పచ్చిక బీళ్ళలో మేలు జాతి గడ్డి రకాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా బీళ్ళలో, చెంగలి గడ్డి, సేంద్ర గడ్డి, ఎక్కువగా ఉన్నాయి. ఈ రకాలు నెమ్మదిగా పెరుగుతాయి. దిగుబడి తక్కువ. ఒకసారి పశువులు మేస్తే తిరిగి పెరగడానికి చాలా కాలం పడుతుంది. పచ్చిక బీళ్ళకు పనికి వచ్చే గడ్డి, ఈ క్రింద లక్షణాలు కలిగి వుండాలి. తక్కువ వర్షపాతానికి త్వరగా ఎదిగి దిగుబడి ఇవ్వాలి. ఎండాకాలం కూడా చనిపోకుండా తేమ తగలగానే తిరిగి త్వరగా పెరగాలి. పశువులు మేసినందువల్ల గడ్డి దెబ్బతినకుండా త్వరగా పెరగాలి. మంచి ఆహారపు విలువ కలిగి రుచికరంగా వుండాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని పచ్చిక బయళ్లకు ఉపయోగబడు కొన్ని మంచి రకాలు గుర్తించబడినవి. అంజన గడ్డి చిన్న గడ్డి రోడ్స్ గడ్డి కూసా గడ్డి దీనా గడ్డి సిరాట్రా గ్లైరిసిడియా లోసాంథెస్ ఈ మేలు జాతి రకాలు విత్తనాలు చల్లి పచ్చిక బీళ్ళను అభివృద్ధి చేసుకోవాలి. విత్తనాలు చల్లిన సంవత్సరము మేపకుండా పూర్తిగా వదిలి వేయాలి. ఒక ఎకరం పచ్చిక భీళ్ళ నుంచి 1-2 టన్నులు గడ్డి కనీసం 3 -4 నెలలోపల వస్తుంది. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.