ఏపుతోనే చేపు అన్నట్లు లాభధాయకమైన పాడి పశువులకు సంవత్సరం పొడుగున పశుగ్రాసాలు అత్యంత అవసరం. పాడికి ఆధారం పచ్చిమేత, అదిలేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం ఎండుగడ్డి, చొప్ప మీద ఆధారపడి పాడి పశువులను పోషించితే ప్రయోజనం లేదు. ప్రతి రైతు తప్పని సరిగా తమకున్న పొలంలో పదవవంతు పశుగ్రాసం సాగుచేయడానికి ఉపయోగించాలి. పచ్చిమేత మేపిన పశువులలో పాల ఉత్పత్తి పెరిగి ఖర్చులు తగ్గి రాబడి ఎక్కువ ఉంటుంది, మరియు పశువులుసకాలంలో ఎదకు వచ్చి, చూలు కట్టి ఈనుతాయి. పశువులకు కనీసం రోజుకు 8 -10 కిలోల పచ్చగడ్డిని ఇవ్వాలి. ఎండుగడ్డిని అది తినగలిగినంత మేపాలి. పశువులకు వేయు పచ్చగడ్డిలో కనీసం 3వ వంతు పప్పు జాతి లేదా తీగ జాతి గడ్డి రకాలను (ఉలవలు, అలసంద, లూసర్ను, బర్సీము, పిల్లిపెసర మొదలైనవి) మేతగా ఇవ్వాలి. పచ్చమేత కొరతగా ఉన్నప్పుడు వరిగడ్డి/చొప్ప నేపియర్ పచ్చగడ్డి మేస్తున్న ఉస్మానిబాద్ మేకలు సుబాబుల్ పచ్చిమేత మేస్తున్న ఉస్మానిబాద్ మేకలు మొదలగు ఎండుమేతలతో పాటు చెట్ల ఆకులు (సుబాబుల్, గ్లైరిసిడియం, వేప, తుమ్మ, అవిశ, దిరిశెన, రవి, నల్లతుమ్మ మొదలైనవి) 20-30 శాతం వరకు కలిపి మేపితే పాల దిగుబడి తగ్గదు. పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. వేసవికాలంలో తగినంత మేత లేనప్పుడు పశువులు/జీవాలకు తగినంత దాణాను ఇవ్వాలి. దాణాను ఎవరికి వారు తమకు అందుబాటులో ఉన్న దినుసులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో తయారుచేసుకొని పశువులకు ఇవ్వాలి. దాణా తయారీలో ధాన్యాన్ని (25-35 శాతం), వివిధ రకాల ధాన్యపు పొట్టును (పప్పు దినుసుల), తవుడు (గోదుమ/వరి) లాంటి ఉప పదార్థాలను (30-40శాతం), నూనె గింజల చెక్కను (20-25 శాతం), దాణా దినుసులుగా తగినంత పరిమాణంలో వాడుకోవచ్చు. మొదట నూనె గింజల చెక్కను మరియు ధాన్యాన్ని గ్రైండర్ లో వేసి పొడి చెయ్యాలి. దీనికి తవుడు, ఖనిజ లవణాల మిశ్రమం (2 శాతం) మరియు ఉప్పు (1 శాతం) లను కలపాలి. స్థానికంగా దొరికే అందుబాటుని బట్టి, మార్కెట్ ధరలను బట్టి సాంప్రదాయ దినుసులకు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర వనరులను (పత్తి గింజల పొట్టు, మొక్కజొన్న కంకి పిప్పి మొదలైనవి దాణా తయారీలో వినియోగించుకోవాలి. పాలదిగుబడికి పాడి గేదలలో ప్రతి 2.5 లీటర్ల పాలకు మరియు పాడి ఆవులలో ప్రతి 3 లీటర్ల పాలకు ఒక్క కిలో దాణాను అదనంగా పెట్టాలి. మరియు 8 లీటర్ల కంటే ఎక్కువ పాలనిచ్చే పాడి పశువులకు చిన్నప్రేగులో అరుగుదల ఎక్కువగా ఉన్న బైపాస్ ప్రొటీన్లు అధికంగా ఉండే నూనె గింజల చెక్కను తగినంతగా ఇవ్వాలి. ఈ క్రింద చూపిన విధంగా దాణా దినుసులను తగిన నిష్పత్తిలో ఉపయోగించి రైతులు తమ ఇంట్లోనే దాణాను తయారు చేసుకోవచ్చును. దాణా దినుసులు (కిలోలలో) దాణా రకాలు 1 2 3 4 5 6 ధాన్యపు గింజలు 30 20 20 30 37 27 తవుడు (గోధుమ/వరి) 32 50 37 47 10 -- నూనె గింజల చెక్క(పల్లి/కొబ్బరి) 25 20 20 20 20 25 పప్పు దినుసుల పొట్టు -- -- 20 -- 30 25 పత్తి గింజల చెక్క -- -- -- -- -- 20 బెల్లపు పొడి 10 07 -- -- -- -- ఖనిజ లవణాల మిశ్రమం 2 2 2 2 2 2 ఉప్పు 1 1 1 1 1 1 ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.