కనుగను వంట చెఱకుగా ఉపయోగించవచ్చు. కిలో వంట చెఱకు నుండి 4,600 కిలో కాలరీల శక్తి ఉత్పత్తి అవుతుంది. దీని కలప గట్టితనాన్ని కలిగి వుండటం వలన బండి చక్రాలు మరియు ఫర్నిచర్ తయారికి ఉపయోగపడుతుంది. ఆకులను పచ్చిరొట్టగా వేసుకోవచ్చును. నీటి ఎద్దడి ప్రాంతాల్లో దీని పచ్చికాయలను పశువుల మేతగా వాడుకోవచ్చు. గింజలలో 30-40 శాతం నూనె ఉంటుంది. దీని నూనెను సబ్బులు, వార్నిష్ తయారీల్లో జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చు. దీపాలను వెలిగించడానికి, ఇంజనులలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. చెక్కను కోళ్ళ దాణాలో కలోపి వాడవచ్చు. నేలలు ఇసుక, నల్లరేగడి, చౌడు, క్షార భూముల్లో కూడా పెరగుతుంది. లోతు తక్కువ ఉన్న భూములు అనువైనవి. విత్తే పద్ధతి విత్తనాలు లేదా కాండపు ముక్కలు మరియూ పిలకల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. అంటుకట్టడం ద్వారా కూడా ప్రవర్ధన చేయవచ్చును. విత్తన మోతాదు (ఎకరాకు) జూలై నుండి ఆగష్టు వరకు అనుకూలం 160 – 200 మొక్కలు అవసరం. గుంతలు గుంతలను 30 x 30 x 45 సెం. మీ. సెం. మీ. పరిమాణం లో త్రవ్వుకోవాలి. విత్తే దూరం 5 x 4 మీ. లేదా 5 x 5 మీ. ఎడంలో నాటాలి. మొక్కల సాంద్రత (ఎకరాకు) ఎకరానికి 160 – 200 మొక్కలు నటుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం సేంద్రీయ ఎరువులు పశువుల ఎరువు/వర్మికంపోస్ట్ గుంటకు 4 కిలోలు వేయాలి. నాటిన 2 సంవత్సరాల్లో 100గ్రా. డి.ఎ.పి సరిపోతుంది. 3వ సంవత్సరం నుండి 200-250 గ్రా. డి.ఎ.సి వేస్తె చెట్టు త్వరగా వృద్ధి అవుతుంది. కలుపు యాజమాన్యం ప్రారంభ దశలో మొక్క పెరిగేటప్పుడు కలుపు మొక్కలను తీసివేయాలి. సంవత్సరంలో రెండు సార్లు లోతుగా మొక్కల మధ్య దున్నాలి. దీని వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. లేత మొక్కలకు అవసరాన్ని బట్టి వెదురు బొంగులతో ఊతమివ్వాలి. మొక్కల ప్రక్క కొమ్మలను తగిన రీతిలో కత్తిరించాలి. పంట దిగుబడి చెట్లకు 6-7 సంవత్సరాలకు కాయలు కాయడం మొదలైనప్పటికి 10 వ సంవత్సరానికి స్ధిరమైన దిగుబడి వస్తుంది. కాయలు రాలిన తర్వాత ఏరడం చేయాలి. సంవత్సరానికి 6 టన్నుల గింజల దిగుబడి వస్తుంది. ఇలా చెట్లు 70 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి. నూనె దిగుబడి గింజల్లో 26-30 శాతం నూనె ఉంటుది. ఎకరానికి 600-700 కిలోల నూనె వస్తుంది. వర్షాధారంగా ఎకరానికి ఖర్చు రూ. 16,000, ఆదాయం రూ. 16 నుండి 20 వేల లభిస్తుంది (కనీస మద్దతు ధర టన్నుకు 10,000 రూపాయలు ఉన్న ఎడల). ఆధారం: వ్యవసాయ పంచాంగం