ఆర్థిక సహాయం పొందడానికి అరహతగల విభాగాల వివరణ మరియు సహాయం అంధించే పద్ధతులు: రుణ ఆధార కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ ప్రాజెక్టులు (వీటిలో వాతావరణ నియంత్రణ విభాగం, వాతావరణాన్ని మెరుగు పరిచే విభాగం, ప్రీకూలింగ్ యూనిట్లు, ఉల్లిపాయల నిల్వ కేంద్రాలు మొ||నవి మరియు వీటి ఆధునీకరించడం వంటివి కలిసి ఉన్నాయి) ఈ పథకం క్రింద సహాయం పొందడానికి అరహత కలిగి ఉన్నాయి. సహాయం అందించే పద్ధతులు రుణంతో ముడిపెట్టిన సబ్సిడీ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో (సాధారణ ప్రాంతాలలో) 40% ఇవ్వబడుతుంది. కొండ ప్రాంతాలలో, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ప్రాజెక్టులకైతే 55 శాతం వరకు ఇవ్వబడుతుంది. 5000 మె.ట.ల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన పథకం ఒక్కింటికి దిగువ సూచించిన i నుండి iv వరకు ఉండే పథకాలకు వర్తించును. కోల్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని సాధారణ షరతులు మొదటిరకం కోల్డ్ స్టోరేజీలలో ప్రీకూలింగ్ అవసరమైన ఉత్పత్తుల నిల్వ కోసం ఆర్ సి.సి.తో నిర్మించిన మెజనైన్ ఫ్లోరింగ్ ఉండాలి. ప్రీ కూలింగ్ అవసరం లేని ఉత్పత్తుల నిల్వకోసం చెక్కతో చేసిన నిర్మాణాలు చేయాలి. వీటి గధి ఉష్ణోగ్రత సున్న డిగ్రీల నుండి 16 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండాలి. ఫిన్ – ఆయిల్ కూలింగ్ విధానం ఉండాలి. గదిలో తేమను నియంత్రించ గలిగే ఏర్పాటు (సాధారణ పరిస్థితుల్లో ఆర్ హెచ్ 80% - 95% మధ్య ఉండొచ్చు. ఉల్లిపాయలకు వెల్లులిపాయల నిల్వకు ఆర్ హెచ్ 65%నుండి 70% మధ్య అలాగే విత్తనాల స్టోరేజీలు వంటి ప్రమాదాల నుండి కాపాడే భద్రతా ఏర్పాట్లు ఉండాలి. కనీసం రెండు గదులు ఉండాలి. నివాస యోగ్యంగా ఇన్సులేషన్ కు శీతలీకరణకు అనుగుణంగా, నిర్మించాలి. ఈ శీతలీకరణ వ్యయ ప్రమాణంమెట్రిక్ టన్నుకు రూ. 6,000/- లుగా ఉండాలి రెండోరకం కోల్డ్ స్టోరేజీ ఒకటి కంటే ఎక్కువ ఉద్యానవన ఉత్పత్తులను లేక వస్తువులను, నిల్వ చేయ డానికి వీలుగా, ఎక్కువ ఛాంబర్లు లేక గదులతో ప్రీ కూలింగ్ విధానం అవసరం లేకుండా నిర్మించాలి. (-2 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 16 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గది ఉష్ణోగ్రత ఉండాలి) (ఈ ఉష్ణోగ్రతలలో పళ్ళు కూరగాయలకు 80%నుండి90% మధ్య ఆర్ హెచ్ లేక తేమ నియంత్రణ విధానం ఉండాలి. అలాగే ఉల్లిపాయలకు, వెల్లుల్లికి 65% నుండీ 70% మధ్య తేమ ఉండాలి. ఆయా విత్తనాల నిల్వకు అనుకూలంగా ఉండాలి.) ఫిన్ –కాయిల్ కూలింగ్ విధానం మరియు అతి ఎక్కువ, అతి తక్కువ విద్యుత్ సరఫరా సందర్బాలకు అనుగుణంగా విద్యుత్ ఆదా చేసే విధానాలను నిర్మించాలి. ఆటోమెటిక్ గా ఉష్ణాన్ని తగ్గించుకోవాడం, పెంచుకోగలిగే విధానం, అలాగే కార్బన్ డై ఆక్సైడ్ నియంత్రణ విధానం ఏర్పాటు చేయాలి. సూక్ష్మజీవులను నియంత్రించ గలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. స్టోరేజీ కేంద్రాలలో దుమ్ము, ధూళిని తొలగించడానికి, వస్తువుల సర్దుబాటు, మార్పిడికి అవసరమైన యంత్రాలు, పరికరాల ఏర్పాటు ఉండాలి. ప్రమాద రక్షణ ఏర్పాట్లు, సంచులు, డబ్బాలు, క్రేట్స్ అందుబాటులో ఉండాలి. ఇంటి మాదిరి నిర్మాణం / రేడీమేడ్ మెటీరియల్ తో నిర్మించిన ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్సులేషన్ (వేడిని గ్రహించడం), చల్లబడడం (కూలింగ్)వంటి విధానాల ఏర్పాటు నిర్దేశిత ప్రమాదాల మేరకు ఉండాలి. ఈ వ్యయ ప్రమాణం ఒక మిలియన్ టన్నుకు రూ. 7,000/- లుగా ఉండాలి. మెజనైన్ ఫ్లోరింగ్ కు ఈ ప్రమాణం వర్తించదు. గృహనిర్మాణం/రేడీమేడ్ మెటీరియల్ తో నిర్మించిన ఇంజనీరింగ్ నిర్మాణం, వేడిని, చల్లదనాన్ని గదిలో గ్రహించే విధానాల ఏర్పాట్లు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాలి. (మెజనైన్ ఫ్లోరింగ్ స్టోరేజీ కేంద్రాలకు ఈ ప్రమాణాలు వర్తించవు) వ్యవసాయ లేక వ్యవసాయేతర వస్తువులకు ప్యాక్ హౌస్ సౌకర్యం (వాషింగ్ , డీ శాపింగ్ , ఆరబెట్టడం, విడదీయడం, గ్రేడింగ్ , కత్తిరించడం, ప్యాకింగ్ , మొదలైన మరియు ప్రీ కూలింగ్ సౌకర్యాలు) ఒక మి. టన్నుకు రూ.8,000/-లు. కోల్డ్ స్టోరేజీల ఆధునీకరణం వేడిని గ్రహించే థర్మల్ ఇన్సులేషన్ స్థాయిని పెంచుకోవడానికి. కూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకొనుటకు శీతలీకరణ ఏర్పాట్లు, గాలి సరఫరా, విధ్యుత్ సరఫరా పరికరాలు బిగించడం, సరుకు సర్దుబాటు సాధనాలు, భద్రతా పరికరాలు మొ||నవి. ఒక ప్రాజెక్టు వ్యయం గరిష్టం (i) రూ. 1000 మి.ట.కు (ii) రూ.2000 మి.ట.కు అంతకంటే ఎక్కువ. పూర్తిగా ఆధునీకరించడానికి (i) & (ii) రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. సి.ఎ.స్టోరేజీలు మి.ట.కు రూ. 32,000/- చొప్పున. ఆర్థిక సహాయంతో కొంత భాగం టర్మ్ లోను పద్ధతిలో రుణం బ్యాంకులు లేక ఇతర ఆర్థిక సంస్థల నుండి పొందవచ్చు. అయితే ఈ రుణ మొత్తం అనుమతించే సబ్సిడీ మొత్తం కనీసం 15శాతం అధికంగా ఉండాలి. కనీస సాంకేతిక ప్రమాణాలను అందకోగలిగిన ప్రాజెక్టులకు ఈ ప్రమాణాలను నిర్ధేశిత, అమలు నియమాల ప్రకారం ధృవీకరించుకొన్న తరువాతే ఈ పథకం క్రింద సవరించిన నియమాల ప్రకారం ఉన్న ప్రాజెక్టులు ఆర్థిక సహాయం పొందడానికి అరహత కలిగి ఉంటాయి. రాక్ లు, ప్లెట్లు మరియు యంత్రాలతో వినియోగానికి అనుగుణమైన పద్ధతిలో ఉన్న డిజైన్ లను మాత్రమే పైన ప్రాజెక్టులలో ఉపయోగించాలి. ప్రీకూలింగ్, ప్యాక్ హౌస్ లకు సంబంధించి సాంకేతికంగా సిఫారసు చేయబడిన భిన్నమైన విభాగాలు కాంబినేషన్స్ ఉన్న ప్రాజెక్టుల వ్యయ నియమాలను, బోర్డు నియమించిన కమిటీ నిర్ధేశిస్తుంది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్దేశించిన తాజాసాంకేతిక ప్రమాణాలను ప్రోటోకాల్ ను అను సరిస్తున్న లబ్దిదారులకే జాతీయ ఉద్యాన వన బోర్డ్ నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం