భారతదేశంలో పండించే వివిధ రకాల నూనెగింజ పంటల్లో ప్రొద్దతిరుగుడు చాలా ప్రముఖమైనది. తెలంగాణ రాష్ట్రంలో దాదావుగా 78% ప్రజలు వంట నూనెగా ప్రొద్దుతిరుగుడు నూనెను వినియెగిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి ఈ పంట యెక్క విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచవలసిన ఆవశ్యకత ఎత్తెన ఉంది. మంచి నాణ్యమైన విత్తనం రైతుస్ధాయిలో అందుబాటులో లేకపోవడం అనేది కూడా ప్రొద్దుతిరుగుడు పంట యెక్క విస్తీర్ణం తగ్గుదలకు ఒక కారణంగా చెప్పవచ్చు. యాసంగి పంట కలం విత్తనోత్పత్తికి చాలా అనుకూలం. సమీపిస్తున్న యాసంగిని దృష్టిలో ఉంచుకొని యాసంగి ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో చేపట్టవలసిన విధివిధాలను ఈ క్రైంద పేర్కొనడం జరిగింది. నేల ఆవశ్యకత: సమస్యాత్మక భూములను ఎంపిక చేసికోరాదు. క్రితం పంట అదే రకానికి చెందినదై ఉండకూడదు. వేర్పాటు దూరం: తేనెటీగల ద్వారా అవాంఛనీయ పరంపరగా సంపర్కాన్ని నిరోధించుటకు విత్తనోత్పత్తి శేత్య్రాలకు మరియు ఇతర ప్రొద్దుతిరుగుడు శేత్య్రాలకు సుమారు 400 మీ. వేర్పాటు దూరం పాటించాలి. విత్తనం మరియు విత్తే సమయం : మంచి మెలకు శాతం పొందుటకు 2-3 మసాలా ముందు పండించిన విత్తనాన్ని అధికృతి సంస్ధల నుండి పొందాలి. శంకర రకాల విత్తనోత్పత్తి కొరకు ఒక ఎకరానికి 1.5 కిలోల ఆడ రకం మరియు 2 కిలోల మగ రకం యెక్క విత్తనం అవసరం పడతుంది. ఈ విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 30 సెం.మీ. మరియు వరుసకు వరుసకు మధ్య 60 సెం.మీ. దూరం పాటిస్తూ విత్తుకోవలసి ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ రెండవ వారం నుండి పంటను విత్తుకోవటం ద్వారా నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాన్ని పొందవచ్చు. దఫా దఫాలుగా విత్తుకోవడం: ఆడ రకం మరియు మగ రకం మొక్కలు వీలైనంత వరకు ఏకకాలంలో పుష్పియించే విధంగా దఫాలుగా విత్తుకోవడం ద్వారా పుప్పొడి నరఫరా నిరంతరాయంగా ఉంది అధిక విత్తనోతోఅత్థికి దోహదపడుతుంది. విత్తే పద్ధతి : 75:25 నిష్పత్తిలో ఆడ మరియు మగ రకాలను రెండు పక్క పక్క బ్లాకుల్లో వేసుకోవాలి. పుష్పియించే సమయంలో మగ రకం నుండి పుప్పొడిని సేకరించి ఆదారకం పై అడ్డుకోవాలి. కలుపు యాజమాన్యం : ప్రొద్దుతిరుగుడు పంటలో మొదటి 20-30 రోజులు సందిగ్ధదశ ఈ దశలో కలుపును సమర్ధవంతంగా నివారిస్తే అధిక దిగుబడులు లభిస్తాయి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని భూమిలో తేమ ఉన్నప్పుడు ఆక్సిప్లోర్ ఫేన్ అనే కలుపు మందును 0.75 మీ.లి. లీటరు నీటికి కలుపుకొని నేల పై పిచికారీ చేసుకోవాలి. పంట విత్తిన 20-25 రోజుల మధ్య గడ్డి జాతి కలుపు నివారణకు క్విజాలో ఫాప్ - పి - ఇథైల్ 2 మీ.లి. లీటరు లేదా ప్రొపేక్విజాఫాప్ (ఎజిల్) 1.25 మీ.లి. లీటరు నీటిలో కలిపి కలుపు పై పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యం : నేల రకం మరియు వాతావరణ పరిస్ధితులను బట్టి ఎర్రనేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నెలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ మరియు గింజ కట్టే సమయం కీలక దశలు, కాబట్టి ఈ దశలో పంట నీటి ఏడాదికి గురి కాకుండా చూడాలి. కల్తీల ఏరివేత : శాఖీయ దశ నుండి పంట కొత్త వరకు విత్తిన శేత్రంలోని కల్తీ మొక్కలను కాండం రంగు పాత్రల ఆకారం, ఎత్తు, తల పరిమాణం, కొమ్మలు వేసే గుణం పుష్బించే సమయం, పూతలా సంఖ్య, గింజ రంగు, గింజ పై ఉండే చారలు మొదలగు లక్షణాల ఆధారంగా ఏరివేయాలి. తలలు తుంచుట : సంకర విత్తనోత్పత్తిలో ఉపయెగించే మగ వరుసలో ప్రక్క కొమ్మలు వస్తాయి. అయితే శాఖీయ దశలో ఈ ప్రక్క కొమ్మలు తరుంచివేయడం ద్వారా ప్రధాన తలలోని పుప్పొడి ఉత్పత్తి పెరుగుతుంది. పరంగా సంపర్కం : ఆడ మరియు మగ రకం మొక్కలు పుష్బించే సమయంలో మగ మొక్కల నుంచి పుప్పొడిని సేకరించి ఒక మెత్తటి గుడ్డు లేదా బ్రెష్ తో పుప్పొడిని ఆడ మొక్కల యెక్క పూత పై జాగ్రత్తగా ఉదయం 8 గం. నుండి 12 గం. వరకు రోజు విడిచి రోజు సున్నితంగా అద్దాలి. తేనెటీగల పెట్టెలను అమర్చడం ద్వారా తేనెటీగల వాళ్ళ కూడా అనుబంధ పరాగసంపర్కం సిద్ధిస్తుంది. పంటకోత : తల వెనక భాగం ఆకుపచ్చ నుండి నిమ్మ పచ్చ రంగుకు మారినప్పుడు ముందుగా మగ వరుసలను కోసిన తర్వాత ఆడ వరుసలను కోసుకోవాలి. నూర్పిడి మరియు ఆరబెట్టుట : కోత తర్వాత తలలను 15-18% తేమ వచ్చే వరకు ఆరబెట్టి గింజలను వేరుచేసి 9% తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి. శ్రేణీకరణ మరియు విత్తనశుద్ధి : విత్తన రాశిలో బౌతికంగా ఉన్న అవశేషాలు, దుమ్ము, చెత్త చెదారం, కలుపు విత్తనాలు మొదలగు వాటిని వేరుచేయాలి. శుభ్రపరిచి విత్తనాలను శిలింద్ర నాశినులు మరియు కీటక నాశనులతో శుద్ధి చేయటం ద్వారా నిల్వసమయంలో మరియు నేల ద్వారా వ్యాపించే కీటకాలు మరియు వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. సాధారణంగా ఇమిడాక్లోప్రిడ్ 5 మీ.లి. ఒక కిలో విత్తనానికి లేదా డెల్టామేత్రిన్ 0.04 గ్రా. కిలో విత్తనానికి విత్తనశుద్ధి కొరకు వినియెగిస్తారు. పైన పేర్కొన్న విధంగా యాసంగిలో ప్రొద్దుతిరుగుడులో హైబ్రిడ్ విత్తనోత్పత్తి కనుక చేపట్టినతైయితే సుమారుగా ఒక ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ళ దిగుబడి పొందవచ్చు. సాగు వ్యయం ఒక ఎకరానికి దాదాపుగా రూ. 20,000/- వస్తుంది. విత్తనోత్పత్తి ద్వారా ఇంచుమించుగా రూ. 20,000/- నుండి రూ. 25,000/- అదనపు ఆదాయాన్ని పొందవచ్చును. ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం