సొర, బీర, కాకర, గుమ్మడి, దోస ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు): పెండిమిధాలిన్ 30% ఇసి లేదా అలాక్లోర్ 50% ఇసి అనే మందును 1 – 1.25 లీ. విత్తిన రెండు రోజులలోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి 400 మి.లీ. (లేదా) క్విజాలోపాఫ్ 10% ఇసి 150-175 మి.లీ. (లేదా) ప్రోపిక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు) క్యారెట్ ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు): పెండిమిధాలిన్ 30% ఇసి లేదా అలాక్లోర్ 50% ఇసి ఎకరాకు లీటరు మందును విత్తిన 24-48 గం. లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్యన ఒకసారి అంతరకృషి చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): మెట్రిబ్యూజిన్ 70% జబ్ల్యూపి అనే మందును 300 గ్రా. ఎకరాకు విత్తిన 15-20 రోజులకు పిచికారి వేసుకోవాలి. ముల్లంగి ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : అలాక్లోర్ 50% ఇ.సి. 1 – 1.25 లీ. విత్తిన రెండు రోజులలపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవలెను. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి 150-175 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు) ఉల్లి / వెల్లుల్లి ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : ఆక్సిఫ్లోప్ఫెన్ 23.5% ఇసి, 250-300 మి.లీ. ఎకరాకు (లేదా) పెండిమిధాలిన్ 30% ఇసి (లేదా) అలాక్లోర్ 50% ఇసి 1 – 1.25 లీ. ఎకరాకు నాటిన పెండు రొజుల లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాస్ ఇధైల్ 50% ఇసి 400 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15-20 రోజులలోపు పిచికారి చేయడం వల్ల గడ్డిజాతి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. టమాట ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు): పెండిమిథాలిన్ 30% ఇ.సి. (లేదా) అలాక్లోర్ 50% ఇ.సి. ఎకరాకు ఒక లీ. మందును విత్తిన / నాటిన రెండు రోజులలోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): మెట్రిబ్యూజిన్ 70% జబ్ల్యూ.పి అనే మందును 300 గ్రా./ఎకరానికి (లేదా) క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇ.సి. 400 మి.లీ. లేదా ప్రోపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250 మి.లీ. 200 లీ. నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15-20 రోజులలో పిచికారి చేయడం వల్ల గడ్డి జాతి కలుపును నివారించవచ్చు. పొగాకు మల్లెను నియంత్రించడానికి 80 కిలోల వేపపిండిని దుక్కిలో వేసుకొని టమాట నారు నాటుకున్న 3 రోజుల తరువాత పెండిమిధాలిన్ 30% ఇసి, ఒక లీటరు (లేదా) మెట్రిబ్యూజిన్ 70% డబ్ల్యూ.పి 300 గ్రా. ఒక ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే మల్లె తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. బెండ ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : పెండిమిధాలిన్ 30% ఇసి, విత్తిన రెండు రోజులలోపు ఎకరాకు 1.25 లీ. తేమ గల నేలపై పిచికారి చేయవలెను. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి, 150-170 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డి జాతి కలుపు నివారణకు). క్యాబేజి ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : పెండిమిధాలిన్ 30% ఇసి, ఎకరాకు 1 – 1.25 లీ. (లేదా) ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5 ఇసి, ఎకరాకు 200 మి.లీ. నాటే రెండు రోజుల ముందు పిచికారి చేయవలెను. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాస్ ఇధైల్ 5% సి, 400 మి.లీ. (లేదా) క్వినాలోఫాప్ 10% ఇసి 150 – 175 మి.లీ. (లేదా) ప్రోపాక్విజాఫాప్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు). కాలీఫ్లవర్ ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5% ఇసి, అనే కలుపు మందును నాటుటకు 1-2 రోజుల మందు ఎకరాకు 200 మి.లీ. కలిపి పిచికారి చేయవలెను, (లేదా) పెండిమిథాలిన్ 30% ఇసి, ఎకరాకు 1.2 లీ. పిచికారి చేయాలి. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోపాఫ్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోపాళఫ్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రోరాక్సిజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు). బీట్రూట్ ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : అలాత్లోర్ 50% ఇసి, ఒక ఎకరాకు 800 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన రెండు రోజుల లోపు పిచికారి చేసి 20 రోజుల తత్వాత అంతరకృషి తేసినట్లయితే సరిపోతుంది. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాప్ 10% ఇసి 150 – 175 మి.లీ. (లేదా) ప్రొరాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు). ఆలుగడ్డ ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : మెట్రిబ్యూజిన్ 70% డబ్య్లూ.పి 400 గ్రా. నాటిన 1-6 రోజుల మధ్య పిచికారి చేయవలెను. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాప్ ఇధైల్ 5% సి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు). ధనియాలు, మెంతులు ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) : పెండిమిథాలీన్ 30% ఇ.సి. అనే కలుపు మందును ఎకరాకు 1 లీ. విత్తిన వెంటనే (24 గం. ) లోపల పిచికారి చేయవలెను. పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత): క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాప్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రోపాక్విజాపాఫ్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు). వాము పెండిమిథాలిన్ 30% ఇసి, ఒకలీటరు లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5% ఇసి. 200 మి.లీ. పంట విత్తిన రెండు రోజులలోపు ఎకరా పొలంలో సమానంగా పిచికారి చేయాలి. తర్వాత 20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే కూలీలతో ఏరి వేయించాలి. (లేదా) క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇ.సి. 400 మి.లీ. ఒక ఎకరాకు పిచికారి చేయాలి. ఆస్టర్ పూల పంట పెండిమిథాలిన్ 30% ఇసి, ఒక లీటరు (లేదా) అలాక్లోర్ 50% ఇసి, 600 మి.లీ. ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పంట విత్తిన రెండు రోజుల లోపు పిచికారి చేసుకోవాలి. తర్వాత 20 రోజులకు అంతరకృషి (లేదా) చేతితో కలుపు తీసివేయాలి. పండ్లతోటలు (మామిడి, జామ, దానిమ్మ, నిమ్మ, సపోటా, రేగు) అట్రజిన్ 50% డబ్ల్యూ.పి. అనే పొడి మందును 4 – 6 గ్రా. లీటరు నీటికి కలిపి (లేదా) గ్లైఫోసేట్ 71% ఎస్.జి. 5 – 6 గ్రా. లీటరు నీటికి (లేదా) పారాక్వాట్ 24% ఎస్.ఎల్. లీటరు నీటికి 5 – 6 మి.లీ. చొప్పున కలిపి పండ్ల మొక్కలపై పడకుండా చెట్ల వరుసల మధ్య లేత దశలో ఉన్న కలుపు మొక్కలపై పిచికారి చేయాలి. ఉద్యాన పంటలలో కలుపు నివారణపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ: ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి) & హెడ్, కలుపు మొక్కల నిర్మూలన పరిశోధన పధకం డైమండ్ జూబ్లీ బ్లాక్, రాజేంద్రనగర్, హైద్రాబాద్, ఫోన్ నెం. 040-24017205, 24015011, ఎక్స్టెంషన్: 367