ఏక వార్షిక గ్రాసాలలోముఖ్యమైనవి జొన్న, మొక్కజొన్న, సజ్జలు, తీగజాతి (లెగ్యూం) రకాలైన జనుము, ఉలవలు, పిల్లి పెసర, అలసందలు. ఇవి కాకుండా పశుగ్రాస చెట్లు, అవిసె, సుబాబుల్ ,హెడ్జ్ లూసర్న్ మొదలగు చెట్లను పెంచవచ్చు. జొన్న జొన్న పంటని ప్రధాన పశుగ్రాసంగా చెప్పవచ్చు. జొన్న పంటలో రెండు రకాలుగా వున్నాయి. అవి 1. ఒకే కోతనిచ్చేవి. 2. పలు కోతలనిచ్చేవి. ఒకే కోతనిచ్చే రకాలు : సి.యస్.వి.15, సి.యస్.హెచ. 13. యస్. యస్. వి. 84 మొదలైనవి/ పలు కోతలనిచ్చే రకాలు: యస్. యస్.జి. 59 – 3 , పి.సి. 106, యస్. యస్.జి. 988. విత్తనం : ఎకరానికి 6 – 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఎడం : సాలుకు సాలుకు మధ్యలో 30 సెం.మీ. ఎడంగా విత్తాలి. ఎరువులు కిలోల : మెట్టపంటకు ఎకరానికి 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వర, 12 పొటాష్ నిచ్చే ఎరువులు సరిపోతాయి. నీటి పారుదల క్రింద : 40 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వర, 12 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు సరిపోతాయి విత్తేసమయ : జూన్ – జూలై మాసంలో వర్షాధారంగా, సెప్టెంబర్ మాఘీ పంటగా, అక్టోబర్ లో రబీ పంటగా, జనవరిలో ఎండకాలం పంటగా విత్తుకోవచ్చు ఎరువులు వాడకం : నత్రజని ఎరువులు విత్తేటప్పుడు, విత్తిన 35 రోజుల వరకు, అటు ప్రతి కోత తర్వాత ఎరువులు వేయాలి. పంట కోత : 50 శాతం పూతదశలో పంటను పశుగ్రాసంగా వాడుకోవచ్చును. తదుపరి కోతలు 45 రోజులు వ్యవధిలో తీసుకోవాలి. దిగుబడి : ఎకరానికి 6 – 8 టన్నులు, పచ్చి పశుగ్రాసాన్ని పొందవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు : జొన్నను గింజ పట్టక ముందు కోసి మేపరాదు. మొక్కజొన్న రకాలు : ఆఫ్రికన్ టాల్, విజయ్, కిసాన్, గంగా-2, 5, హచ.జి.టి. – 3, జవహర్ మోతి కాంపోజిట్. విత్తేసమయం జూన్ – ఆగస్ట్ , జనవరి – మే (నీటి వసతి ఉన్నప్పుడు) విత్తనం 20 – 24 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. ఎరువులు వాడకం 48 కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం (ఒక ఎకరానికి). నీటి తడులు 7 నుండి 10 రోజులు వ్యవధికి ఒక్కసారి. కత్తిరింపు 70 – 75 రొజులు. కత్తిరింపుల స0ఖ్య ఒక్కసారి (1) దిగుబడి పచ్చి గడ్డి – ఒక ఎకరానికి 160 నుండి 200 క్వింటాళ్ళు.ఎండు గడ్డి – ఒక ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళు. పచ్చి మాంసకృతులు 7.2 ప్రత్యేక లక్షణాలు ఆసిడ్ మట్టి, ఆమ్ల భూములను తట్టుకుంటుంది. మొక్కజొన్న సజ్జ రకాలు జెయంట్ , రాజకొ, కె – 599, టి.55, ఎ.పి.కాంప్లెక్స్ , ఎల్ – 72, ఎల్ 74. విత్తేసమయం జూన్ – ఆగస్ట్ , జనవరి – మే (నీటి వసతి ఉన్నప్పుడు) విత్తనం 1.6 - 2 కిలోలు ఒక ఎకరానికి. విత్తే దూరం 30 సెం.మీ ఎరువులు వాడకం 36 కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం (ఒక ఎకరానికి). నీటి తడులు 15 నుండి 20 రోజులు వ్యవధికి ఒక్కసారి. కత్తిరింపు దశ 50 శాతం (పువ్వుతో ఉన్నప్పుడు). కత్తిరింపు 55 -60 (35 – 40 ) రోజులకు కత్తిరింపుల సంఖ్య రెండు సార్లు (2) దిగుబడి పచ్చి గడ్డి – ఒక ఎకరానికి 160 నుండి 200 క్వింటాళ్ళు.ఎండు గడ్డి – ఒక ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళు. పచ్చి మాంసకృతులు 6.9 టియోసింటె రకాలు మేలైన సిర్ సా విత్తేసమయం జూన్ – ఆగస్ట్ , ఫిబ్రవరి – మే (నీటి వసతి ఉన్నప్పుడు) విత్తనం 16 కిలోలు ఒక ఎకరానికి విత్తే దూరం 30 సెం.మీ. ఎరువులు వాడకం 40 కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం (ఒక ఎకరానికి). నీటి తడులు 15 నుండి 20 రోజులు వ్యవధికి ఒక్కసారి కత్తిరింపు దశ 55 -60 రోజులకు మొదటి కత్తిరింపు, తరువాత 35 – 40 రోజులకు కత్తిరింపు మొదట దశలో 50 శాతం కంకి వచ్చినప్పుడు. కత్తిరింపుల సంఖ్య రెండు సార్లు (2) దిగుబడి పచ్చి గడ్డి – ఒక ఎకరానికి 160 నుండి 200 క్వింటాళ్ళు.ఎండు గడ్డి – ఒక ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళు. పచ్చి మాంసకృతులు 5.6 ప్రత్యేక లక్షణాలు ఆమ్ల భూములలో పంట తట్టుకుంటుంది.మరియొక సారి సూడాన్ గడ్డి రకాలు ఎస్ . ఎస్ జి. 59 – 3 విత్తేసమయం జూన్ – జూలై, జనవరి – మే (నీటి వసతి ఉన్నప్పుడు) విత్తనం 6 కిలోలు ఒక ఎకరానికి. విత్తే దూరం 30 సెం.మీ. ఎరువులు వాడకం 32 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం (ఒక ఎకరానికి). నీటి తడులు 15 నుండి 20 రోజులు వ్యవధికి ఒక్కసారి. కత్తిరింపు దశ 45 – 50 రోజులకు, , 30 – 35 రోజులకు వట్టి కత్తిరింపు వస్తుంది. పూర్తి కత్తిరింపు 55 – 60 రోజులకు. కత్తిరింపుల సంఖ్య నాలుగు నుండి ఐదు (5) దిగుబడి పచ్చి గడ్డి – ఒక ఎకరానికి 160 నుండి 200 క్వింటాళ్ళు.ఎండు గడ్డి – ఒక ఎకరానికి 40 నుండి 50 క్వింటాళ్ళు. పచ్చి మాంసకృతులు 5.7 ప్రత్యేక - లక్షణాలు క్షార భూములలో పెరుగుతుంది ఏక వార్షిక తీగ జాతి (లెగ్యూం) రకాలు జనుము నేలలు అన్ని రకాల నేలలు అనుకూలం విత్తేసమయం అక్టోబర్ – మార్చి వరకు సాగు చేయవచ్చు. విత్తనం 16 కిలోలు ఒక ఎకరానికి విత్తనం వెదజల్లే పద్ధతిలో సరిపోతుంది ఎరువులు వాడకం 16 – 24 కిలోల భాస్వరం (ఒక ఎకరానికి). నీటి తడులు 1 లేదా2 తడులు కత్తిరింపు దశ జనుము పంట 50 శాతం పూత దశలో కోసి నీడలో ఎండబెట్టాలి (50 – 60 రోజులకు) కత్తిరింపుల సంఖ్య ఒక్కసారి. దిగుబడి ఎకరాకు 5 – 6 టన్నులు దిగుబడిని పొందవచ్చు. ఉలవలు నేలలు అన్ని రకాల నేలలు అనుకూలం విత్తేసమయం జూన్ – సెప్టెంబర్ (ఖరీఫ్), సెప్టెంబర్ – డిశంబర్ (మాఘి). విత్తనం 12 - 16 కిలోలు విత్తనం అవసరం (ఒక ఎకరానికి). ఎరువులు వాడకం 18 – 21 కిలోల భాస్వరం దుక్కిలో వేసుకోవాలి (ఒకఎకరానికి). నీటి తడులు 1 లేదా2 తడులు సరిపోతుంది కత్తిరింపు దశ పూత దశ లేదా చిరుకాయ దశలో కోయాలి కత్తిరింపుల సంఖ్య ఒక్కసారి. దిగుబడి ఎకరాకు 10 - 12 టన్నులు పశుగ్రాసాన్ని ఇస్తుంది పిల్లి పెసర పశువులు పచ్చి రొట్టెగా ఇష్టంగా తినేపంట నేలలు అన్ని రకాల నేలలు అనుకూలం విత్తేసమయం జూన్ – ఆగస్ట్ (ఖరీఫ్), డిశంబర్ - ఫిబ్రవరి (రబీ) విత్తనం 8 – 10 కిలోలు విత్తనం అవసరం (ఒక ఎకరానికి) ఎరువులు వాడకం 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం నీటి తడులు 2 లేదా 3 తడులు కత్తిరింపు దశ 50 శాతం పూత దశ మొదటి కోత తదుపరి 30 నుంచి 35 రోజుల కొకసారి కోరలు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు 2 -4 టన్నులు ఇస్తుంది అలసందలు రకాలు యు.పి.సి. 287, ఇ.సి. 4216, ఎస్ .పి. 3, యు.పి.సి. 5286, రష్యన్ జెయంట్ విత్తేసమయం జూన్ – జూలై, ఫిబ్రవరి- జూన్ (నీటి పారుదల క్రింద). కావలసిన విత్తనాలు 30 – 40 కిలోలు విత్తనం అవసరం విత్తు పద్ధతి వరుసల మధ్య అంతరము 45 సెం.మీ ఎరువులు వాడకం 20 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్ (ఒక హెక్టారుకు). నీటి తడులు 12 లేదా 15 రోజులకు మొదటి కోత 55 – 60 రోజులకు పూత దశలో కోతలు ఒకసారి మాత్రమే దిగుబడి పచ్చిమేత 30 నుండి 35 టన్నులు ఇస్తుంది ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.