భారతదేశ కరువు వాస్తవాలు భారతదేశంలో, కరువుకు ముఖ్య కారణంగా నైరుతి రుతుపవనాల (జూన్- సెప్టెంబర్ ) వైఫల్యం అని చెప్పవచ్చు. దేశంలో 73% వర్షపాతం SW రుతుపవనాల సమయంలో కురవటంవల్ల కరువు ప్రభావిత ప్రాంతాలు వర్షంకోసం తదుపరి రుతుపవనాల వరకు వేచి ఉండవలసి వస్తుంది. కరువుకు సంబంధించి అందుబాటులో ఉన్న వర్షపాత వివరాలు - దేశం మొత్తంలో 16% భూభాగం కరువు పీడిత ప్రాంతం, ఏటా 50 మిలియన్ల ప్రజలు కరువు సంక్షోభానికి గురి అవుతారు. సుమారు 68% సాగు ప్రాతం వివిధ స్థాయిల్లో కరువుకు గరవుతుంది. 35% ప్రాంతంలో 750 మిల్లీమీటర్ల నుంచి 1125 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుంది. దీనిని కరువు పీడిత ప్రాంతంగా చెప్పవచ్చు. 429 మిలియను హెక్టారులలో శుష్క (19.6%), పాక్షిక-శుష్క (37%) మరియు ఉప-తేమ (21%) కనిగినని కరువు పీడిత ప్రాంతాలు. ఇవి మొత్తం దేశ భూభాగంలో 77.6% ఉంటాయి. వార్షిక సగటు వర్షపాతం భారతదేశంలో 1160 మిమీ. అయితే, 85% వర్షపాతం 100-120 రోజులలో (SW వర్షాకాలం) కేంద్రీకృతమై ఉంటుంది. 33% ప్రాంతంలో 750mm కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా కరువు పీడిత ప్రాంతం. 21% ప్రాంతంలో 750mm కంటే తక్కువ వర్షపాతం (పెనిన్సులర్ ప్రాంతం మరియు రాజస్థాన్ ) ఉంటుంది. వర్షపాతం 10 లో 4 సంవత్సరాలు అస్థిరంగా ఉంటుంది. నీటిపారుదల సంభావ్యత 140 మిలియన్ హెక్టార్లు (76 మిలియన్ హెక్టార్లు ఉపరితల + 64 మిలియన్ హెక్టార్లు భూగర్భజలం). గ్రౌండ్ వాటర్ క్షీణత మరియు ఉపరితల నీటి పరిమితి ఉన్నప్పుడు పైన చూపిన మొత్తం ప్రాంతంలో నాట్లు వేయడానికి వీలుకాదు అని తెలుస్తోంది. పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పంట తీవ్రత మరియు భూగర్భ జలాల తగ్గుదల వలన తలసరి నీటి లభ్యత క్రమంగా తగ్గుతుంది. దీనివలన సమస్యలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తనికి - ఒక ప్రాంతంలో కాకపోతే ఇంకో ప్రాంతంలో కరువు అనివార్యం. రాబోవు కరువును నిర్ధారించటం ఇప్పటి వరకు పొందిన అనుభవం ఆధారంగా, రాబోయే కరువులకు సంబంధించిన కొన్ని హెచ్చరిక సంకేతాలను మన వ్యవసాయ చక్రం యొక్క వివిధ దశల్లో గుర్తించారు. అవి: ఖరీఫ్ కోసం (జూన్ నుండి ఆగష్టు వరకు) నైరుతి రుతుపవనాల ఆలస్యం. నైరుతి ఋతుపవనాల యొక్క కదలికలలో పెద్ద అంతరం. జూలై నెలలో తక్కువ వర్షాలు. పశుగ్రాసం ధర పెరగడం. రిజర్వాయర్లలో నీటి స్థాయిలలో పెరుగుదల ధోరణి లేకపోవడం గ్రామీణ మంచినీటి సరఫరాకు ఉపయోగపడే వనరులు ఎండిపోవటం. "సాధారణ సంవత్సరాలు"తో పోలిస్తే వారాలు గడిచే కొద్ది విత్తనాల నాటడంలో తగ్గుదల ధోరణి ఉండటం. రబీ కోసం (నవంబర్ నుండి జనవరి వరకు) దక్షిన-పశ్చిమ వర్షాకాలం (30 సెప్టెంబర్) ముగింపులో తగ్గుదల. "సాధారణ సంవత్సరాలు"తో పోలిస్తే భూగర్భజల స్థాయిలలో చాలా క్షీణత . "సాధారణ సంవత్సరాలు" తో పోల్చితే జలాశయాల మట్టం తక్కువగా ఉంటే దక్షిన-పశ్చిమ వర్షాకాలంలో తక్కువ రీచార్జీ ఉంటుందని సూచిస్తుంది. చెప్పుకోదగ్గ నేల తేమ ఒత్తిడి సూచన. పశుగ్రాసం ధరలో పెరుగుదల. ట్యాంకర్ల ద్వారా నీటి వితరణ పెరుగుతుంది. ( తమిళనాడు & పుదుచ్చేరీలకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలలో కీలకమైన కాలం) ఇతర కారణాలు: గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాలకు మార్చి/ఏప్రిల్ మాసాలు కీలకమైనవి. దీర్ఘకాలిక జలసంబంధ కరువు వలన, అనేక ప్రాంతాల్లో తాగు నీటి కొరత తీవ్రంగా పెరుగుతుంది. నిర్దిష్ట రాష్ట్రాలకు మరియు ప్రత్యేక పంటలకు వర్షాల పురోగతి చాలా ముఖ్యం. ఉదాహరణకు, కేరళలో ఫిబ్రవరి వర్షాలు తోట పంటలకు చాలా ముఖ్యం. మూలం: వ్యవసాయ శాఖ, సహకార మరియు రైతులు సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం.