ వద్ద జిల్లాలో మొదలవుతుంది. జిల్లాలో 79 గ్రామాల నుంచి 170 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. 11 మండలాల్లో 79 గ్రామాల గుండా ప్రవహిస్తున్న గోదావరి నది చివరగా మహాదేవపూర్ మండలం ముకునూరు గ్రామం వద్ద మరో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇబ్రహీంపట్నంలో 7, మల్లాపూర్‌లో 7, రాయికల్‌లో 2, సారంగపూర్‌లో 7, ధర్మపురిలో 9, వెల్గటూరులో 7, రామగుండంలో 10, మంథనిలో 7, కమాన్‌పూర్‌లో 4, కాటారంలో 2, మహదేవపూర్‌లో 17 గ్రామాల గుండా గోదావరినది ప్రవహిస్తుంది. ప్రాణహిత ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గోదావరి పాయ చీలిపోయి ప్రాణహిత ప్రాణం పోసుకుంటుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా కౌటాల, కాగజ్‌నగర్, చెన్నూరు మండలాల మీదుగా కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం చేరుకోని గోదావరినదిలో కలుస్తుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతి నదులు ఉండడంతో త్రివేణి సంగమం అంటారు. ప్రాణహిత జీవనది.అయితే దీనిపై ఆధారపడి పంటలేమీ లేవు. ఆధారము: ఈనాడు