పోషకవంతమైన వరిగడ్డి చేయు కారణాలు మామూలు వరిగడ్డిలో మాంసకృతులు అసలే లేవు. మామూలు వరిగడ్డిలో జీర్ణయోగ్యమైన పోషక పదార్థాలు 40 శాతం వుంటుంది. మామూలు వరిగడ్డిలో తేమ 5 – 10 శాతం వరకు ఉండుట వలన పశువులు తక్కువగా మేస్తాయి చేయువిధానం ఒక రోజుకు ఒక పశువుకు 6 కేజిల యూరియాతో మాగగ వేసిన గడ్డి కావలసివస్తుంది. ఒక పశువుకు 7 – 8 రోజులకు 50 కేజీలు కావాలి. ఈ విధంగా పశువులకు కావలసిన మేత ప్రకారము యూరియా మొతాదును నిర్ణయించు కోవాలి. 100 కేజీల వరిగడ్డికి 4 కిలోల యూరియా 60లీటర్ల నీళ్ళు కావాలి. మొట్టమొదట యూరియాను నీళ్ళలో బాగా కరిగేటట్లు కలపాలి. గడ్డిని నేల మీద పరిచి యూరియా కరిగిన నీళ్ళను పూర్తిగా గడ్డిపై చల్లాలి. యూరియా నీళ్ళు గడ్డిపై పూర్తిగా కలిసెటట్లు చూడాలి. కలిపిన గడ్డిని మొత్తము మీద గాలి పోకుండా పైన కప్పాలి. ఇలా చేసిన గడ్డిని పదిహేను రోజుల తరువాత పశువులకు మేపవచ్చును, 4 – 5 నెలలు వరకు వాడుకోవచ్చును. యూరియాతో కలిపిన గడ్డిని బస్తాలలో నింపి గాలి సోకకుండా వారం రోజులు మాగనిచ్చి మేపుకోవచ్చు. ఇలా చేసిన గడ్డిని పశువులు చాలా ఇష్టంగా తి0టాయి. ఒక పశువుకు కావలసిన గడ్డి తయారు చేయటానికి సుమారు రూ.1 – 25 ఖర్చు అవుతుంది. పశువులకు యూరియా కలిపిన నీళ్ళు హానికరము కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యూరియా ద్రావణాన్ని తయారు చేసే పద్ధతిలో రైతులకు శిక్షణ యూరియా చల్లిన వరిగడ్డి ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.