సంకరజాతి కోళ్ళు కూడ దేశవాళి కోళ్ళలాగే పెరట్లో దొరికే క్రిమికీటకాలు మరియుమిగిలిపోయిన, పడవేసిన ఆహారపదార్థాలపై అధారపడి జీవిస్తాయి. దీనివల్ల రైతులకు తమ ఇంటి వద్దనే పౌష్టిక ఆహారం (గుడ్లు, మాంసం) లభిస్తాయి లేదా అమ్ముకోవడం వల్ల కొంత నిలకడైన ఆదాయం వస్తుంది. ప్రతి 8 – 10 కోడి పెట్టలకు ఒక పుంజును పెంచుకోవాలి. ఈ కోళ్ళకు సాయంత్రం ఇంటికి రాగానే కొంచెం ఏదైన ధాన్యాన్ని కాని దాణాని కాని అదనంగా ఇవ్వటం వల్ల మరింత అధిక లాభం పొందవచ్చును. సాధారణంగా ప్రతి ఇంట్లో లభించేటటువంటి రాగులు, జొన్నలు, నూకలు, బియ్యపు పొట్టు మొదలైన వాటిని పొడి చేసుకొని మిశ్రమంగా తయారు చేసుకొని దాణాగా కూడా ఇవ్వవచ్చును. ఈ విధంగా తయారుచేసుకున్న దాణాకు తగినంత ఖనిజ లవణ మిశ్రమంను కలుపుకోవాలి. ఈ జాతి కోళ్ళు 6.0 నుండి 6.5 నెలల వయస్సులో లైంగికంగా పరిపక్వతకు వచ్చి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. వీటి గ్రుడ్లను దేశవాళి కోళ్ళ ద్వారా పొదిగించి పిల్లలను చేసుకోవచ్చు. గ్రుడ్లు పెట్టే కోళ్ళకు అదనపు కాల్షియమును ఖనిజలవణ మిశ్రమంగా కాని లేదా సున్నపు పొడి/గవ్వల పొడి రూపంలో కాని ప్రతి కోడికి 3 – 4 గ్రాములు అదనంగా ఇవ్వాలి. వీటికి రోగాలు రాకుండా క్రమం తప్పకుండా ఈ క్రింద చూపిన విధంగా టీకాలు వేయించాలి. కోళ్ళలో వ్యాధి నివారణకు టీకాలు వయస్సు రోజులలో టీకా మోతాదు ఇచ్చే పద్దతి మారెక్స్ రోగము 0.20మి.లీ ఇంజెక్షన్ ద్వారా కొక్కెర రోగము (లసోట) ఒక్క చుక్క కళ్ళలో కొక్కెర రోగము (లసోట) ఒక్క చుక్క కళ్ళలో కొక్కెర రోగము (ఆర 2బి) 0.20మి.లీ ఇంజెక్షన్ ద్వారా మరల ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొక్కెర రోగము (ఆర 2బి) టీకాను ఇవ్వవలెను. పద్ధతులు పాటించటంతో పాటు పశువులకు మరియు జీవాలకు భీమా చెయ్యడం వల్ల, ప్రకృతి వైపరిత్యాలు మరియు అంటు రోగాల వల్ల మరణాలు సంభవించినా రైతులు నష్టపోకుండా నిలకడైన లాభాలను ప్రతి సంవత్సరము పొందవచ్చును. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.