ఈ చెట్లు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిష రాష్ట్రాలలో విరివిగా కనబడుతాయి. విప్ప చెట్లను, కలప కంటే పూలు, పండ్లు మరియు నూనె గురించి సాగు చేస్తారు. విప్ప పూల నుండి మరియు కలప గుజ్జు నుండి సార తయారుచేస్తారు. పూలను మరియు వినిగర్, జామ్స్ మరియు జేల్లిస్ తయారీలో వినియోగిస్తారు. పూలను మరియు కలప గుజ్జు నుండి సారా తయారుచేస్తారు. గింజలలో నూనె 20-30 శాతం వరకు ఉంటుంది. ఈ నునేను సబ్బులు, గ్రిసులు, కాండిల్స్ మందుల తయారీలో ఉపయోగిస్తారు. నేలలు అన్ని రకాల నేలల్లో పెంచవచ్చును. తేలిక పాటి ఇసుకు నెలల్లో మరియు సారవంతమైన లోతు తక్కువ నెలల్లోను పెంచవచ్చును. పంట కాలం జూలై ఆగష్టు. మొక్కల దూరం 9-10 మీ. x 8 మీ. మొక్కల సాంద్రత (ఎకరాకు) 45 x 45 x 45 సెం. మీ. పరిమాణంలో గుంతలను త్రావ్వుకోవాలి. ఒక సంవత్సరం వయస్సు గల మొక్కలను నాటుకోవాలి. అంతర పంటలు మొదటి 3-4 సంవత్సరాల వరకు పెసర, మినుములు, ఉలవలు, అలసందలు అంతర పంటలుగా వేసుకొని కొంత ఆదాయాన్ని పొడవచ్చు. ఎరువుల యాజమాన్యం సేంద్రీయ ఎరవులను వేయడం శ్రేష్టం. కలుపు యాజమాన్యం ప్రారంభ దశలో మొక్క పెరిగేటప్పుడు కలుపు మొక్కలను నివారించాలి. మొదటి సంవత్సరంలో మొక్కల మధ్య 2 సార్లు దున్నాలి. అలాగే మొక్క చుట్టూ కలుపు తీయాలి. దీని వలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దిగుబడి విప్ప చెట్లను 10 x 10 మీ. ఎడంలో వేసుకొని మధ్యలో 2.5 x 2.5 మీ. ఎడంలో నీలగిరి చెట్లను నాటినచో మంచి ఆదాయం వస్తుంది. సుమారు 10 సంవత్సరాల చెట్టుకు 15-20 కిలోల విత్తనాలు వస్తాయి. విత్తనాల్లో 50% నూనె ఉంటుంది. కలప పంటల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్, ఆగ్రోఫారెస్ట్రీ విభాగము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500030. ఫోన్ : 040-24010116