మలబారు వేప శాస్త్రీయ నామం మిలియ దూబియ. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పాలిట కల్పవృక్షం. తక్కువ పెట్టుబడి, కూలీలు ఎక్కువ అవసరం లేనిది. ఇది దాదాపు 25-30 అడుగుల ఎత్తువరకు నిటారుగా పెరుగుతుంది. దీని చుట్టుకొలత 3-4 అడుగులు ఉంటుంది. మలబారు వేప బహుళ ప్రయోజనకారి. చెట్టులోని ప్రతి భాగం విలువైనది. కలప ప్లైవుడ్ కు, బిల్డింగ్ మెటీరియల్, బయోమాస్ కర్ర బొగ్గు పంట చెరకు, ఇంటీరియర్ డెకరోషన్ కు, ఫ్లోరింగ్ సీలింగ్, ప్యాకింగ్ మొదలైన వాటికి ఉపయోగించి అధిక ఆదాయం పొందవచ్చు. భూమి తయారు ఎండాకాలం, లోతు దుక్కి దున్ని చదును చేయాలి. నాటే సమయం జూన్-జులై వర్షాకాలంలో నాటవచ్చు. నీటి వసతి గల ప్రాంతంలో జూన్ నుండి మార్చి వరకు ఎప్పుడైనా నాటవచ్చు. మెక్కలు ఒక అడుగు ఎత్తు ఉండాలి. అదే వర్షాధారంగా కింద అయితే 1.5 అడుగులు ఎత్తు ఉండాలి. గుంతలు 1.5 x 1.5 x 1.5 పొడవు, వెడల్పు లోతు పసువుల ఎరువు 5 కిలోలు, వర్మీకంరోస్టు 2 కిలోలు, సూపర్ ఫాస్ఫేట్ 1 కిలో అన్ని కలిపి గుంతలు నింపుకోవాలి. మొక్కల సంఖ్య 10 x10 ఆడుగుల దూరంలో 460 మొక్కలు ఎకరాకు వస్తాయి. నీటి తడులు ప్రతి నెలకొకసారి నీరు కట్టాలి. అంతర పంటలు మొదటి 3-4 సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. నాణ్యమైన మొక్కలు (విత్తనాల ద్వారా వచ్చినవి). క్లోన్ (శాఖీయ పద్ధతి ద్వారా) తమిళనాడు రాష్ట్రంలోని గుర్తించబడిన నర్సరీల నుండి తెచ్చుకోవచ్చు. ఒక్క మొక్క సుమారు రూ.6-7 అదే క్లోన్ రూ. 10-12 కి అమ్ముతారు. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక