రాష్ట్రంలో వ్యాపార సరళిలో పండించే పూలలో 'గులాబీ' తరువాతి స్ధానం 'చామంతి' దే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడిపూలుగా, దండాలు కట్టాటకు, కట్ ప్లేవర్ గా చామంతికి చలికాలం మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చామంతులను తప్పని సరిగా వాడుతారు. వాతావరణం : చామంతి శీతాకాలంలో పుష్పిముచే మొక్క అంటే పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే త్వరగా పూతకు వస్తాయి. పగలు ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉండే శాఖీయంగా పెరుగుతాయి. ఈ పూలను పండుగల సమయంలో ఎక్కువగా వినియెగిస్తారు. ఆ డిమాండ్ ను అందుకోవాలనుకుంటే, కనీసం 100 రోజుల ముందు చామంతిని నాటుకొని శాస్త్రీయంగా పెంచుకోవాలి. తోట యాజమాన్యం : డ్రిప్ ద్వారా నీరు ఇస్తే కలుపు బెడద తక్కువగా ఉంటుంది. 1-2 సార్లు మొక్క దగ్గర మట్టిని కదిలిసై వేరు వ్యవస్ధ బాగా వృద్ధి చెందుతుంది. మొక్క దగ్గర నీరు నిల్వకుండా చూడాలి, లేకుంటే వేరు కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎరువులు: ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల బసవరం, 60-80 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొక్కలను మొదటి 30 రోజులు బాగా ఏపుగా పెరిగేటట్టు చూడాలి. 20 రోజులకొకసారి సుష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేసినటైతే ముక్కలన్నీ ఆరోగ్యంగా పెరుగుతాయి. తలలు తుంచటం (పించింగ్) : పొలంలోని మొక్కలన్నీ సుమారు 30 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత (అనగా నాటిన సుమారు '4' వారాలకు) మొక్కల తాళాలను తుంచాలి. ఈ విధంగా చేయటం వలన పక్కకొమ్మలు ఎక్కువగా వస్తాయి, తద్వారా పులా దిగుబడి పెరుగుతుంది. తలలు తుంచి తర్వాత నత్రజని మరియు పోటాష్ లను ఇచ్చే ఎరువులను చామంతి మొక్కలకు అందించటం ద్వారా నాణ్యమైన పులా దిగుబడిని పెంచవచ్చు. పూలు మంచి పరిమాణంలో పొందుటకు, రైతులు పైపాటు ఎరువులు వేసిన తరువాత, ప్రతి 15 రోజులకొకసారి సుష్మధాతు మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీతూకి కలిపి పిచికారీ చేయాలి. ఉత్తమవ్వటం : మొక్కలు పూలు పుచినప్పుడు తల బరువుతో క్రైండికి వాలకుండా కర్రలు పతి ఊతమివ్వాలి. తద్వారా పులా నాణ్యతను కావడవచ్చు. హర్మిన్ల వాడకం పూల కాదా పొడవుగా, దురదగా పెరుగుటకు, పువ్వు సైజ్ పెరుగుటకు తలలు కత్తిరించిన 20-25 రోజులకు 50 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం 50 మీ.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 100 పి.పి.యం. నప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం 100 మీ. గ్రా. లీటరు నీటికి కలిపి మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చును. 100-150 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారీ చేస్తే 15-20 రోజులు ముందుగా ఫుల్లు కోటకొస్తాయి. విడిపూల పరిమాణం పెరుగుటకు, మంచి రంగు సంతరించుకొనుటకు, మొక్కలు మొగ్గదశకు వచ్చే ముందు లేదా చిరు మొగ్గ వచ్చే దశలో పొటాషియం నైట్రేట్ 2.5 గ్రా.లీటరు నీటికి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే మంచి ప్రయెజనం ఉంటుంది. సస్యరక్షణ పచ్చపురుగు : ఈ గొంగళి పురుగులు ఆకులను మరియు పువ్వులను తిని నష్టపరుస్తాయి. నివారణకు క్లొరంత్రనిలిపారోల్ 0.3 మీ.లి. లేదా ధాయేదికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు : ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి వేయడం వలన ముడతలు పడి ఎండిపోతాయి. పూలు రంగు మారిపోతాయి, పూలు వాడిపోయి రాలిపోతాయి. వీటి నివారణకు డైమిదోయేట్ లేదా పిప్రానిల్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ళు ఆకుమచ్చు: నల్లటి లోత్తెన గుండ్రటి మచ్చలు ఆకులూ పై ఏర్పడటం వలన ఆకులు ఎండి వదలిపోతాయి. నివారణకు కార్బండజిమ్ + మ్యంకోజెబ్ మిశ్రమ మందును 2.5 గ్రా. లేదా క్లోరోధలోనిల్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు తెగులు : వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మొక్కలు అకస్మాత్తుగా వదలిపోతాయి. ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. నివారణకు మురుగు నీరు నిల్వకుండా ఏర్పాటు చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.లు (లేదు) మెతలాక్సిల్ యం జెడ్ 2 గ్రా. లీటరు నీటికి కిలిపి చెట్టు మెడలు తడిచేవిధంగా పోయాలి. పులకోత : నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూలు కోతకు వస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10-15 సార్లు పూలు కోయవచ్చు. చామంతి రకాన్ని బట్టి 90-120 రోజులలో పూలు కోతకు రావటం జరుగుతుంది. పూలు, పూరెక్కల బాగా వికసించిన తర్వాత చిన్న కథతో విడిపూలను కోయాలి. అదే కట్ ప్లేవర్ గానైతే పొసవతి కథతో పూలను కోసి, వెంటనే బకెట్ లో ఉన్న నీటిలో ఉంచాలి. విడిపూలను ఉలిపాయ శంభులలో మార్కెట్ కు తరలించాలి. రైతులు పాటించే పద్దతులను బట్టి ఎకరాకు 8-10 టన్నుల పూల దిగుబడిని పొందవచ్చు. ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం