ప్రస్తుతం ఎక్కువగా వన్నమయి రొయ్యల పెంపకం చేస్తున్నారు. వన్నమయి రొయ్యలను విదేశాల నుంచి వ్యాధి నిరోధకత కలిగినవి తల్లి రొయ్యలను దిగుమతి చేసికొని , అన్నీ పరీక్షలు నిర్వహించి హేచరీలుకు సరఫరా చెయ్యటం జరుగుతుంధి , కావున వన్నమయి రొయ్య పిల్లలను దృవీకరించిన హేచరీలనుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. వన్నమయి రొయ్యలకు ఏ విధమైన వ్యాధులు రావని అపోహ పడుతుంటారు కాని ఈ రొయ్యలను కూడా చెరువు తయారీ నుంచే జాగ్రత్తగా పెంచాలి లేని యెడల నష్టాలబారిన పడతారు. వన్నమయి రొయ్యలను సలైనిటీ 0 నుంచి 50 పి.పి.టి కలిగిన నీతిలోను పెంచవచ్చు మరియు అధిక సాంద్రతలోనూ పెంచవచ్చు టైగర్ రొయ్యల కంటే వన్నమయి రొయ్యల "ప్రోటీస్" ఆవశ్యత తక్కువ అనగా తక్కువ ప్రోటీస్ (30 - 35%) కలిగిన పెల్లెట్ మేతలు సరిపోతాయి. మన ప్రాంతములో వన్నమయి రొయ్యలను ఎక్కువగా తక్కువ ఉప్పదనము కలిగిన నీటిలో పెంపకం జరుగుతుంధి. కావున వన్నమయి పెంపకంలో కొన్ని ముఖ్యమైన సూచనలు : హేచరీలనుంచి రొయ్య పిల్లలను సేకరించినప్పుడు చెరువునీటిని ఉప్పదనంలో సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. చెరువు అడుగు భాగాన్ని పరిశీలించి , సున్నము , బ్లీచింగ్ పౌడర్ వంటివి వాడి పూర్తిగా ఎండబెట్టిన తరువాత నీటిని నింపుకుని తయారు చేసుకోవాలి. చెరువు చుట్టూ వల పెన్సింగ్ మరియు చెరువు పైన పకులు రాకుండా వాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక చిన్న చెరువును రిజర్వాయిర్ ట్యాంకుగా చేసుకుని అందులో ముందు నీటిని తోడుకొని బ్లీచింగ్ పౌడర్ లో (30-50 పి.పి.యం. ) శుభ్రపరచి తరువాత చెరువులోనికి తోడుకోవాలి. పెంపక కాలమంతా చెరువు నీటిని ఉప్పదనము (సెలైనిటీ) ఒకే విధంగా ఉండేటట్లు యాజమాన్యం చెయ్యాలి. ఏ సమయంలోనైనా సెలైనిటీలో తేడా 3 పి.పి.టి కి మించరాధు. చెరువులోతు 6' అడుగుల వరకు ఉంటే మంచిది. రొయ్య పిల్లల సంఖ్యను మరి ఎక్కువగా కాకుండా ఎకరానికి 1 లక్ష నుంచి 1 .50,000 వరకు వేసుకుంటే మంచిది చెరువు సామర్థ్యాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. చెక్ ట్రే ల సహాయంతో మేత యాజమాన్యం పాటించాలి. నీటి గుణాలను తరచూ పరీక్షించి వెంటనే సరియైన యాజమాన్యం చెయ్యాలి. పి.హెచ్. 7.7 - 8.1 ఆక్సీజన్ :4 పి.పి.యం కన్నా ఎక్కువ ఆల్కలనిటీ : 1OO - 2OO పి.పి.యం హార్టనెస్ : 1OOO పి.పి.యం కంటే ఎక్కువ అమ్మోనియా : O.1 పి.పి.యం కన్నా తక్కువ కాల్లియం : మెగ్నీషియం 1:2 - 1:3 మెగ్నీషియం : కనీసం 350 పి.పి.యం ఉండాలి. చెరువులో రొయ్య పిల్లల సాంద్రతను బట్టి సుమారు 400 కిలోల రొయ్య బరువుకు 1 హెచ్.పి ఏరియెటేర్ తప్పని సరిగా అమర్చాలి. తక్కువ ఉప్పదనం నీటిలో పెంపకం సాగిస్తున్నప్పుడు ప్రతి 15 రోజులకొకసారి ఎకరానికి 20 కె.జి ల పొటాష్ , 20 కె.జి ల సాదారణ ఉప్పు , 10 కె.జి.ల మెగ్నీషియం సల్పేట్ 10 కె.జి ల మినరల్ మిక్చర్ వాడటం ఉపయోగకరంగా ఉంటుంధి. చెరువు నీటిలో వాడే ప్రోబయోటిక్ ని మరియు మేతలో వాడే ప్రోబయోటిక్ ని పేరున్న కంపెనీవి ఎంపిక చేసుకొని క్రమంగా వాడటం మంచిది. ప్రతి 15 రోజులకు రొయ్యల సేంప్లింగ్ చేసి వాటిని ఆరోగ్యాన్ని గమనించి అనుమానం ఉన్నట్లయితే నిపుణల సలహా తీసుకోవాలి. రచన : ఎ. శ్రీనివాస్, మత్య శాస్త్రవేత్త , కె.వి.కె, ఉండి