జీవాలకు వేసవికాలంలో దొరికే (సుబాబుల్ , రావి, నల్లతుమ్మ మొదలైన) చెట్ల ఆకులు మరియు కాయలతో పాటు దాణాను కూడా వాటికి దొరికే మేతను బట్టి తప్పని సరిగా ఇవ్వాలి. అంతేకాక వాటికి జత కలిసే కాలంలో మరియు మేతను బట్టి తప్పని సరిగా ఇవ్వాలి. అంతేకాక వాటికి జత కలిసే కాలంలోని విత్తనం పొట్టేళ్ళను ఏళ్ళతరబడి ఆడ జీవాలతో జత కలపడం వల్ల కొన్ని చెడు లక్షణాలు తర్వాత తరంలోని పిల్ల జీవాలకు వస్తాయి. అందువల్ల కనీసం ప్రతిరెండు సంవత్సరాలకు ఒకసారి విత్తనం పొట్టేళ్ళను వేరే ప్రాంతపు రైతుల పొట్టేళ్ళతో మార్పిడి చేసుకోవాలి. జీవాలకు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల మందు త్రాగించాలి. ఒకసారి వాడిన మందు మరల వాడ కుండా వేరే మందు వాడాలి ఇందువల్ల నట్టలలో నిరోధక శక్తిని అదుపులో ఉంచవచ్చు. జీవాలు ఉన్న కొట్టములో నల్లులు, పిడుదులు మొదలైనవి లేకుండా చూసుకోవాలి. జీవాలకు అంటువ్యాధులు రాకుండా గాలికుంటు, అమ్మతల్లి, పెద్దరోగం, చిటుక రోగం మొదలైన రోగాలకు ముందుగానే పట్టికలో చూపిన విధంగా టీకాలు వేయించాలి. బొబ్బ (అమ్మతల్లి)వ్యాధి లక్షణాలు గొర్రెలలో నాలుక వ్యాధి లక్షణాలు జీవాలలో రోగనిరోధక టీకాల సూచిక టీకాలు వేయించాల్సిన నెలటీకా రకము జనవరి దగ్గు రోగం మార్చి గొంతు వాపు వ్యాధి ఏప్రిల్ బొబ్బ రోగం (అమ్మ జూన్ పారుడు రోగం జూలై జబ్బ రోగం ఆగస్టు గాలి కుంటు వ్యాధి సెప్టెంబర్ టుకు రోగం ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.