నేలలు : తేలిక రకం ఇసుక నేలలు మరియు బరువు నేలల్లో పండించవచ్చు. రకాలు సీజన్ స్వల్పకాలిక మధ్యకాలిక ఖరీఫ్ మారుతి, చంపావతి సప్తగిరి, కళ్యాణి, భారతి, శ్రీ చైతన్య రబీ మారుతి, చంపావతి సప్తగిరి, కళ్యాణి, భారతి, గోదావరి, వకుళ, హిమ విత్తేసమయం: ఖరీఫ: జూన్ – ఆగస్టు: రబి: నవంబరు –డిశంబర్ జనవరి – ఫిబ్రవరి. విత్తన మోతాదు : 2 కిలోలు (నాటే పద్ధతిలో) 3,2 కిలోలు (వెదజల్లే పద్ధతి) విత్తన శుద్ధి: కార్బండైజిమ్ 2గ్రా/కి లేదా మ్యాంకోజెబ్ 3గ్రా./కిలో నానికి. విత్తేదూరం: స్వల్పకాలిక రకాలు: 15*10 సెం.మీ.దీర్ఘ కాలిక రకాలు:15-20*15 సెం.మీ. నాటటం స్వల్పకాలిక రకాలకు (80-90రోజుల): 21 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటాలి. దీర్ఘకాలిక రకాలకు (105-120రోజుల): 30 రోజుల వయస్సు కలిగిన మొక్కలు నాటాలి. ఎరువుల యాజమాన్యం నారు మడికి (5 సెంట్ల నారుమడికి): 64గ్రా. నత్రజని +140గ్రా.భాస్వరం+48గ్రా. పొటాష్ నిచ్చే ఎరువులు. దుక్కిలో 12కిలోల నత్రజని+12కిలోల భాస్వరం + 8 కిలోల పొటాష్ నాటేటప్పుడు వేయాలి. కలుపు యాజమాన్యం విత్తనం వేయడానికి మరియు నాటటానికి ముందు పెండ్మిధాలిన్ 30% ఎకరాకు 600మి.లీ చొప్పున 200 లీ.నీటితో కలిపి పిచికారి చేయాలి. నాటిన 25,30రోజులకు కలుపు మొక్కల నివారణకు 400గ్రా 2,4–డి సోడియం సాల్ట్ 80% పొడి మందు 200లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. నీటి యాజమాన్యం నాటిన పైరు భాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజుల వరకు వేసవి నీరు పెట్టరాదు. పూత గింజ పాలు పోసుకునే దశలో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. పంట కోత గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు వెన్నుకువిత్త దగ్గర ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు పంటను కోయాలి. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447