సునాముఖి (సెన్నా) సాగు వివరములు (సెన్నా అలెక్సాండ్రియా) సాధారణ నామము : సెన్నా శాస్త్రీయ నామము : సెన్నా అలెక్సాండ్రియా కుటుంబము : ఫాబేసి ప్రాంతీయ నామము : సునాముఖి వాణిజ్య నామము : తిరునెల్ వేలి సెన్నా ఉపయోగపడు భాగములు : ఆకులు, లేత కాయలు పరిచయము సెన్నా అలెక్సాండ్రియా అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క ఫాబేసి కుటుంబానికి చెందినది. సునముఖి లేదా ఇండియన్ సేన్నగా పిలువబడే ఈ మొక్క అటవీ ప్రాంతల్లోనూ బంజరు భూముల్లోనూ సహజ సిద్దంగా కలువు మొక్కగా పెరుగుతుంది. సునాముఖి మొక్క ఏకవార్షిక గుల్మం. ఈ మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెర్గుతుంది. ఆకులు బల్లెం ఆకారంలో ఉండి చివరన మొనదేలి ఉంటాయి. ఆకులు నూగుతో కప్పబడి జిగురుగా ఉంటాయి. పుష్పాలు పసుపు రంగులో ఉండి అనేక గుత్తులుగా వస్తాయి. ఫలాలు ఒక్కొక్కటి 5 నుంచి 7 గింజలను కలిగి ఉంటాయి. విత్తనాలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వ్యాప్తి భారతదేశము, దక్షిణ అరేబియా, ఈజిప్ట్ , యెమన్ దేశాల్లో విస్తరించి ఉంది. భారతదేశంలో కర్నాటకలోనూ, బెంగళూరు, రాజస్తాన్ లో జోధ్ పూర్ , గుజరాత్ లోని అనంద్ ప్రాంతాలు , ఢిల్లీలోనూ, తమిళనాడు (తిన్నైవ్యాలి, మధురై, రామనాధపురం) ఆంద్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతలోను దీనిని సాగు చేయడం జరుగుతుంది. నేలలు ఎక్కువగా ఎర్రగరప నేలల్లో, రేగడి మరియు వరిసాగు చేసే బంక నేలల్లో కూడా సాగు చేస్తారు. ఉదజని సూచిక(pH) 7 నుంచి 8.5 వరకు ఉండవచ్చును. ఉష్ణోగ్రత 10 నుంచి 40 సెంటిగ్రేడ్ వర్షపాతము అతి వర్షపాత ప్రాంతాలు పనికిరావు. వెచ్చటి పోడిగావుండే వాతావరణం అనుకూలం. మిక్కిలి చలి వాతావరణం కూడా పనికిరాదు. దీనిని వర్షాధారంగా మరియు నీటి ఆధారం క్రింద సాగు చేయవచ్చును (విత్తన ఉత్పత్తికి). పంటకలము అక్టోబర్, నవంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. (150 నుండి 180 రోజులు). నీటిపారుదల ఉంటె ఏ కాలంలోనైన నటుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉంటే విత్తనం, మొక్కలు కుళ్ళిపోతాయి. కనుక వర్షపు ఉదృతి తగ్గిన తరువాత (ఖరీఫ్ లో ఆలస్యంగా) విత్తుకోవాలి. విత్తిన ఉత్పత్తికి జూలై, ఆగష్టు, ఫెబ్రవరి, మార్చి నెలలు అనుకూలం. విత్తన మోతాదు ఎకరాకు 5-6 కిలోలు. కిలో విత్తనమునుకు 2.5 నుండి 3.0 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి. విత్తే దూరం బోదెలు 35 నుండి 45 సెం.మీ. ఎడంగా చేసి బోదేలకు ఒకవైపు 30 సెం.మీ. దూరంలో విత్తాలి . విత్తే ముందు 6 నుండి 8 గంటలు విత్తనాలు నానబెట్టాలి. ఎరువులు హెక్టారుకు 15 నుంచి 25 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసుకోవాలి. మొక్కలు వచ్చిన తరువాత అధిక దిగుబడికోసం 50 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరము, 50 కిలోల పోటాష్ అవసరాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. నాటిన 90-95 రోజులకు మరియు 120-125 రోజులకు ఒకసారి 20 కిలోల చొప్పున నత్రజన హెక్టారుకు వేయాలి (అనగా మొదట మరియు రెండవ దఫా ఆకులు కోసిన తరువాత). అంతర కృషి తొలి దశలో 6-7 రోజులకొకసారి తేలిక పాటిగా నీరివ్వాలి. తరువాత దశలో 15-20 రోజులకొకసారి తెలిక పాటిగా నీరివ్వాలి. మడుల్లో కలుపు లేకుండా చూడాలి. సస్యరక్షణ నరుకుళ్ళు, నారుఎండు తెగులు, ఆకుపచ్చ, అకుఎండు మొదలగు తెగుళ్లు, చెదలు, గొంగళి పురుగులు మరియు కాయతోలచు పురుగులంటివి ఆశిస్తూ ఉంటాయి. నివారణకోసం 1) విత్తిన 70-80 రోజుల తరువాత 100 గ్రా. కార్టరిల్ 20 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి,. (కయతోలచు పురుగు నివారణ కోసం). 2) ఆకుపచ్చ తెగులు, అకుఎండు తెగులు నివారణ కోసం లీటరు నీటికి 1 గ్రా. కార్బండైజెమ్ కలిపి విత్తిన 70-80 రోజుల తరువాత పిచికారి చేయాలి. పంట సేకరణ విత్తిన 90 రోజులకు మొదటిసారి, తరువాత 40-45 రోజుల వ్యవధిలో కోత తీసుకోవాలి. కాయలు పట్టిన 15 రోజులకు (పసుపు రంగు) కోయాలి. కోసిన ఆకులు మరియు కాయలు 7-10 రోజులు నీడలో ఆరబెట్టాలి. దిగుబడి నీటిపారుదలు క్రింద హెక్టారుకు సుమారు 2000 కిలోల ఎండిన ఆకులు మరియు 750 కిలోల కాయల దిగుబడి వస్తుంది. గమనిక నేల స్వభావం, వాతావరణ పరిస్తితులు, మార్కేట్ సరళి ఆర్థికాంశాలను ప్రభావితం చేస్తాయి. ఉపయోగములు సునాముఖి ఆకులను విరోచనకారిగాను, మలబద్దకం, రక్తమొలల నివారణలోనూ, చర్మ వ్యాధుల్లోను, ఆయుర్వేద మందులలోనూ ఉపయోగిస్తారు. ఆధారం :తెలంగాణ రాష్ట ఔషధ మొక్కల బోర్డు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా, 6వ అంతస్థు, బిల్డింగ్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాదు – 500 001. ఫోవ్: +21 40 66364096, 24764096. website : ww.tsmpb.in E-mail:tsmapb@gmail.com