నేలలు మురుగు నీరు పోయే వసతి గల భూములు, ఎసుక నేలలు, రేగడి నేలలు, గరప నేలలు మరియు నల్లరేగడి నేలలు అనుకూలం. అన్నింటికంటే లోతైన రేగడ భూములు అనుకూలం. విత్తే సమయం ఖరీఫ్: జూన్ – జూలై 15 వరకు, రబీ: అక్టోబర్ – నవంబర్ 15. రకాలు వంగడము దీర్ఘకాలిక రకాలు (100 –120 రో) మధ్య కాలిక రకాలు (85 – 90 రో) స్వల్పకాలిక రకాలు (75 - 85 రో) హైబ్రిడ్ డి.హెచ్.ఎమ్.103 డి.హెచ్.ఎమ్.107 డి.హెచ్.ఎమ్.109 డి.హెచ్.ఎమ్.105 కె.హెచ్.755 డి.హెచ్.ఎమ్.1 బయో. 9681 కె.హెచ్.510 పి.ఆర్ .ఒ.312 బయో. 9637 పి.ఆర్ .ఒ.311 కె.హెచ్.9451 విత్తనం – విత్తేపద్దతి నేలను పంట విత్తేందుకు తయారు చేసిన తరువాత బోదెనాగలి సహాయంతో 75 సెం.మీ. బోదెలు వేసుకుంటే మంచిది. మొక్కకు, మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేటట్లు 20 లేదా 30 సెం.మీ. లోతులో బోదెసాళ్ళ కుడివైపు 1/3 ఎత్తులో విత్తుకోవాలి. బోదె సాళ్ళు నీటిపారుదలకు, అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడుతాయి. హెక్టారుకు 18 కిలోలు (సాధారణ రకాలు) లేదా 13 కిలోల (హైబ్రిడ్ ) విత్తనము సరిపోతుంది. హెక్టారుకు 27,000 మొక్కల సాంద్రత ఉంటే సరిపోతుంది. అంతర పంటలు స్వల్ప కాలిక పంటలయిన పెసర, మినుము,కంది, అలసందలు, సోయాచిక్కుడు, వేరుశనగలను, మొక్కజొన్నతో 2:1 నిష్పత్తిలో అంతర పంటలలుగా వేసుకొని అధిక లాభము పొందవచ్చును. ఎరువులు ఎరువులు హెక్టారుకు వర్షాధారము నీటిపారుదల క్రింద నత్రజని 90 కిలోలు 120 కిలోలు భాస్వరం 50 కిలోలు 60 కిలోలు పొటాష్ 40 కిలోలు 50 కిలోలు వర్షాధారపు పంటకు మొత్తం నత్రజనిలో 2/3 వంతు విత్తే సమయంలో, మిగిలిన దానిని విత్తిన 30 – 40 రోజులకు వేయాలి. నీటిపారుదల క్రింద మొత్తం నత్రజనిలో వెత్తనంతో 1/4 వంతు విత్తే సమయంలో, విత్తిన నెల రోజులకు 1/2 వ6తు, మిగిలిన 1/4 వంతు పంట 50 -55 రోజులు ఉన్నప్పుడు వేయాలి. మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎదువులన్ని విత్తె సమయంలో వేయాలి. జింకు లోపం ఉన్న యెడల హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ మూడు పంటలకు ఒకసారి వేయాలి. పంట వేసిన తరువాత జింకు లోపం వునట్లైతే (ఆకు పసుపు పచ్చ రంగులోకి మారడం లేదా లేత పైరు తెల్ల మొగ్గగా కనిపిస్తే) 2 గ్రా. జింక్ సల్ఫేట్ లీ. నీటిలో కలిపి పైరు పై పిచికారి చేయాలి. నీటి యాజమాన్యం పూత దశ ముందు, పూత దశ, గింజలు పాలుపోసుకునే దశలలో తగినంత తేమ అవసరం. అంతర కృషి హెక్టారుకు 1.2-2కిలోల అట్రజిన్ 500లీ.నీటిలో కలిపి విత్తనము విత్తిన రెండు లేక ముడు రోజుల లోపల భూమిపై పిచికరి చేయాలి. దీనివలన సుమారు 30-35 రోజుల వరకు కలుపు మొక్కలను (వెడల్పాటి ఆకులు గలవి) నివరించవచు. విత్తిన 30 రోజులకు మరియు 45-50 రోజులకు దంతి తిప్పి కలుపు నివారించవచ్చు. సస్యరక్షణ మచ్చల కాండము తొలిచే పురుగు: దీని లార్వాలు ఆకులు పత్రహరితాన్ని తిని ఆకు ద్వారా కాండము లోనికి తొలచి వెళతాయి. లార్వా కాండము అడుగు నుంచి రంధ్రము చేసుకొని లోనికి ప్రవేశించి ఎదిగే భాగాన్ని తిని మొవ్వ చనిపోయేటట్లు చేస్తాయి. గులాబీ రంగు పురుగు లార్వాలు ఆకు మీద పత్రహరితాన్ని తినడం వలన ఆకులు పలుచగా తయారువుతాయి. పురుగు ఆశించిన మొక్క కాండ6లో గుండ్రని లేక “S” ఆకారములో సొరంగాలను చేసి మొవ్వ చనిపోయేలా చేస్తుంది. నివారణ: డి.హెచ్.ఎమ్. 101 మరియు డి.హెచ్.ఎమ్. 103 రకాలు ఈ పురుగులను తట్టుకొంటాయి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నశనం చేయాలి. ఎండోసల్ఫాన్ 2 మి.లీ.లీటరు నీటిలో కలిపి 10 – 20 రోజుల పైరు మీద పిచికారి చేసి అవసరమయిన యెడల మరల 15 రోజుల తరువాత పిచికారి చేయాలి. లేదా ఎండోసల్ఫాన్ గుళికలను పంట వేసిన 10 రోజుల తరువాత హెక్టారుకు 8 కిలోల చొప్పున ఆకు సుడులలో వేసి ఈ పురుగును నివారించవచ్చు. ఆకుమాడు తెగులు ఆకులపైన పొడవైన కోలా ఆకారపు బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చలు మొదట క్రింద ఆకులపై నుంచి పెరిగి, మిగతా ఆకులకు వ్యాపిస్తాయి. నివారణ: తెగులు కనబడినప్పటికి నుండి లీ.నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ కలిపి పూత దశవరకు ఒకసారి పిచికారి చేయాలి ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.