నేలలు తేలిక నుండి మధ్య రకం నేలలు. నీరు ఇంకే, మురుగు నీటి పారుదల గల నేలలు అనుకూలం. విత్తే సమయం ఖరీఫ్ జూన్ – జూలై, వేసవి: జనవరి. రకాలు రకం ఋతువు పంటకాలం (రోజులు) దిగుబడి (క్వి.హెక్టారుకు) గుణగణాలు డబ్ల్యూ.సి.సి.75 ఖరీఫ్, వేసవి 85 – 90 20-25 పైరు 180 సె0.మీ. ఎత్తు ఎదిగి కుదురుకు 2 – 3 పిలకలు వేస్తుంది. ఐ.సి.ఎమ్.హెచ్ 451 ఖరీఫ్, వేసవి 85 – 90 25-85 సంకర రకం, 125 సెం.మీ. ఎత్తు ఎదిగి, 2 – 3 పిలకలు వేస్తుంది. వెర్రి కంకి తెగులును తట్టుకుంటుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలం. మల్లికార్జున ఖరీఫ్, రబీ 80 – 85 20-85 వర్షాభావ పరిస్థితులకు తట్టుకుంటుంది. సజ్జ సాగు చేసే అన్ని ప్రాంతాలకు అనుకూలం ఐ.సి.టి.పి. -8203 ఖరీఫ్, వేసవి 80 – 85 20-85 గింజలు లావుగా, తెల్లగా ఉంటాయి. వెర్రి కంకి తెగులును, బెట్టును తట్టుకుంటుంది. ఐ.సి.ఎమ్.వి - 221 ఖరీఫ్, వేసవి 85 – 85 20-85 వెర్రి కంకిని తట్టుకోగల కాంపోజిట్ రకం, అన్ని ప్రాంతాలకు అనుకూలం ఎ.పి.ఎస్.1 (అన0త్) ఖరీఫ్, 80 – 85 20-25 వెర్రి కంకిని తట్టుకుంటుంది. తక్కువ వర్షాపాతంలో కూడా మంచి దిగుబడి నిస్తుంది విత్తనం – విత్తే పద్ధతి హెక్టారుకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. 2 శాతం ఉప్పునీటి ద్రావణంలో విత్తనాలను ఉంచడం ద్వారా ఎర్గాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన విత్తనాలకు 3 గ్రముల థైరమ్ మందు కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెం.మీ. మరియు వరుసలలో 12 నుండి 15 సెం.మీ. దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. నారు పోసి, 15 రోజుల వయస్సు గల నారు మొక్కలను పైన తెలిపిన దూరంలో నాటుకోవచ్చు. ఎరువులు పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి. నీటి పారుదల పంటకు హెక్టారుకు 80కి|| - 40కి|| - 30కి|| మరియు వర్షాధార పంటకు 60కి|| - 30కి| | - 20కి|| వంతున నత్రజని – భాస్వరం + పొటాష్ నిచ్చే ఎరువులు వాడాలి. నత్రజనిని రెండు దఫాలుగా (విత్తే సమయం, విత్తిన 30 రోజులకు) వేయాలి. అంతర పంట కంది – సజ్జ 2:1 నిష్పత్తిలో వేయవలెను. అంతర కృషి విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా వున్న మొక్కలను తీసి వేయాలి. విత్తిన 3 – 4 వారాల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. విత్తనం, కలుపు మొలకెత్తక ముందే అట్రజిన్ అనే కలుపు మందును హెక్టారుకు 0.8 కిలోల చొప్పున 625 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. సస్యరక్షణ తేలిక నేలల్లో చెదలు రాకుండా హెక్టారుకు 20 కిలోల 5 శాతం కార్బరిల్ పొడిని దుక్కిలో వేసి దున్నాలి. లేత మొక్కదశలో మిడతల నుండి పూత దశలో అక్షింతలు పురుగు నుండి సజ్జ పంటను కాపాడుటకు గాను 5 శాతం కార్బరిల్ పొడిని కాని 2 శాతం మిథైల్ పెరాథియాన్ మందును కాని హెక్టారుకు 20 -25 కిలోల చొప్పున చల్లాలి. పంటకోత – మార్పిడి: సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 – 3 దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి, బంతి కట్టాలి. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.